E-Paper
Advertisement

Bollywood: పెళ్లిరోజు నాడే తల్లిదండ్రులుగా ప్రమోషన్.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సెలబ్రిటీ కపుల్స్!

Bollywood: పెళ్లిరోజు నాడే తల్లిదండ్రులుగా ప్రమోషన్.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సెలబ్రిటీ కపుల్స్!
Advertisement

Bollywood: ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఒకరి తరువాత ఒకరు అభిమానులకు శుభవార్త తెలుపుతూ సంతోషాన్ని నింపుతున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది పెళ్లి చేసుకుంటే.. మరికొంతమంది నిశ్చితార్థం చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఇంకొంతమంది పెళ్లయిన జంటలు గర్భం దాలిస్తే.. మరి కొంతమంది పాపకో బాబుకో జన్మనిస్తూ తమ జీవితాన్ని సాఫల్యం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఒక జంట పండంటి బిడ్డకు జన్మనిచ్చారు.ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ స్పెషల్ పోస్టు షేర్ చేశారు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈరోజే వారి పెళ్లి రోజు కూడా కావడం గమనార్హం.

తల్లిదండ్రులైన స్టార్ కపుల్..

అసలు విషయంలోకి వెళ్తే.. వారెవరో కాదు ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో రాజ్ కుమార్ రావు (Raj Kumar Rao), ప్రముఖ నటి పత్రలేఖ పాల్ (Patralekha paul).. 2021లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. హిందీలోనే వరుస చిత్రాలు చేస్తూ బిజీగా మారిపోయారు. రాజ్ కుమార్ రావు హీరోగా వరుస సినిమాలు చేస్తుండగా.. పత్రలేఖ ఒకవైపు హీరోయిన్గా నటిస్తూనే.. మరొకవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఇకపోతే సెప్టెంబర్ లో బేబీ బంప్ తో కొన్ని ఫోటోలు షేర్ చేసి అభిమానులను సంతోషపరిచిన పత్రలేఖ.. తాజాగా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

వెడ్డింగ్ యానివర్సరీ రోజే పేరెంట్స్ గా ప్రమోషన్..

Advertisement

ఈ విషయాన్ని రాజకుమార్ రావు తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. తమకు పండంటి పాపాయి జన్మించింది అని తెలిపారు. ఇకపోతే తమ నాలుగవ వెడ్డింగ్ యానివర్సరీ రోజే పాప పుట్టిందని ప్రకటించారు. వాస్తవానికి 2021 నవంబర్ 15 ఈ జంట ప్రేమ పెళ్లి చేసుకుంది. సరిగ్గా నాలుగేళ్ల తర్వాత అంటే ఈరోజు 2025 నవంబర్ 15న వీరికి ఆడపిల్ల పుట్టింది. దీంతో ఈ బాలీవుడ్ స్టార్ కపుల్స్ ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. ఇక మొత్తానికైతే పెళ్లి రోజు నాడే తల్లిదండ్రులుగా కూడా ప్రమోషన్ పొందడంతో ఈ బాలీవుడ్ స్టార్ కపుల్స్ కి అటు సెలబ్రిటీలు, ఇటు అభిమానులు, నెటిజన్లు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ వీడియోలు వైరల్ గా మారుతోంది.

రాజ్ కుమార్ రావు సినిమాలు..

బాలీవుడ్ నటుడిగా పేరు సొంతం చేసుకున్న రాజకుమార్ రావు 2010లో విడుదలైన రణ్ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇందులో న్యూస్ రీడర్ పాత్ర పోషించి ఆకట్టుకున్నారు. 2013లో విడుదలైన షాహిద్ సినిమాతో ఏకంగా ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. వరుసగా హిందీ సినిమాలు చేస్తూ అక్కడే సెటిల్ అయినా రాజ్ కుమార్.. ప్రస్తుతం మాలిక్ అనే సినిమాలో నటిస్తున్నారు. సినిమాలే కాకుండా వెబ్ సిరీస్లలో కూడా నటిస్తున్నారు రాజ్..అంతేకాదు 2023లో వచ్చిన గన్స్ అండ్ గులాబ్స్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు.

Advertisement

 

also read :S.Thaman : అఖండ 2 కాదు అఖండ 5.. క్లారిటీ ఇచ్చిన తమన్

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×