E-Paper
Advertisement

Deewana: సమంత వదిలిన ‘ఇది ప్రేమ’ సాంగ్ ఎలా ఉందంటే?

Deewana: సమంత వదిలిన ‘ఇది ప్రేమ’ సాంగ్ ఎలా ఉందంటే?
Advertisement

Deewana: ‘శుభం’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి (Harshith Reddy) హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘దీవాన’ (Deewana). స్మేహ మణిమేగలై హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి రూపొందిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా, మార్చి 24న ఈ చిత్రంలోని ‘ఇది ప్రేమ’ అంటూ సాగే పాటను స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియా వేదికగా విడుదల చేసి, యూనిట్‌కు శుభాకాంక్షలు చెప్పారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో మంచి ఆదరణను రాబట్టుకుంటూ.. వైరల్ అవుతోంది. ఈ పాట (Idi Prema Song Lyrical Video) విషయానికి వస్తే..

Also Read- Director Maruthi: ది రాజా సాబ్ తరువాత మళ్లీ సంక్రాంతికి మారుతి కొత్త సినిమా..హీరో ఎవరంటే..!

మనసుకు తగిలిన తలుకుల పిడుగేంటో

Advertisement

సింగర్ కార్తీక్ తన మధురమైన గొంతుతో ఈ పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు. సాఫ్ట్ మెలోడీగా సాగే ఈ పాట వింటుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. కార్తీక్ వాయిస్ ఈ తరహా ప్రేమ గీతాలకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన అందాన్ని, ఆకర్షణని ఇస్తుందనే విషయం తెలియంది కాదు. ఈశ్వర్ చంద్ అందించిన సంగీతం సింపుల్‌గా ఉన్నా, మెలోడీ ప్రియులను కచ్చితంగా ఆకట్టుకుంటుంది. చైతన్య పింగళి అందించిన సాహిత్యం మనసును హత్తుకునేలా ఉంది. ముఖ్యంగా ‘ఎంతో మొదలైపోతుంది తనువుకు సోయే లేకుంది.. కనులారా చూడాలి ఒకసారైనా..’, ‘మనసుకు తగిలిన తళుకుల పిడుగేంటో..’ వంటి పదాలు ఒక కొత్త ప్రేమ చిగురిస్తున్నప్పుడు కలిగే అనుభూతిని చక్కగా వర్ణించాయి. అలాగే ఈ లిరికల్ వీడియోలో హీరో హర్షిత్, హీరోయిన్ స్నేహ మధ్య వచ్చే సీన్స్ చాలా సహజంగా, క్యూట్‌గా ఉన్నాయి.

Also Read- Dhurandhar 2: ఆ సెంటిమెంట్ బ్రేక్ చేసిన ధురంధర్ 2.. ఇక అందరూ ఇది ఫాలో అవ్వనున్నారా..!

షారుఖ్ ఖాన్ మొదటి చిత్రం పేరు..

Advertisement

సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పాటలోని ఫీల్‌ను పక్కాగా ఎలివేట్ చేశాయి. ముఖ్యంగా ఆఫీస్ బ్యాక్‌డ్రాప్, బస్సు ప్రయాణంలో వచ్చే సన్నివేశాలు యూత్ కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. ఒక ప్లెజెంట్ మెలోడీ వినాలనుకునే వారికి ‘ఇది ప్రేమ’ పాట ఒక మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు. ఈ పాట విడుదల సందర్భంగా హీరో హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ.. మన లైఫ్‌లో ఇదొక్కటి సక్సెస్ అయితే మన జీవితం మారిపోతుంది, జనాలు మనల్ని చూసే విధానం మారిపోతుంది అనిపిస్తుంటుంది కదా. నా జీవితంలో అలాంటి సందర్భమే ఈ సినిమా. ‘దీవాన’తో నా లైఫ్ మారుతుందని నమ్ముతున్నాను. ఈ మూవీ కథ విన్న ఎగ్జైట్‌మెంట్ ఇంకా నాలో ఏమాత్రం తగ్గలేదు. ఈ కథ విన్న తర్వాత వారం రోజుల వరకు అదే ఆలోచనలో ఉండిపోయాను. నేను షారుఖ్ ఖాన్ అభిమానిని. ఆయన మొదటి చిత్రం పేరు కూడా దీవాననే అని తెలుసుకున్న తర్వాత ఈ సినిమా నాకు వర్కవుట్ అవుతుందనే నమ్మకం కలిగింది. కమల్ హాసన్‌కు సద్మా, నాగార్జునకు గీతాంజలి, పవన్ కళ్యాణ్‌కు తొలి ప్రేమ, విజయ్ దేవరకొండ‌కు అర్జున్ రెడ్డి ఎలాగో.. ఈ హర్షిత్ కు ‘దీవాన’ అలా పేరు తెస్తుందని తెలిపారు.

Also Read- Venky Atluri: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సెట్లోకి చిరుతపులి.. షాకింగ్ విషయం చెప్పిన డైరెక్టర్

Related News

షూటింగ్ లో జారిపడ్డ బాలకృష్ణ.. హెల్త్ కండిషన్ పై డైరెక్టర్ గోపీచంద్ క్లారిటీ!

OGకి కొరియన్ కనకరాజుకి ఉన్న కనెక్షన్ ఏంటి?

NBK 111: కాకినాడ షూటింగ్ లో నందమూరి బాలకృష్ణకు గాయాలు.. హెల్త్ కండిషన్ పై డాక్టర్ల క్లారిటీ!

‘ఒడిస్సీ’ లాంటి ప్లానింగ్ మనకు సాధ్యమేనా నాగ్?

నోరు జారితే అంతే.. నెక్స్ట్ స్కిట్‌లో నో ఛాన్స్! జబర్దస్త్ సీక్రెట్ లీక్ చేసిన నటి సత్యశ్రీ

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

Big Stories

Advertisement
×