E-Paper
Advertisement

మరోసారి తల్లి కాబోతున్న దీపికా పదుకొనే.. పోస్ట్ వైరల్!

మరోసారి తల్లి కాబోతున్న దీపికా పదుకొనే.. పోస్ట్ వైరల్!
Advertisement

Deepika Padukone:ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ , అందాల తార దీపికా పదుకొనే (Deepika Padukone) మరొకసారి తల్లి కాబోతోంది. ఈ శుభవార్తను అభిమానులతో పంచుకుంటూ ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్ పంచుకుంది ఈ ముద్దుగుమ్మ. తన కూతురు దూవా (Dua) చేతిలో ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ పట్టుకున్న ఫోటోని షేర్ చేస్తూ తాను మరోసారి తల్లి కాబోతున్నాను అంటూ అభిమానులతో పంచుకుంది. ఇక ఈ విషయం తెలిసిన అభిమానులు, నెటిజన్లు దీపికా పదుకొనే , రణవీర్ సింగ్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పైగా ఈ శుభవార్తను తమ కూతురు చేతులమీదుగా తెలియజేయడంతో అభిమానులు ఈ పోస్టును సోషల్ మీడియా వేదికగా తెగ షేర్ చేస్తున్నారు.

దీపికా పదుకొనే పెళ్లి , పిల్లలు..

ఇకపోతే దీపికా పదుకొనే సహనటుడు అయిన బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ తో 2018లో ఏడడుగులు వేసింది ఇక వివాహం తర్వాత కొంతకాలం సినిమాలకే తమ కెరీర్ను అంకితం చేసి.. 2024లో పండంటి అమ్మాయికి జన్మనిచ్చారు. ఆ అమ్మాయికి దూవా అని నామకరణం కూడా చేశారు. ప్రస్తుతం తన అమ్మాయి చేతుల మీదుగా తమ జీవితంలోకి మరో బిడ్డ రాబోతున్నారు అనే విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.

సెలబ్రిటీల నుండి శుభాకాంక్షలు వెల్లువ..

Advertisement

ఇకపోతే దీపిక పదుకొనే షేర్ చేసిన ఈ పోస్ట్ కు సినీ ప్రముఖులు సమంత (Samantha), భూమి పడ్నేకర్ (Bhumi Padnekar) తో పాటు వేలాదిమంది అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మొత్తానికైతే దీపిక – రణబీర్ దంపతులు తమ జీవితంలో మరొక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతుండడంతో అటు కుటుంబ సభ్యులలో ఇటు అభిమానులలో కూడా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.

also read:నా మాటలను వక్రీకరించారు.. ప్రకాష్ రాజ్ వివరణ!

రాకా మూవీకి బ్రేక్ పడుతుందా?

Advertisement

దీపికా పదుకొనే ప్రస్తుతం మళ్ళీ తల్లి కాబోతున్నానని అభిమానులతో ప్రకటించింది. కానీ ఇప్పుడు సరికొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్ లో వస్తున్న రాకా సినిమాలో ఈమె హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది ప్రేక్షకులు ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి సమయంలో ఈమె ప్రెగ్నెంట్ అని తెలియడంతో ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ వాయిదా వేస్తారా లేక కల్కి సినిమాలో ప్రెగ్నెన్సీ తో నటించినట్లే ఈ సినిమాలో కూడా ప్రెగ్నెంట్ గానే నటిస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి దీపికా పదుకొనే సినిమాల కోసం అంకితమయ్యే మనిషి.. కాబట్టి సినిమాకు బ్రేక్ ఇవ్వకుండా ఖచ్చితంగా నటిస్తుంది అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా గర్భం దాల్చినప్పుడు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు చెబుతారు. కానీ అభిమానులకు వినోదాన్ని పంచడానికి తన ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టి దీపికా నటించడానికి సిద్ధమవుతూ ఉండడంతో ఆమెపై, ఆమెకు నటన పట్ల ఉన్న ఆసక్తి పై సర్వత్రా ప్రశంసలు వెళ్లువెత్తుతున్నాయి.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×