E-Paper
Advertisement

Dhurandhar 2: టాలీవుడ్‌కి ‘ధురంధర్ 2’ చెక్! బాహుబలి, RRR రికార్డులు గాల్లో దీపాలేనా?

Dhurandhar 2: టాలీవుడ్‌కి ‘ధురంధర్ 2’ చెక్! బాహుబలి, RRR రికార్డులు గాల్లో దీపాలేనా?
Advertisement

Dhurandhar 2: బాలీవుడ్ అంటే కేవలం లవ్ స్టోరీలు, రీమేక్‌లే అనుకునే వారికి ఆదిత్య ధర్ తన ‘ధురంధర్ 2’తో మైండ్ బ్లాకింగ్ ఆన్సర్ ఇచ్చారు. ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ స్పై థ్రిల్లర్ సృష్టిస్తున్న విధ్వంసం చూస్తుంటే, టాలీవుడ్ జేమ్స్ బాండ్స్ అని చెప్పుకునే మన హీరోలకి చుక్కలు కనిపిస్తున్నాయి. కేవలం మూడు రోజుల్లోనే రూ.500 కోట్ల గ్రాస్, నాలుగు రోజులు తిరగకముందే రూ.750 కోట్ల మార్క్‌ను దాటేసి ‘ధురంధర్ 2’ ఇండియన్ సినిమా హిస్టరీని తిరగరాస్తోంది.

తెలుగు లెజెండ్స్‌కు చుక్కలు చూపించిన రణ్‌వీర్!
మన దగ్గర వందల కోట్లు ఖర్చు పెట్టి తీసిన బాహుబలి 2 (రూ.591 కోట్లు), RRR (రూ.470 కోట్లు) వంటి భారీ చిత్రాల ఓపెనింగ్ వీకెండ్ రికార్డులను కూడా రణ్‌వీర్ సింగ్ తన పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌తో మట్టి కరిపించాడు. ప్రస్తుతం హైయెస్ట్ ఓపెనింగ్ వీకెండ్ రికార్డుల్లో పుష్ప 2 (రూ.762 కోట్లు) తర్వాత రెండో స్థానంలో నిలిచి, తెలుగు సినిమా గడ్డపైనే సవాల్ విసురుతున్నాడు. మన దర్శకులు ఇంకా పాత చింతకాయ పచ్చడి లాంటి మాస్ మసాలా, అనవసరమైన ఎలివేషన్ల చుట్టూ తిరుగుతుంటే.. ఆదిత్య ధర్ మాత్రం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో గ్రిప్పింగ్ స్పై థ్రిల్లర్‌ను వడ్డించి ఆడియన్స్‌ను థ్రిల్‌కు గురిచేస్తున్నాడు.

Advertisement

టాలీవుడ్ రొటీన్ రోత.. బాలీవుడ్ కొత్త బాట!
టాలీవుడ్‌లో ఇప్పుడు వస్తున్న సినిమాల్లో సగం రీమేక్‌లు, మిగిలిన సగం పాత పగలు-ప్రతీకారాల కథలే. కానీ ‘ధురంధర్ 2’లో ఆదిత్య ధర్ చూపించిన ఆ ట్విస్టులు, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్ వంటి ఉద్దండుల నటన చూస్తుంటే.. మన వాళ్ళకి ‘కంటెంట్’ అంటే ఏంటో అర్థమవుతోంది. దేశభక్తిని, యాక్షన్‌ను ఎలా మేళవించాలో ధురంధర్ టీమ్ నేర్పించింది. మన దగ్గర హీరోల బిల్డప్‌లకే సగం సినిమా అయిపోతుంటే, అక్కడ మాత్రం ప్రతి సీన్ ఒక వెపన్ లాగా పేలుతోంది. 2026లో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా, కేవలం వారం రోజుల్లోనే రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమని  లెక్కలు వేస్తున్నారు ట్రేడ్ పండిట్స్.

మన హీరోలు ఎప్పుడు మేల్కొంటారు?
రణ్‌వీర్ సింగ్ లాంటి యాక్టర్స్ ఇప్పుడు గ్లోబల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్నారు. కానీ మన స్టార్లు మాత్రం ఇంకా ‘మాస్ పల్స్’ పేరుతో రొటీన్ సినిమాలకే పరిమితం అవుతున్నారు. ధురంధర్ 2 సక్సెస్ చూశాకైనా మన దర్శకులు, హీరోలు మేల్కొని కొత్త రకమైన కథలు చేయకపోతే.. తెలుగు సినిమా మార్కెట్‌ను బాలీవుడ్ స్పై థ్రిల్లర్లు మింగేయడం ఖాయం. ఒకవైపు పుష్ప 2 రికార్డులకు గట్టి పోటీ ఇస్తూనే, మరోవైపు మన క్లాసిక్స్ రికార్డులను తుడిచిపెట్టేస్తున్న ‘ధురంధర్ 2’ ప్రభంజనం ఎక్కడితో ఆగుతుందో చూడాలి!

Advertisement

read also :Peddi Movie: మెగా ఫ్యాన్స్ కు షాక్.. పెద్ది మళ్లీ వాయిదా పడనుందా ?

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×