E-Paper
Advertisement

IRCTC Rules: టీడీఆర్ vs క్యాన్సలేషన్.. ఏది బెటర్? ఎందుకు?

IRCTC Rules: టీడీఆర్ vs క్యాన్సలేషన్..  ఏది బెటర్? ఎందుకు?
Advertisement

Indian Railway: భారతీయ రైల్వే అనివార్య పరిస్థితుల్లో రీఫండ్ పొందేందుకు ప్రయాణీకులకు అవకాశం కల్పిస్తుంది. వాటిలో ఒకటి టీడీఆర్(Ticket Deposit Receipt) కాగా, మరొకటి టికెట్ క్యాన్సిలేషన్. ప్రయాణీకులు ముందుగానే తమ ప్రయాణాన్ని రద్దు చేసుకుంటే టికెట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. టికెట్ క్యాన్సిల్ చేయలేని పరిస్థితుల్లో ట్రైన్ ఆలస్యం, డైవర్షన్, మిస్ అవ్వడం లాంటి సమయాల్లో రీఫండ్ క్లెయిమ్ చేయడానికి టీడీఆర్ ఉపయోగపడుతుంది.

టికెట్ క్యాన్సిలేషన్ ఎప్పుడు చేసుకోవచ్చు? 

ఒకవేళ మీ ప్రయాణం క్యాన్సిల్ అయితే, టికెట్ రద్దు చేసుకోవడం బెటర్. చార్ట్ ప్రిపేరేషన్ ముందు అంటే సాధారణంగా 4-8 గంటల ముందు క్యాన్సిల్ చేసుకోవాలి. ఆ తర్వాత క్యాన్సల్ చేయలేం. మీరు ప్రయాణానికి 48 గటల ముందు టికెట్ క్యాన్సిల్ చేస్తే పూర్తి రీఫండ్ పొందే అవకాశం ఉంటుంది. అయితే, ఏసీలో రూ. 240, స్లీపర్ లో రూ. 120 కట్ చేయబడుతుంది. ప్రయాణ సమయానికి 12 గంటల ముందు టికెట్ క్యాన్సిల్ చేస్తే 50 టికెట్ ధరలో 50 శాతం రీఫండ్ వస్తుంది. వెయిట్ లిస్టులో ఉన్న వాళ్లు చార్ట్ ప్రిపరేషన్ కు ముందు క్యాన్సిల్ చేసుకుంటే పూర్తి రీఫండ్ లభిస్తుంది. చార్ట్ తర్వాత క్యాన్సిల్ చేసినా, తత్కాల్ టికెట్ క్యాన్సిల్ చేసినా రీఫండ్ రాదు.  IRCTC యాప్/వెబ్‌సైట్‌లో ఈజీగా టికెట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇన్‌ స్టంట్ రిఫండ్ లభిస్తుంది. .

టీడీఆర్ ఎప్పుడు ఫైల్ చెయ్యొచ్చు?

Advertisement

టీడీఆర్ అనేది రైలు ఆలస్యం అయినా, రద్దు అయినా, వెయిట్‌ లిస్ట్‌ లో ఉన్నా, రైలు మిస్ అయినా ఫైల్ చేసుకోవచ్చు. ట్రైన్ డిపార్చర్ తర్వాత 72 గంటల వరకు ఫైల్ చేయవచ్చు. ట్రైన్ క్యాన్సిల్ అయితే ఆటోమాటిక్ గా 100% రీఫండ్ వస్తుంది. టీడీఆర్ అవసరం లేదు. రైలు ఆలస్యం అయినా, దారి మళ్లించినా, ఫూర్తి రీఫండ్ వస్తుంది.  రైలు మిస్ అయితే క్లెర్క్ సర్టిఫికెట్‌ తో 100%  రీఫండ్ వస్తుంది. కానీ, టాక్స్ కట్ అవుతుంది. IRCTCలో “File TDR” ఆప్షన్‌ తో ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. రీఫండ్ 60 రోజుల వరకు పడుతుంది. ప్రాసెస్ లాంగ్, కొన్నిసార్లు రిజెక్ట్ అవుతుంది.

టీడీఆర్,  క్యాన్సలేషన్ లో ఏది బెటర్?

మీరు ముందుగానే ప్లాన్ మార్చుకుంటే క్యాన్సలేషన్ బెటర్. చార్ట్ ముందు  టికెట్ క్యాన్సిల్ చేసుకోవడం బెస్ట్. సులభంగా,  వేగంగా రిఫండ్ వస్తుంది.  ట్రైన్ ఆలస్యం, రూట్ చేంజ్, రైలు మిస్ అయితే టీడీఆర్ బెటర్. ట్రైన్ కంప్లీట్ క్యాన్సల్ అయితే TDR అవసరం లేకుండానే ఆటో రిఫండ్ వస్తుంది.

Advertisement

Read Also: రైలు మిస్ అయ్యిందా? సింపుల్ గా టికెట్ రీఫండ్ పొందండిలా!

TDR ఎలా ఫైల్ చేయాలి?  

⦿ ముందుగా IRCTC వెబ్‌ సైట్/యాప్‌ ఓపెన్ చేయాలి.

⦿ “My Account” > “My Transactions” > “File TDR” క్లిక్ చేయండి.

⦿ PNR, రీజన్ సెలెక్ట్ చేసి సబ్మిట్.

⦿ OTP వెరిఫై చేయండి. రిఫండ్ 60 రోజుల్లో వస్తుంది.

Read Also: తొలుత ఒకటి, తర్వాత ఎనిమిది.. వందేభారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

Related News

డ్రోన్ తో వందే భారత్ వీడియోలు తీస్తున్నారా? ఇక కటకటాల్లోకి వెళ్లక తప్పదు!

కోడైకనాల్ టూర్‌కు వెళ్లేవారికి అలర్ట్.. ఇక ఆన్‌లైన్ లో టికెట్ తీసుకోవాల్సిందే!

పులులను దగ్గరగా చూడాలనుందా? అయితే, ఐఆర్‌సిటిసి ‘వన్ దర్శన్’ యాత్రకు రెడీ అవ్వండి!

హైదరాబాద్‌కి ఇంత దగ్గర్లో ఇలాంటి అందమైన జలపాతం ఉందా? వీకెండ్ ట్రిప్‌కు పర్ఫెక్ట్ ప్లేస్!

రైలు టికెట్లు బుక్ చేస్తున్నారా? సీట్లు ఉన్నాయో? లేవో? సింపుల్ గా ఇలా చెక్ చేయండి!

అయ్యప్ప భక్తులకు రైల్వే గుడ్ న్యూస్.. 148 స్పెషల్ ట్రైన్లు!

పండుగ సీజన్‌.. ఫ్యామిలీ నుంచి సోలో ట్రిప్ వరకు.. బెస్ట్ 5 టూరిస్ట్ డెస్టినేషన్లు!

దసరా వేళ మాత్రమే తెరుచుకునే అద్భుత ఆలయం.. ఏడాదిలో 11 రోజులే దర్శనం.. మిస్టరీ తెలిస్తే షాకే!

Big Stories

Advertisement
×