Yellamma: కొంతమందికి సక్సెస్ వచ్చిన తర్వాత కూడా కొన్ని సినిమాలు చేయడానికి టైం పడుతుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో ఒక దర్శకుడు సినిమా సక్సెస్ కొట్టిన తర్వాత రెండో సినిమా చేయటానికి చాలా టైం తీసుకుంటున్నారు. రాజావారు రాణి గారు సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు రవి కిరణ్ కోలా. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా మంచి సక్సెస్ సాధించింది. అయితే ఇప్పటివరకు కూడా తన రెండవ సినిమాని రిలీజ్ చేయలేదు. విజయ్ దేవరకొండ హీరోగా రౌడీ జనార్ధన్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో మొదలు కావలసిన ఈ ప్రాజెక్ట్ రీసెంట్ గాని మొదలైంది.
బలగం సినిమాతో దర్శకుడుగా మంచి పేరు సాధించుకున్నాడు వేణు. నటుడుగా కొన్ని సినిమాలు చేస్తూ, జబర్దస్త్ షో ద్వారా విపరీతమైన గుర్తింపు పొందుకున్న తర్వాత దర్శకుడుగా ప్రయత్నాలు మొదలుపెట్టి సక్సెస్ అయ్యాడు. ఆ సినిమా తర్వాత నాని హీరోగా ఎల్లమ్మ అనే సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా వార్తలు వినిపించాయి. కానీ కొన్ని కారణాల వలన అది జరగలేదు.
నాని కొన్ని కారణాల వలన ఈ సినిమా చేయకపోవడంతో నితిన్ తో సినిమా పూర్తి చేద్దాం అని దిల్ రాజు అన్నారు. దిల్ రాజు బ్యానర్ లో నితిన్ హీరోగా వేణు దర్శకుడుగా ఈ సినిమా ఆల్మోస్ట్ వచ్చేస్తుంది అనుకునే తరుణంలో నితిన్ చేసిన తమ్ముడు సినిమా ఫైల్ అవ్వడంతో ఈ ప్రాజెక్టు సైలెంట్ అయిపోయింది.
అయితే కొన్ని రోజుల తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ప్రాజెక్టు చేస్తున్నారు అని కూడా చెప్పారు. కానీ దాని గురించి అధికారకి ప్రకటన రాలేదు. దేవి శ్రీ ప్రసాద్ నటుడిగా ఈ సినిమాలో కనిపిస్తున్నారు అని వార్తలు వచ్చాయి. అయితే అసలైన విషయం ఏంటంటే ఎల్లమ్మ అనే సినిమాను కేవలం సంగీత దర్శకుడుగానే దేవిశ్రీప్రసాద్ విన్నారట.
అయితే దీని గురించి ఇంకా అధికారికి ప్రకటన లేదు. మామూలుగా సంగీత దర్శకుడుగా అజయ్ అతుల్ ఈ సినిమాకి చేస్తే బాగుంటుంది అని భావించాడు వేణు. ఇప్పుడు దేవిశ్రీప్రసాద్ దగ్గరికి సంగీతానికి వెళ్తే ఎల్లమ్మ సినిమా కథను మోసేది ఎవరు అనేది అందరిలో క్యూరియాసిటీ మొదలైంది.
మరోవైపు కథ మీద చాలామందికి విపరీతమైన నమ్మకం ఉంది. అని ఇలాంటి హీరో ఒక కథను ఓకే చేశాడు అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో నాని చేస్తున్న ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వర్క్ అవుట్ అవుతుంది అంటే దానికి కారణం నాని చేసిన స్క్రిప్ట్ సెలక్షన్.
ఎవరు తినే మెతుకు మీద వాళ్ల పేరు రాసిపెట్టి ఉంటుంది అని చెప్పినట్లు. ఎల్లమ్మ సినిమా ఎవరికి రాసిపెట్టి ఉందో వాళ్లే చేసే అవకాశం ఉంది. ఏం జరుగుతుందో ఎదురు చూడాలి.
Also Read: Ustaad bhagat singh : పవన్ కళ్యాణ్ డాన్స్ ఇరగదీశారు, దేవి ఏమన్నాడంటే?