E-Paper
Advertisement

OTT Movie : ఊళ్ళో ఏ అమ్మాయినీ వదలని దొర… బతికుండగానే కూతురిని పూడ్చిపెట్టే తండ్రి… మెంటలెక్కించే ట్విస్టులు

OTT Movie : ఊళ్ళో ఏ అమ్మాయినీ వదలని దొర… బతికుండగానే కూతురిని పూడ్చిపెట్టే తండ్రి… మెంటలెక్కించే ట్విస్టులు
Advertisement

OTT Movie : హిస్టారికల్ సినిమాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. చూసే కొద్ది చూడాలనిపించే ఈ స్టోరీలు ఓటీటీలో చాలానే ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కథ కాస్త డిఫరెంట్ గానే ఉంటుంది. స్వతంత్రం వచ్చే సమయంలో ఒక గ్రామంలో ఈ స్టోరీ రన్ అవుతుంది. ఒక తెల్ల దొర ఆరాచకాలతో ఈ స్టోరీ ఉత్కంఠంగా సాగుతుంది. హిస్టారికల్ ఫ్యాన్స్ ఈ సినిమాపై ఓ లుక్ వేయండి. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

‘ఆగస్ట్ 16, 1947’ అనే ఈ సినిమా 2023లో విడుదలైన తమిళ హిస్టారికల్ సినిమా. ఇది ఎన్.ఎస్. పోన్ కుమార్ డైరెక్ట్ చేసిన డెబ్యూ ఫిల్మ్. ఎ.ఆర్. మురుగదాస్, పర్పుల్ బుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో ఇది రూపొందింది. ఈ సినిమా 2023న ఏప్రిల్ 7న థియేటర్లలో విడుదలైంది. 2 గంటల 20 నిమిషాల నిడివితో ఐయండిబిలో 6.7/10 రేటింగ్ పొందింది. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఇండియాకి 1947 ఆగస్ట్ 15న స్వతంత్రం వస్తుంది. కానీ దక్షిణ తమిళనాడులోని సెంగాడు అనే మారుమూల గ్రామానికి ఈ వార్తే రాదు. అక్కడ బ్రిటిష్ ఆఫీసర్ రాబర్ట్ తన కొడుకు జస్టిన్‌తో కలిసి క్రూరంగా పాలిస్తుంటాడు. గ్రామస్తుల్ని బానిసలుగా చూస్తూ ట్యాక్స్ వసూలు చేసి, మహిళలపై అఘాయిత్యాలు చేస్తూ ఉంటాడు. స్వతంత్రం వచ్చిన విషయాన్ని అక్కడి ప్రజలకు తెలీకుండా పోస్ట్‌మాన్‌ని బంధించి, రేడియో సిగ్నల్స్ కట్ చేసి ఇంకా బ్రిటిష్ పాలన ఉందని మోసం చేస్తాడు. ఆ గ్రామ యువకుడు పరమ్ ఎంట్రీతో కథ మారిపోతుంది. ఆ ఊరి జమిందారి కూతుర్ని అతను ప్రేమిస్తుంటాడు. అయితే ఆమెను చూసిన తెల్ల దొర, తనని ఇంటికి పంపమని జమిందారిని బెదరిస్తాడు.

Read Also : ప్రేమించకపోతే చంపేస్తుంది… ఆమె కంట్లో పడ్డ మగాడికి దబిడి దిబిడే

Advertisement

ఈ అన్యాయాలు చూసి తట్టుకోలేక పరమ్ తిరుగుబాటు చేస్తాడు. ఒకరోజు దూరంగా వెళ్లి రహస్యంగా రేడియోలో నెహ్రూ స్పీచ్ వింటాడు. ఇండియాకి స్వతంత్రం వచ్చిందని తెలుసుకుని షాకవుతాడు. ఆ వార్తను గ్రామస్తులకు చెప్పగానే అందరూ ఒక్కసారిగా మేలుకొని, కర్రలు, రాళ్లు, వ్యవసాయ పనిముట్లు తీసుకుని బ్రిటిష్ వాళ్లపై తిరుగుబాటు మొదలు పెడతారు. ఈ పోరులో చాలా మంది గ్రామస్తులు ప్రాణాలు కోల్పోతారు. పరమ్ కూడా తీవ్రంగా గాయపడతాడు కానీ గ్రామంలో తొలిసారిగా జెండా ఎగురవేస్తాడు. ఆగస్ట్ 16న సూర్యోదయంతో ఆ గ్రామం స్వతంత్రం అవుతుంది.

 

 

 

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×