E-Paper
Advertisement

Deewana Movie: చిన్న సినిమాకు పెద్ద రీచ్.. ‘దీవానా’ టీజర్ రెస్పాన్స్ అదిరిందిగా..

Deewana Movie: చిన్న సినిమాకు పెద్ద రీచ్.. ‘దీవానా’ టీజర్ రెస్పాన్స్ అదిరిందిగా..
Advertisement

Deewana Movie: తెలుగు సినీ పరిశ్రమలో గత కొన్నేళ్లుగా తెలంగాణ గ్రామీణ నేపథ్యం (Rural Backdrop) ఉన్న సినిమాలకు ఆదరణ పెరుగుతోంది. ‘బలగం’, ‘మంగళవారం’, ‘రాజు వెడ్స్ రాంబాయి’ వంటి చిత్రాల కోవలోనే, ఇప్పుడు ‘దీవానా’ చిత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం, టీజర్‌తోనే పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా పూర్తిగా తెలంగాణ పల్లెటూరి వాతావరణంలో సాగుతుంది. టీజర్ గమనిస్తే, అక్కడ ఉండే మనుషులు, వారి యాస, ప్రేమికుల మధ్య ఉండే అమాయకత్వం, భావోద్వేగాలను చాలా ‘రా అండ్ రస్టిక్’ గా చూపించారు. ఒక నిఖార్సైన గ్రామీణ ప్రేమకథను వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నం ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది.

Read also-Dhurandhar 2: రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్ 2’ ప్రీ సేల్స్ సునామీ మామూలుగా లేదుగా.. ఆ రికార్డ్ ఖాయం!

Advertisement

హర్షిత్ రెడ్డి, స్నేహ మణిమేగలై ఈ సినిమాతో తమ ప్రతిభను చాటుకోనున్నారు. ముఖ్యంగా హర్షిత్ రెడ్డి లుక్, బాడీ లాంగ్వేజ్ తెలంగాణ కుర్రాడిని గుర్తుచేసేలా ఉన్నాయి. శ్రీకాంత్ సంగిశెట్టి. తక్కువ బడ్జెట్‌లో నాణ్యమైన కంటెంట్‌ను అందించేందుకు ఆయన కృషి చేస్తున్నారు. ఈశ్వర్ చంద్ అందించిన నేపథ్య సంగీతం పాటలు ఈ సినిమాకు ప్రాణం పోయనున్నాయి. ఈ సినిమాకు సంబంధించి వినిపిస్తున్న మరో ఆసక్తికరమైన అంశం గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్. కంటెంట్ బాగుంటే చిన్న సినిమాలను ప్రోత్సహించడంలో గీతా ఆర్ట్స్ ఎప్పుడూ ముందుంటుంది. ‘దీవానా’ అవుట్‌పుట్ చూసి, ఆ సంస్థ భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపుతోందని సమాచారం. దీనివల్ల సినిమాకు మంచి థియేట్రికల్ రీచ్ లభించే అవకాశం ఉంది.

Read also-Tollywood: నటనతో కాదు సేవాగుణంతో మెప్పిస్తున్న తారలు..స్థాపించిన ఛారిటీ, ఫౌండేషన్స్ ఇవే!

Advertisement

ఆర్టిఫిషియల్ సెట్స్ లేకుండా రియల్ లొకేషన్లలో షూటింగ్ జరగడం ఈ సినిమాకు పెద్ద ఎసెర్ట్ గా మారనుంది. కేవలం లవ్ స్టోరీ మాత్రమే కాకుండా, పల్లెటూరి మనుషుల మధ్య ఉండే సంబంధాలను కూడా స్పృశించబోతున్నారు. ‘రాజు వెడ్స్ రాంబాయి’ లాంటి సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఇది తప్పకుండా నచ్చుతుంది. మొత్తానికి ‘దీవానా’ ఒక చిన్న సినిమాగా మొదలై, తన కంటెంట్‌తో పెద్ద సినిమాగా మారే సంకేతాలను ఇస్తోంది. భారీ అంచనాలతో కాకుండా, ఒక మంచి అనుభూతిని ఇచ్చే సినిమాగా ఇది నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన్ టీజర్ కూడా రికార్డులు క్రియేట్ చేస్తుంది. మిలియన్ వ్యూస్ సాధించి సినిమాకు కంటెంట్ ఎంత అవసరమో తెలియజేస్తుంది.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×