E-Paper
Advertisement

మాజీ మరిది తప్పుకోవడంతో ముందుగానే వస్తున్న సమంత ‘మా ఇంటి బంగారం’!

మాజీ మరిది తప్పుకోవడంతో ముందుగానే వస్తున్న సమంత ‘మా ఇంటి బంగారం’!
Advertisement

Samantha: సినీనటి సమంత ప్రస్తుత కెరియర్ పై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. ఈమె తన సొంత నిర్మాణ సంస్థలోనే ప్రస్తుతం సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సమంత నందిని రెడ్డి డైరెక్షన్ లో మా ఇంటి బంగారం(Maa Inti Bangaram) అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా చివరి దశ షూటింగ్లో ఉంది. లేడీ ఓరియంటెడ్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి ఇటీవల టీజర్ విడుదల చేయగా ఎంతో మంచి ఆదరణ లభించింది.. ఈ నేపథ్యంలోనే సినిమా పట్ల కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా త్వరలోనే షూటింగ్ పూర్తి కానున్న నేపథ్యంలో విడుదల గురించి ఎన్నో రకాల వార్తలు బయటకు వస్తున్నాయి.

ముందుగానే వస్తున్న మా ఇంటి బంగారం..

నిజానికి ఈ సినిమా మే 15వ తేదీ విడుదల కాబోతోంది అంటూ చిత్ర బృందం అధికారికంగా విడుదల తేదీని ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు అన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే ఈ సినిమా మే 15వ తేదీ కాకుండా ముందుగానే ప్రేక్షకుల ముందుకు రాబోతుందంటూ వార్తలు బయటకు వస్తున్నాయి.. ఈ సినిమాని మే 1 వ తేదీనే విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు సమాచారం. నిజానికి మే ఒకటవ తేదీ అఖిల్ అక్కినేని నటించిన సినిమా విడుదల కానున్న నేపథ్యంలో సమంత మా ఇంటి బంగారం సినిమాని మే 15వ తేదీ విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.

జూన్ నెలలో రాబోతున్న లెనిన్..

Advertisement

ఇకపోతే గత కొద్దిరోజులుగా లెనిన్ సినిమా వాయిదా పడుతుంది అంటూ వార్తలు బయటకు వచ్చాయి అందుకు అనుగుణంగానే ఈ సినిమాని వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా జూన్ 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఇటీవల చిత్ర బృందం అధికారకంగా తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే సమంత మా ఇంటి బంగారం సినిమా మే ఒకటో తేదీ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే సినిమా విడుదలకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా రాబోతుంది.. ఇక ఏప్రిల్ 30వ తేదీ విడుదల కావాల్సిన పెద్ది సినిమా కూడా వాయిదా పడబోతున్న నేపథ్యంలో సమంత మా ఇంటి బంగారం సినిమాకు బాగా కలిసి వస్తుందని చెప్పాలి.

పెళ్లి తర్వాత సమంత మొదటి సినిమా..

Advertisement

ఇక సమంత ఇటీవల కాలంలో వెండితెరపై కనిపించే చాలా కాలం అవుతుంది ఈమె విజయ్ దేవరకొండ తో నటించిన ఖుషీ సినిమా ద్వారా వెండితెరపై సందడి చేశారు. అనంతరం ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చిన సమంత ఇప్పటివరకు తిరిగి సినిమాలలో నటించలేదు. చాలా రోజుల తర్వాత మా ఇంటి బంగారం అనే లేడీ ఓరియంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా సమంతకు ఎలాంటి సక్సెస్ ఇస్తుందో తెలియాల్సి ఉంది. ఇక సమంత ఇటీవల దర్శకుడు రాజ్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇలా పెళ్లి తర్వాత మా ఇంటి బంగారం ఈమె మొదటి సినిమా కావటం విశేషం.

Also Read: ప్రకాష్ రాజ్ తల్లీ మృతి.. సంతాపం తెలిపిన పవన్ కళ్యాణ్.. పోస్ట్ వైరల్!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×