Singer Zubeen Garg Passed Away: సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. బాలీవుడ్ ప్రముఖ సింగర్ జుబిన్ గార్గ్(52) మరణించారు. ఇటీవల సింగపూర్ వెకేషన్‌కి వెళ్లిన ఆయన అక్కడ సముద్రంలో స్కూబా డైవింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు సముద్రంలో పడి ప్రాణాలు కొల్పోయారు. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఆయన మ్రతిపై బాలీవుడ్ సినీ ప్రముఖుల, నటీనటులు, సహా గాయకులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణానికి సంతాపం తెలుపుతూ సోషల్ మీడియాలో వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.
కాగా ఈ నెల 20,21న జరిగే నార్త్-ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ ఈవెంట్‌లో ప్రదర్శన ఇచ్చేందుకు జుబిన్ ఇటీవల సింగపూర్ వెళ్లారు. ఇందులో భాగంగా అక్కడ సరదాగా పర్యటనకు వెళ్లిన ఆయన సముద్రంలో క్యూబా డైవింగ్ చేస్తూ ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదవశాత్తు సముద్రంలో పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి జుబిన్ని బయటకు తీసి రక్షించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జుబిన్ తుదిశ్వాస విడిచారు.
Also Read: Bandla Ganesh : అవును… బండ్లన్న కామెంట్స్‌లో తప్పేముంది ?
అయితే ఇమ్రాన్ హష్మీ–కంగనా రనౌత్ ప్రధాన పాత్రల్లో నటించిన గ్యాంగ్‌స్టర్ సినిమాలో ‘యా ఆలి‘ పాట పాడి ఎంతోమందిని ఆకట్టుకున్నారు. ఈ పాటతో ఆయనతో రాత్రికి రాత్రే స్టార్డమ్ అందుకున్నారు. ఇక ఆ తర్వాత బాలీవుడ్ లో ఎన్నో పాటు పాడి స్టార్ సింగర్‌గా ఎదిగారు. అదే విధంగా హిందీతోపాటూ అస్సామీ, బెంగాలీ, నేపాలీ సహా ఇతర ప్రాంతీయ భాషల్లో పాటలు పాడి కోట్లాది మంది అభిమానులను ఆయన సొంతం చేసుకున్నారు. జుబిన్ గార్గ్ మరణంతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్దిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్స్ పెడుతున్నారు.