E-Paper
Advertisement

Dhanush: టాలీవుడ్ హీరోలు చేయలేనిది ధనుష్ చేసి చూపిస్తున్నాడు..

Dhanush: టాలీవుడ్ హీరోలు చేయలేనిది ధనుష్ చేసి చూపిస్తున్నాడు..
Advertisement

Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి తెలుగు ప్రేక్షకులకు సైతం ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోగా, నిర్మాతగా డైరెక్టర్ గా  వరుస సినిమాలు చేస్తూ విజయం అందుకోవడంలో ధనుష్ మొదటి వరుసలో ఉంటాడు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సాధారణంగా ఒక భాష నుంచి ఇంకో భాషలో సినిమాలు చేసే హీరోలు చాలా మటుకు పరాజయలను చవిచూస్తూ వస్తున్నారు. కానీ, ధనుష్ మాత్రం ఏ భాషలో సినిమాలు చేసిన విజయాలను అందుకుంటూ ఇండస్ట్రీనే  షాక్ కు గురి చేస్తున్నాడు.

తెలుగులో సినిమాలు చేస్తే తెలుగులో హిట్టు అందుకుంటున్నాడు. తమిళ్ లో  సినిమాలు చేస్తే అక్కడ హిట్ అందుకుంటున్నాడు. ఇక బాలీవుడ్లో సైతం తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటున్నాడు. ఇప్పటికే ధనుష్ హిందీలో నాలుగు సినిమాలు చేశాడు. ఈ నాలుగు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక తాజాగా ఐదో సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది.

Advertisement

ధనుష్ హీరోగా ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం తేరే ఇష్క్ మైన్.  కృతి సనన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ ను  మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.  ఈ చిత్రంలో ధనుష్ రెండు డిఫరెంట్ రోల్స్ లో నటిస్తున్నట్లు కనిపిస్తుంది.  కాలేజ్ డేస్ లో చాలా అగ్రెసివ్ బాయ్ ఫ్రెండ్ గా కనిపించగా.. ఇంకొకటి పైలెట్ గా  ఒక ప్రొఫెషనల్ రోల్లో కనిపించబోతున్నాడు.

ట్రైలర్ మొత్తం లో ధనుష్, కృతి మధ్య ఉన్న ప్రేమను.. ఆ ప్రేమ తాలూకు జ్ఞాపకాలను చూపించారు. ట్రైలర్ చాలా ఇంప్రెస్సివ్ గా ఉందని  నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. నవంబర్ 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకునేలా ఉందని చెప్పుకొస్తున్నారు. రాంజానా తర్వాత మళ్లీ ఆనంద్ ఎల్ రాయ్ – ధనుష్ కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

Advertisement

ఇక ధనుష్ కథల ఎంపికపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏ భాషలోనైనా కథలను ఎంచుకోవడం వల్ల విజయాలు దక్కుతాయని, అలా ఎంచుకోవడం  ధనుష్ కి బాగా తెలుసు అని చెప్పుకొస్తున్నారు. ఇక టాలీవుడ్ హీరోలు చేయలేని పనిని ధనుష్ చేస్తున్నాడని మాట్లాడుకుంటున్నారు. గత కొంతకాలంగా టాలీవుడ్ హీరోలు బాలీవుడ్ లో పాగా వేయడానికి ప్రయత్నిస్తున్న విషయం తెలిసింది. ఇప్పటికే రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్ వీరందరూ బాలీవుడ్ లో సినిమాలు చేసి పరాజయాన్ని అందుకున్నారు. కానీ, ధనుష్ మాత్రం వరుసగా బాలీవుడ్ సినిమాలు చేస్తూ విజయాలను దక్కించుకుంటున్నాడు. ఈ సినిమా కూడా విజయాన్ని అందుకుంటే మాత్రం ధనుష్ బాలీవుడ్ లో గట్టి ఇంపాక్ట్ చూపిస్తాడు అని చెప్పడంలో అతిశయోక్తి  లేదని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. మరి ఈసారి ధనుష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడు చూడాలి.

Related News

చిరు ‘కాక’ వాయిదా రూమర్లపై క్లారిటీ .. సంక్రాంతి పోటీకి సై అంటూ!

సౌందర్య మరణంపై స్టార్ హీరో ఎమోషనల్ కామెంట్స్!

రాకాను వెంటాడుతున్న వరుస లీకులు.. కథ మొత్తం లీక్ చేసేస్తారా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘కృష్ణంభజే’ నుండి ఫస్ట్ లుక్ లాంఛ్ !

సంక్రాంతి రేస్ నుంచి చిరంజీవి ‘కాకా’ ఔట్? నిజమేనా?

ఇరుముడి సినిమాకు భారీ షాక్…ప్రొజెక్టర్ ద్వారా వీధుల్లో ప్రదర్శనలు!

భార్యను కలవబోతున్న సీఎం విజయ్…త్రిష సైడ్ అవ్వాల్సిందేనా?

రజినీ జైలర్ 2 కథ ఇదేనా? ఈసారి టార్గెట్ ఎవరో తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×