E-Paper
Advertisement

Dhurandhar 2: రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్ 2’ ప్రీ సేల్స్ సునామీ మామూలుగా లేదుగా.. ఆ రికార్డ్ ఖాయం!

Dhurandhar 2: రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్ 2’ ప్రీ సేల్స్ సునామీ మామూలుగా లేదుగా.. ఆ రికార్డ్ ఖాయం!
Advertisement

Dhurandhar 2: భారతీయ సినీ చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా ‘ధురంధర్ 2’ (Dhurandhar 2) బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ముందస్తు బుకింగ్స్ లెక్కలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. తాజా నివేదికల ప్రకారం, భారతదేశ వ్యాప్తంగా ఈ చిత్రం కేవలం ప్రీమియర్ షోల ద్వారానే రూ.26 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. ముందస్తు అమ్మకాల జోరు చూస్తుంటే, ప్రీమియర్ షోలతోనే రూ.30 కోట్లకు పైగా వసూలు చేసిన మొట్టమొదటి భారతీయ సినిమాగా ఇది చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇది వరకు ఉన్న అన్ని మేజర్ రికార్డులను తిరగరాస్తూ, బాక్సాఫీస్ వద్ద రణవీర్ సింగ్ తన పవర్‌ను మరోసారి నిరూపించుకున్నారు.

Read also-Gundeninda GudiGantalu Today episode: సుమతికి పెళ్లి చూపులు.. బాలు, మీనా ఫుల్ హ్యాపీ.. రోహిణికి షాకిచ్చిన ప్రభావతి..

Advertisement

రాష్ట్రాల వారీగా చూస్తే, మహారాష్ట్ర ఈ వసూళ్లలో అగ్రస్థానంలో నిలిచింది. అక్కడ అత్యధికంగా రూ.6.65 కోట్లు వసూలు అవ్వగా, ఢిల్లీ-NCR ప్రాంతంలో రూ. 4.4 కోట్లతో రెండో స్థానంలో ఉంది. దక్షిణాదిలో కూడా ఈ చిత్రం తన ప్రభావాన్ని గట్టిగానే చూపిస్తోంది. కర్ణాటకలో రూ.3.35 కోట్లు, తెలంగాణలో రూ.1.81 కోట్ల వసూళ్లు సాధించి బాలీవుడ్ సినిమాలకు తెలుగు, కన్నడ రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్‌ను చాటిచెప్పింది. అలాగే గుజరాత్ వంటి రాష్ట్రాల్లో కూడా రూ.1.86 కోట్ల బుకింగ్స్ జరిగాయి. దేశవ్యాప్తంగా ఉన్న మేజర్ మల్టీప్లెక్స్‌లు సింగిల్ స్క్రీన్‌లు ఈ చిత్ర ప్రీమియర్ల కోసం ఇప్పటికే హౌస్‌ఫుల్ బోర్డులతో కళకళలాడుతున్నాయి.

Read also-Gundeninda GudiGantalu Today episode: సుమతికి పెళ్లి చూపులు.. బాలు, మీనా ఫుల్ హ్యాపీ.. రోహిణికి షాకిచ్చిన ప్రభావతి..

Advertisement

ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ బడ్జెట్ చిత్రంలో సంజయ్ దత్, ఆర్. మాధవన్ వంటి దిగ్గజ నటులు ఉండటం సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. గతేడాది విడుదలైన మొదటి భాగం అందించిన విజయం, ఇప్పుడు ఈ సీక్వెల్‌కు భారీ ఓపెనింగ్స్ రావడానికి ప్రధాన కారణమైంది. కేవలం ప్రీమియర్లకే ఈ స్థాయిలో రెస్పాన్స్ ఉంటే, మొదటి రోజు రెగ్యులర్ షోల వసూళ్లు రూ.100 కోట్ల మార్కును సునాయాసంగా దాటుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారతీయ స్పై యూనివర్స్‌లో ఈ చిత్రం ఒక మైలురాయిగా నిలవడమే కాకుండా, ఇండియన్ సినిమా గ్లోబల్ మార్కెట్‌ను ఏ విధంగా శాసిస్తుందో ఈ ముందస్తు అమ్మకాల నివేదిక స్పష్టం చేస్తోంది. ఈ సినిమా మరెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి మరి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మార్చి 19, 2026న విడుదల కానుంది. ఇప్పటికే ధురంధర మొదటి భాగం వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసింది. దీంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×