E-Paper
Advertisement

Deepika Padukone: పని గంటల వివాదాన్ని వదలని దీపికా.. మళ్లీ అదే పాత పాట పాడుతుందే

Deepika Padukone: పని గంటల వివాదాన్ని వదలని దీపికా.. మళ్లీ అదే పాత పాట పాడుతుందే
Advertisement

Deepika Padukone: బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకొనే ప్రస్తుతం అమ్మతనంలో ఉండే మాధుర్యాన్ని అనుభూతి చెందుతున్న విషయం తెల్సిందే. తన చిన్నారి దువా కోసమే దీపికా సినిమాలను కూడా చాలా తగ్గించేసింది. ప్రస్తుతం దీపికా.. బన్నీ – అట్లీ సినిమాలో మాత్రమే నటిస్తుంది. ఇక దీపికా ఇండస్ట్రీలో 8 గంటల పని వివాదాన్ని మొదలుపెట్టి ఎంత రచ్చ చేసిందో అందరికీ తెల్సిందే. ఇండస్ట్రీలో పనిచేసేవారికి సమయం అనేది ఉండదు. కొన్నిసార్లు లేట్ అవుతుంది. ఇంకొన్నిసార్లు త్వరగా అవుతుంది. కానీ,దీపికా మాత్రం ప్రభుత్వ ఉద్యోగులు చేసినట్లు ఇండస్ట్రీలో కూడా 8 గంటలు మాత్రమే పని చేయాలి అని రూల్ పెట్టింది. అది అందరూ ఫాలో అవ్వాలని డిమాండ్ చేస్తుంది. అలా డిమాండ్ చేసే స్పిరిట్, కల్కి 2 సినిమాల నుంచి తీసేసేలా చేసుకుంది.

ఇక  దీపికా పనిగంటలు వివాదం ఆమెతోనే ఆగిపోలేదు.. ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది. కొందరు ఆమెకు సపోర్ట్ గా నిలవగా.. ఇంకొందరు ఆమెను విమర్శించారు. తల్లి అయ్యాక మహిళలకు ఎన్నో పనులు ఉంటాయి.. ఆరోగ్యం చూసుకోవాలి. అప్పుడే ఇంకా ఎక్కువ పని చేయగలం.. అందుకే మనం ఎంతవరకు యాక్టివ్ గా పనిచేయగలమో.. అంతవరకే చేయాలనీ.. అది 8 గంటలు మాత్రమే ఉండడంతో.. అన్ని గంటలు మాత్రమే పని చేస్తాను అని దీపికా చెప్పుకొస్తుంది. ఎప్పటినుంచో ఈ మాటను దీపికా చెప్తూనే ఉంది. తాజాగా మరోసారి కూడా అదే పాత పాట పాడింది దీపికా. తన 8 గంటల పని విధానం సరైనదే అని సమర్ధించుకుంది.

Advertisement

తాజాగా ఒక ఇంటర్వ్యూలో దీపికా మాట్లాడుతూ.. ” తల్లి అయ్యాక నాకు కొన్ని బాధ్యతలు తెలిసి వచ్చాయి. నా తల్లి మీద గౌరవం మరింత పెరిగింది. ఒక మహిళ తలి అయ్యాక.. అటు పిల్లల బాధ్యతను.. ఇటు వర్క్ ను సమానంగా చూసుకోగలదు అని అనుకుంటారు. కానీ, అది చాలా కష్టంతో కూడుకున్న పని. ముఖ్యంగా కొత్తగా తల్లి అయ్యినవారు.. పనిలోకి వస్తున్నారు అంటే వారిని అర్ధం చేసుకోవాలి .  వారికి సపోర్ట్ చేయాలి. మొదటి నుంచి మనం ఎక్కువ పనిచేసినా కూడా అది నార్మలే కదా అని సమర్ధించుకుంటున్నాం. కానీ, మన మైండ్ కి, మనసుకు, శరీరానికి ఎంత సమయం పని చేయగలమో అంతే చేయించాలి.

8 గంటల పని అన్నింటికీ సరిపోతుంది.అదే ఆరోగ్యం. అంతకు మించి పని చేస్తే శరీరం అలిసిపోతుంది. దీని వలన ఆరోగ్యం పాడవుతుంది. అలాంటి సమయంలో పని చేసినా మంచి అవుట్ ఫుట్ ను ఇవ్వలేం. అందుకే నేను 8 గంటల పని విధానాన్ని నమ్ముతాను. నా ఆఫీస్ లో కూడా  ఇదే అమలులో ఉంది. నేను అయితే సోమవారం నుంచి శుక్రవారం వరకే పని చెప్తాను. ఎందుకంటే అందరికీ ఆరోగ్యమే  ముఖ్యం. నిద్ర ఇంకా ముఖ్యం.. సమయానికి నిద్రపోవడం.. వ్యాయామం చేయడం, మంచి పోషకాహార ఆహరం తీసుకోవడం లాంటివి చేయాలి. అన్నింటికంటే నా ఆరోగ్యమే నాకు ముఖ్యం” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

టాక్సిక్ vs ఇరుముడి.. భారీ బడ్జెట్ సినిమాలకు ఇదో గుణపాఠమా?

సాహో ప్రపంచంలోకి ఓజీ..? ఏం ప్లాన్ చేస్తున్నావ్ సుజిత్ ?

మీరే నాకు స్ఫూర్తి… బాబాయ్ కు అబ్బాయ్ విషెస్!

Big Stories

Advertisement
×