Beauty Movie Review : అంకిత్ కొయ్య హీరోగా చేసిన మరో సినిమా ‘బ్యూటీ’ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ కి ముందు కొంచెం ఎక్కువగానే సౌండ్ చేసిన ఈ సినిమా.. ఆ స్థాయి ఫలితాన్ని అందుకుందో లేదో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి…
ఓ క్యాబ్ డ్రైవర్ అయినటువంటి నారాయణ(నరేష్).. తన కూతురు అలేఖ్యని(నీలఖి) కష్టపడి చదివిస్తూ ఉంటాడు. అయితే కూతురు అంటే ప్రాణంగా భావించే నారాయణ.. ఆమె అడిగినదల్లా వెనకాడకుండా ఇస్తూ ఉంటాడు. ఓ దశలో అలేఖ్య.. నారాయణని ఏకంగా స్కూటి అడుగుతుంది. తన ఫ్రెండ్ కొనుక్కుంది కదా అని ఆమె కూడా తన తండ్రిని కోరుతుంది. అయితే నారాయణ ‘స్కూటి నేర్చుకుంటే కొని పెడతాను’ అని చెబుతాడు. దీంతో ఆమె అర్జున్ కు(అంకిత్ కొయ్య) దగ్గరవుతుంది. స్కూటి కారణంగా మొదలైన వీరి పరిచయం.. తర్వాత స్నేహంగా.. అటు తర్వాత ప్రేమగా మారుతుంది.
అయితే ఒకసారి వీరిద్దరూ వీడియో కాల్ మాట్లాడుకుంటూ ఉండగా.. అలేఖ్య తల్లికి(వాసుకి) దొరికేస్తారు. దీంతో అలేఖ్యని ఆమె తల్లి మందలిస్తుంది. అర్జున్ తో ప్రేమ వ్యవహారం మానుకోవాలని ఒత్తిడి చేస్తుంది. ఈ నేపథ్యంలో అలేఖ్య.. తనని ఎక్కడికైనా తీసుకుపొమ్మని అర్జున్ ను అడుగుతుంది. ప్రేయసి కోరిక మేరకు అర్జున్ ఆమెను హైదరాబాద్ కి తీసుకెళ్ళిపోతాడు. ఆ వెంటనే వీళ్ళని అనుకోకుండా పోలీసులు అరెస్ట్ చేస్తారు. అసలు పోలీసులు ఎందుకు అలేఖ్య, అర్జున్..లను అరెస్ట్ చేశారు. తర్వాత నారాయణ ఏం చేశాడు? చివరికి వీళ్ళ ప్రేమకథ ఏమైంది? అనే ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా.
ఓ యదార్ధ సంఘటన ఆధారంగా ‘బ్యూటీ’ని తెరకెక్కించినట్టు చిత్ర బృందం ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చింది. అలాగే ప్రమోషన్స్ లో దర్శకుడు మారుతీ ఇచ్చిన స్పీచ్ కూడా ఈ సినిమాని వార్తల్లో నిలిపింది. యూత్ ఫుల్ లవ్ స్టోరీస్..కి మొదటి నుండి మంచి డిమాండ్ ఉంది. కరెక్ట్ గా తీస్తే వీటికి టార్గెటెడ్ ఆడియన్స్ ఆదరణ గట్టిగానే ఉంటుంది. పైగా యధార్థ కథ అనే కలరింగ్ ఇవ్వడం వల్ల.. ఏదో విషయం ఉంది అనే భావనతో సినిమాకి వెళ్తారు టార్గెటెడ్ ఆడియన్స్. కానీ ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత.. ఇందులో కొత్తగా ఏమీ లేదు కదా? అనే ఫీలింగ్ కలుగుతుంది.
ఆల్మోస్ట్ సెకండాఫ్ కూడా అలానే సాగుతుంది. కానీ క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్ ఇచ్చి ఆసక్తిని రేకెత్తించారు. అది కూడా కొత్తగా ఏమీ అనిపించదు. కానీ ఈ సినిమా ఫ్లోకి అలాంటి ట్విస్ట్ వస్తుందని ఊహించం. అలా ఉంటుంది ఆ ట్విస్ట్. దర్శకుడు జె.ఎస్.ఎస్ వర్ధన్ ఓ యధార్థ సంఘటనను తీసుకుని దానికి ఎక్కువ లవ్ స్టోరీ కలరింగ్ ఇచ్చాడు.
తర్వాత తండ్రీ కూతుర్ల ఎమోషన్ కి షిఫ్ట్ చేశాడు. అయితే అవి హైలెట్ అనే రేంజ్లో ఏమీ ఉండవు. ఇటీవల ‘త్రిభాణధారి బార్బరిక్’ అనే డిఫరెంట్ మూవీ నిర్మించిన విజయ పాల్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువలకు ఎటువంటి లోటు చేయలేదు.
నటీనటుల విషయానికి వస్తే.. అంకిత్ కొయ్య హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు. కానీ అతని మార్క్ కామెడీ మాత్రం మిస్ చేసేస్తున్నాడు అనిపిస్తుంది. అతని ప్లస్ పాయింటే అది. ఎమోషనల్ సీన్స్ లో అతను తేలిపోతున్నాడు. కొత్తగా తనను తాను ఆవిష్కరించుకోవాలి అనుకున్నప్పుడు కథల ఎంపికలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇక హీరోయిన్ గా చేసిన నీలఖి మైనర్ బాలికగా కరెక్ట్ గా సెట్ అయ్యింది. ఆమె నుండి మెచ్యూర్డ్ పెర్ఫార్మన్స్ ఆశిస్తే తప్పే అవుతుంది కాబట్టి.. ఆమెకు పాస్ మార్కులు వేసేయొచ్చు. ఇక సీనియర్ నరేష్ మరోసారి తనకు అలవాటైన తండ్రి పాత్రలో ఒదిగిపోయాడు. కానీ అతని భార్యగా వాసుకి రాంగ్ ఛాయిస్ అనే చెప్పాలి. ఎందుకో ఇద్దరూ భార్యాభర్తలు అంటే చూడటానికి ఇబ్బందిగానే అనిపించింది. ప్రసాద్ బెహరా,నితిన్ ప్రసన్న వంటి వాళ్ళు జస్ట్ ఓకే.
క్లైమాక్స్
నరేష్ యాక్టింగ్
నిర్మాణ విలువలు
డైరెక్షన్
ఫస్ట్ హాఫ్
మొత్తంగా... ఈ సినిమాకి ‘బ్యూటీ’ అని పేరు పెట్టారు కానీ ‘స్కూటి’ అని పెట్టుంటే బాగుండేది. టార్గెటెడ్ ఆడియన్స్ ని కూడా బోర్ కొట్టించే ఈ సినిమా కథ,కథనాలు .. ఓటీటీ ఆడియన్స్ ని మాత్రం ఆకట్టుకునే అవకాశం ఉంది.