Congress vs BRS: భద్రాద్రి జిల్లా మణుగూరు BRS ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.BRS ఆఫీస్ పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. ఆఫీస్ లోని ఫర్నీచర్‌ను బయటపడేసి కాలబెట్టారు.BRS జెండా గద్దెను ధ్వంసం చేశారు.తంలో అది కాంగ్రెస్ కార్యాలయమే అని కార్యకర్తలు అంటున్నారు. రేగా కాంతారావు BRS ఆఫీస్ గా మార్చారని ఆరోపిస్తున్నారు. పార్టీ ఆఫీస్ కు కాంగ్రెస్ రంగులు వేసుకున్నారని.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కార్యాలయం మాదే అంటూ లోపలికి దూసుకువెళ్లారు. దీంతో వారి మధ్య ఘర్షణ ఏర్పడింది. దాంతో పాటు ఇరువురు నేతల మధ్య తోపులాట.. ఒకరికొకరు కొట్టుకోవడంతో కొంత మందికి స్వల్ప గాయాలయ్యాయి.