Thalaivar 173: సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) ఇటీవల కూలీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. లోకేష్ కనగారాజ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరవాలేదు అనిపించుకుంది. ఇక ఈ సినిమా తర్వాత రజనీకాంత్ తన తదుపరి సినిమా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. జైలర్ సినిమాకు సీక్వెల్ చిత్రంగా జైలర్ 2 (Jailer 2)పనులలో రజనీకాంత్ ఎంతో బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల రజనీకాంత్ కొత్త సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే.
తలైవార్ 173(Thalaivar 173) సినిమాని ప్రముఖ లెజెండరీ నటుడు కమల్ హాసన్(Kamal Hassan) నిర్మాణంలో చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమాకు దర్శకుడు సుందర్ సి (Sundar.c)దర్శకత్వం వహించబోతున్నారని తెలియచేయడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఈ సినిమా ప్రకటన వచ్చిన వారం వ్యవధిలోగా ఈ సినిమా నుంచి సుందర్ తప్పుకుంటున్నట్లు అధికారికంగా వెల్లడించడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అయ్యారు. ఇక ఇదే విషయం గురించి కమల్ హాసన్ కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా నుంచి సుందర్ తప్పుకోవడంతో రజనీకాంత్ ను డైరెక్టర్ చేయబోయే దర్శకుడు ఎవరు అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు.
ఈ క్రమంలోనే రజనీకాంత్ మాజీ అల్లుడు ధనుష్ (Danush)తలైవార్ 173 సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారంటూ వార్తలు బయటకు వచ్చాయి దాదాపు ఈ వార్తలు నిజమేనని తెలియడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది కదా అసలైన కాంబినేషన్ అంటూ సంతోషం వ్యక్తం చేశారు అయితే తాజాగా మరొక విషయం వెలుగులోకి వచ్చింది. తలైవార్ 173 సినిమాకు ధనుష్ దర్శకత్వం వహించబోతున్నారు అంటూ వస్తున్న వార్తలలో ఏమాత్రం నిజం లేదని ఈ వార్తలు పూర్తిగా ఆ వాస్తవమేనని తెలుస్తోంది. ఇప్పటికీ చిత్ర నిర్మాతలు సరైన కథ, దర్శకుడి కోసం వెతుకుతున్నారని, రజనీకాంత్ చేయబోయే ఈ సినిమా విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా రజనీకాంత్ కు పూర్తిగా సంతృప్తినిచ్చే కథ కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది.
జైలర్ 2 పనులలో బిజీగా రజిని..
ఇలా రజనీ కాంత్ లాంటి స్టార్ హీరో కోసం డైరెక్టర్లు దొరకకపోవడం ఏంటీ అంటూ అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి రజనీకాంత్, కమల్ హాసన్ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాని డైరెక్ట్ చేసే అవకాశం ఎవరు అందుకుంటారనేది తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం రజనీకాంత్ జైలర్ 2 సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పనులు చివరి దశకు చేరుకున్నాయని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన అనంతరం కమల్ హాసన్ నిర్మాణంలో రజనీకాంత్ బిజీ కానున్నారు.