BigTV English
Advertisement

Deepika Padukone: దీపికకు హ్యాండ్ ఇచ్చిన అల్లు అర్జున్‌… ఇక కెరీర్‌ క్లోజ్డ్ ?

Deepika Padukone: దీపికకు హ్యాండ్ ఇచ్చిన అల్లు అర్జున్‌… ఇక కెరీర్‌ క్లోజ్డ్ ?

Deepika Padukone: స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనెకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ప్రస్తుతం ఆమె ఇండస్ట్రీ నుంచి తీవ్ర నెగిటివిటీ వస్తోంది. వరుసగా రెండు భారీ చిత్రాలను నుంచి తప్పించడమే కాదు.. ఆమె తీరు గురించి చేస్తున్న కామెంట్స్‌ ఆమె సినీ కెరీర్‌కే ఎఫెక్ట్‌ అయ్యేలా కనిపిస్తోంది. దీంతో మొన్న స్పిరిటి.. నిన్న కల్కి 2.. ఆ తర్వాత అల్లు అర్జున్‌-అట్లీ మూవీనే అంటున్నారు. నిన్నటి వరకు దీపికా చేతిలో కల్కి 2898 ఏడీ సీక్వెల్‌తో పాటు AA22xA6 సినిమాలు ఉన్నాయి. నిన్నటితో ఆమె చేతి నుంచి కల్కి 2 చేజారిపోయింది.


మొన్న స్పిరిట్.. నిన్న కల్కి.. నెక్ట్స్..

ఈ సినిమా నుంచి దీపికాను తప్పించినట్టు మూవీ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ అధికారికంగా ప్రకటించింది. తెలుగులో మంచి మార్క్‌ కొట్టేయాలనుకున్న దీపికా ఆశలకు నిరాశే మిగిలింది. సందీప్‌ రెడ్డి వంగా స్పిరిట్‌, నాగ్‌ అశ్విన్‌ కల్కి 2 నుంచి తొలగించడంతో ఆమెకు తెలుగులో ఆమె మార్కెట్‌కు దెబ్బ పడింది. కనీసం అల్లు అర్జున్‌ చిత్రం AA22xA6 మూవీతో అయినా నిలబడుతుంది అనుకుంటే.. ఇప్పుడు ఆ ఆశ కూడా లేనట్లే కనిపిస్తోంది. తెలుగులో అల్లు అర్జున్‌ సినిమానే ఆమెకు దిక్కు అనుకుంటే.. అది కూడా పెద్దగా వర్కౌట్‌ అయ్యేలా కనిపించడం లేదు. ఎందుకంటే ఈ సినిమాలో దీపికాది ఫుల్‌ లెన్త్‌ రోల్‌ కాదని తెలుస్తోంది.

ఆమెది కేవలం గెస్ట్‌ రోలేనట. కల్కి 2 నుంచి దీపికాని తొలగించినట్టు ప్రకటన వచ్చినప్పటి నుంచి సోషల్‌ మీడియా, మీడియాలో ఆమె హాట్‌ టాపిక్‌గా మారింది. దీంతో ఇక తెలుగులో ఆమె కెరీర్‌ క్లోజ్‌ అయినట్టేనా? అని అభిప్రాయపడుతున్న క్రమంలో ఆమెకు అల్లు అర్జున్‌ సపోర్టు ఉందిగా కదా ఫ్యాన్స్‌ సమర్ధించుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రంలో దీపికా రోల్‌పై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని దీపికా రోల్ గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో ఆమెది అతిథి పాత్రేనట. హీరోయిన్‌ కాదట. ఇందులో బన్నీ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. AA22xA6లో వీరిద్దరి మెయిన్‌ లీడ్స్‌ అని తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరికి సంబంధించిన చాలా సీన్స్‌ షూటింగ్‌ కూడా అయిపోయిందని తెలుస్తోంది.


Also Read: Zubeen Garg: ఇండస్ట్రీలో విషాదం.. స్క్యూబా డైవింగ్‌ చేస్తూ స్టార్‌ సింగర్‌ మృతి

దీపికా కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇది తెలిసి ఆమె సపోర్టర్స్ అంత నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్‌-అట్లీ మూవీతో అయినా.. దీపికాకి తెలుగులో మంచి గుర్తింపు వస్తుందని ఆశపడ్డారు ఫ్యాన్స్‌. కానీ, ఇందులో ఆమెది గెస్ట్‌ రోల్‌ అని తెలిసి డిసప్పాయింట్‌ అవుతున్నారు. చూస్తుంటే టాలీవుడ్‌లో తన మార్కెట్‌ని నిలబట్టుకోవడానికి ఒకే ఒక్క ఆశ అల్లు అర్జున్‌.. ఇప్పుడు ఈ హీరో కూడా దీపికాకు హ్యాండ్‌ ఇచ్చినట్టే అంటున్నారు. దశాబ్దాలు స్టార్‌ హీరోయిన్‌ దూసుకుపోతున్న దీపికా కెరీర్‌కి స్పిరిట్‌, కల్కి 2లతో బ్రేక్‌ పడేలా కనిపిస్తోంది. ఈ సినిమాల నుంచి ఆమెను తొలగించడమే కాదు.. ఈ సందర్భంగా ఆమెపై వచ్చి ఆరోపణలు చూస్తుంటే ఇక దీపికా సినీ కెరీర్‌ క్లోజ్‌ అయినట్టేనా అని అంతా మాట్లాడుకుంటున్నారు.

Related News

Prakash Raj: కేరళ రాష్ట్ర అవార్డులు.. ప్రకాశ్ రాజ్ పై చైల్డ్ ఆర్టిస్టు ఫైర్

Megastar Chiranjeevi : అన్నపూర్ణ స్టూడియోలో మన శంకరవరప్రసాద్ గారు, సినిమా పూర్తయ్యేది అప్పుడే

Sai Durgha Tej : స్టార్డం అంటే హీరోలతో ఫోటోలు దిగడం కాదు, సాయి తేజ్ అలా అనేశాడేంటి?

Ram Charan: ఆ బాలీవుడ్ డైరెక్టర్ తో రామ్ చరణ్ సినిమా, ఈసారి హిట్ ఖాయం

Thiruveer: ఆ సినిమా టికెట్ కౌంటర్ లోనే చచ్చిపోతా అనుకున్నా

Kaantha First Spark: దుల్కర్ కాంత.. చాలా గట్టిగానే ఉండబోతున్నట్టుందే

Parasakthi: సింగారాల సీతాకోకవే.. ఏముందిరా సాంగ్.. నెక్స్ట్ లెవెల్ అంతే

Ustaad Bhagat Singh : సక్సెస్ కంటే ఫెయిల్యూర్స్ ఎక్కువ, మరి ఉస్తాద్ భగత్ సింగ్ పరిస్థితి ఏంటి?

Big Stories

×