E-Paper
Advertisement

నా మాటలను వక్రీకరించారు.. ప్రకాష్ రాజ్ వివరణ!

నా మాటలను వక్రీకరించారు.. ప్రకాష్ రాజ్ వివరణ!
Advertisement

Prakash Raj:విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ప్రకాష్ రాజ్.. ఈ మధ్యకాలంలో హిందూ మతాన్ని , హిందూ దేవుళ్లను ఉద్దేశిస్తూ చేస్తున్న వ్యాఖ్యల వల్ల పూర్తిగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మధ్యకాలంలో నిత్యం హిందుత్వాన్ని మాత్రమే విమర్శించే ఈయన మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి హిందువుల ఆగ్రహానికి గురైయ్యాడు. రామలక్ష్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలవడంతో అటు సోషల్ మీడియా వేదికగా ఇటు తిరుమల తిరుపతి దేవస్థానం నుండి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అంతేకాదు ఈయన చేసిన వ్యాఖ్యలు మతపరంగా రెచ్చగొట్టేలా ఉన్నాయని విమర్శించారు.

హిందువుల ధర్మ గ్రంథం రామాయణంతో పాటు అశేష హిందువులను కించపరిచాయని వెంటనే ప్రకాష్ రాజ్ పై చర్యలు తీసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి పరువు నష్టం నోటీసు జారీ చేశారు. భాను ప్రకాష్ రెడ్డి తన నోటీసుల్లో ఏడు రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలి అని, చెప్పని నేపథ్యంలో 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావాతో సహా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఎట్టకేలకు స్పందించిన ప్రకాష్ రాజ్..

Advertisement

దీంతో దిగివచ్చిన ప్రకాష్ రాజ్ ఎట్టకేలకు తన మాటలను వక్రీకరించారు అంటూ ఎక్స్ వేదికగా ఒక వీడియోని రిలీజ్ చేశారు. “అందరికీ నమస్కారం ఒక లిటరల్లీ ఫెస్టివల్ లో నేను ప్రసంగించిన మాటలలో కొన్ని మాటలను మాత్రమే తీసుకొని వాటిని వక్రీకరించారు. నేనేదో అవతార పురుషుడు శ్రీరాముడిని హేళన చేశానని, హిందూ ధర్మాన్ని కించపరిచానని తెగ ట్రోల్స్ చేస్తున్నారు. అన్ని మతాలను, అన్ని ధర్మాలను పాటించే నాకు ఇలా మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ధర్మాన్ని మతోన్మాదంతో అడ్డుపెట్టుకొని అసహ్యమైన రాజకీయం చేస్తున్న వాళ్లను నేను అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక కొందరు నన్ను యాంటీ హిందూ , హిందూ నమ్మకద్రోహిగా చూపించడానికి చూస్తున్నారు. పాపం వాళ్ళ ఏడుపు, వాళ్ళ కష్టం నాకు అర్థమవుతుంది. కాబట్టి వాళ్లకు సమాధానం చెప్పాలి. తమిళనాడు ఎలక్షన్స్ పనులు అయిపోయి ఇప్పుడు నేను తోట పనుల్లో బిజీగా ఉన్నాను. త్వరలో వర్షాకాలం వస్తుంది. త్వరలోనే మీ ముందుకు వస్తాను. మీరు అంతవరకు సైలెంట్ గా ఉంటారా లేక ఇలాగే మాట్లాడుతారో మీ ఇష్టం” అంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు ప్రకాష్ రాజ్.

అసలేం జరిగిందంటే?

ఇటీవల కేరళ సాహిత్య ఉత్సవం వేదికగా హిందువులు అత్యంత పవిత్రంగా ఆరాధించే రాముడిని, రామాయణాన్ని అపహస్యం చేసేలా ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు చేశారు. కేరళ సాహిత్య ఉత్సవం సందర్భంగా అక్కడి చిన్నారులు రామాయణ నాటకాన్ని వేయగా.. ప్రకాష్ రాజ్ ఆ సందర్భంగా రామాయణాన్ని, రాముడిని అవమానిస్తూ వ్యాఖ్యలు చేశారు. రామలక్ష్మణులు వలస కూలీలు.. వారు ఉత్తరదేశానికి చెందినవారు.. వారిద్దరూ దక్షిణ భారతదేశముకి చెందిన రావణుడి పొలంలో పండ్లు దొంగలించారు. దానిని చూసిన శూర్పణఖ జిఎస్టి తో కలిపి రెండు వేల డాలర్లు కట్టాలని అడిగింది. రావణుడు దీనికి డిస్కౌంట్ కూడా ఇచ్చాడు . అయితే రాముడు ఆ మొత్తాన్ని చెల్లించలేకపోవడం వల్లే రావణుడు.. రామలక్ష్మణులను విత్తనాలు నాటమని ఆదేశించాడు” అంటూ అపహాస్యంగా కామెంట్లు చేశారు. దీంతోనే హిందువులు ఆయనపై మండిపడగా నేడు తన మాటలను కొంతమంది వక్రీకరించారు అంటూ వివరణ ఇచ్చారు.

Advertisement

also read:తెలుగు ఇండస్ట్రీకి కలిసిరాని 2026 సమ్మర్.. నష్టం భరించాల్సిందేనా?

Related News

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

Big Stories

Advertisement
×