E-Paper
Advertisement

Prithviraj Sukumaran: విమర్శించే హక్కు వారికి ఉంది.. జ్ఞానోదయం కల్పిస్తున్న కుంభ!

Prithviraj Sukumaran: విమర్శించే హక్కు వారికి ఉంది.. జ్ఞానోదయం కల్పిస్తున్న కుంభ!
Advertisement

Prithviraj Sukumaran: మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran)తాజాగా చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.. ఆయన నటించిన రాబోయే మూవీ ‘విలాయత్ బుద్ధ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మలయాళీ ప్రేక్షకులను ఆకాశానికి ఎత్తేశారు.. విలాయత్ బుద్ధా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. తన కెరీయర్ ని తీర్చిదిద్దింది మలయాళీ ప్రేక్షకులే… అందుకే ప్రతి విషయంలో నన్ను విమర్శించే హక్కు వారికి ఉంది.. నన్ను నటుడిగా గుర్తించింది మలయాళ ప్రేక్షకులే.. అలాగే వారికి నన్ను విమర్శించే హక్కు కూడా ఉంది.. ప్రేక్షకులతో తన సంబంధం, నమ్మకం జవాబుదారీతనంపై నిర్మించబడింది..

విమర్శించే హక్కు వారికి ఉంది..

నేను ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం వచ్చినప్పుడు ఆ ఈవెంట్ లో నన్ను చూడడం కోసం గుమిగూడిన ప్రేక్షకులను చూస్తున్నప్పుడు నాపై వారికి ఉన్న ప్రేమ అభిమానం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ఇంతమంది వచ్చారంటే అదంతా నాపై వారికి ఉన్న ప్రేమాభిమానాలే. కాబట్టి నన్ను విమర్శించే హక్కు కూడా నా అభిమానులకు ఉంది.. ఇక ప్రేక్షకుల నుండి వచ్చే విమర్శలు కచ్చితంగా స్వీకరిస్తాను. ఎందుకంటే ఆ ప్రేక్షకులే మొదటి నుండి నా ఎదుగుదలకు సహకరించారు. ప్రేక్షకులు నాపై చేసే విమర్శలను పూర్తి గౌరవంతో అంగీకరిస్తాను. సినిమా కోసం 100% కంటే తక్కువ కృషితో ఎప్పుడు కూడా పనిచేయను. సినిమాలోని పాత్ర కోసం 100% ఇస్తాను. నాకు ఉన్న పరిమిత సామర్థ్యాలతో ప్రతి సినిమాకి నా పూర్తి శక్తిని సామర్థ్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాను.” అంటూ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పృథ్వీరాజ్ సుకుమారన్. ఇకపోతే ఆదరించే అభిమానులకే విమర్శించే హక్కు కూడా ఉంది అని చెప్పడంతో.. కొంతమంది విమర్శకులను తప్పుపట్టే సెలబ్రిటీలకు జ్ఞానోదయం కలిగించారు అంటూ నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

విలాయత్ బుద్ధా మూవీ విశేషాలు..

Advertisement

ఈయన చేసిన కామెంట్లు క్షణాల్లో వైరల్ అవ్వడంతో చాలామంది మలయాళీ ప్రేక్షకులు ఈయన మాట్లాడిన మాటలకు ఫిదా అవుతున్నారు.. ఇక పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన విలాయత్ బుద్ధా మూవీ విషయానికి వస్తే..ఈ మూవీ జి.ఆర్. ఇందు గోపన్ రాసిన నవల ఆధారంగా రూపొందించబడింది.. జయన్ నంబియార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకుల మన్ననలు పొందుతుందని చిత్ర నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు.. ఇక ఈ సినిమాలో పృథ్వీరాజ్ సరసన ప్రియమ్వద కృష్ణన్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే ఈ మూవీ నవంబర్ 21న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతుంది.

పృథ్వీ రాజ్ సుకుమారన్ సినిమాలు..

 పృథ్వీ రాజ్ సుకుమారన్ రాబోయే సినిమాల గురించి చూసుకుంటే.. ఈయన పాన్ వరల్డ్ లెవెల్ లో రాబోతున్న ఎస్ఎస్ఎంబి 29 లో మహేష్ బాబు కు విలన్ గా నటిస్తున్నారు.రీసెంట్ గానే ఈయనకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రివీల్ చేశారు.ఇక ఈ మూవీలో పృథ్విరాజ్ సుకుమారన్ కుంభ పాత్ర పోషిస్తున్నట్టు క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఈరోజు అనగా నవంబర్ 15న ఎస్ఎస్ఎంబి 29కి సంబంధించిన గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.

Advertisement

Also read:Bollywood: తల్లిదండ్రులైన స్టార్ జంట.. పోస్ట్ వైరల్!

Related News

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

టాక్సిక్ vs ఇరుముడి.. భారీ బడ్జెట్ సినిమాలకు ఇదో గుణపాఠమా?

Big Stories

Advertisement
×