E-Paper
Advertisement

Harish Shankar: తేలిపోయిన‘ఉస్తాద్’..హరీష్ శంకర్ పని అయిపోయినట్టేనా ?

Harish Shankar: తేలిపోయిన‘ఉస్తాద్’..హరీష్ శంకర్ పని అయిపోయినట్టేనా ?
Advertisement

Harish Shankar: టాలీవుడ్‌లో ‘గబ్బర్ సింగ్’తో ఒక వెలుగు వెలిగిన హరీష్ శంకర్ పని ఇక అయిపోయినట్టేనా? అన్న సందేహాలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. ‘మాస్ పల్స్’ పేరుతో ఆయన వడ్డిస్తున్న రొటీన్ మసాలా కథలు ఇప్పుడు ప్రేక్షకులకు ‘అతి’గా అనిపిస్తున్నాయి తప్ప ఆకట్టుకోవడం లేదు. తాజాగా విడుదలైన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ హరీష్ మేకింగ్‌లోని డొల్లతనాన్ని పచ్చిగా బయటపెట్టింది. పవన్ కళ్యాణ్ లాంటి భారీ ఇమేజ్ ఉన్న హీరోను చేతిలో పెట్టుకుని, కేవలం పాత చింతకాయ పచ్చడి లాంటి స్క్రీన్ ప్లేతో, ఎమోషన్ లేని సీన్లతో ప్రేక్షకులను విసిగించేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా రీమేక్‌లను నమ్ముకునే హరీష్, ఈసారి సొంత కథ అని చెప్పి మరీ చతికిలపడటం ఆయన క్రియేటివిటీపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. మొత్తానికి  సోషల్ మీడియాలో ఇప్పుడు హరీష్ శంకర్ ‘పోస్ట్‌మార్టమ్’ దారుణంగా జరుగుతోంది.

మెగాస్టార్‌తో ‘గ్యాంగ్ లీడర్’ కలలు.. పగటి కలలేనా?

Advertisement

హరీష్ శంకర్‌కు ఒక పెద్ద కల ఉంది.. మెగాస్టార్ చిరంజీవితో ‘గ్యాంగ్ లీడర్’ లేదా ‘ఘరానా మొగుడు’ వంటి ఆల్ టైమ్ మాస్ క్లాసిక్స్‌ను రీక్రియేట్ చేయాలని ఆయన ఎప్పటి నుంచో తపిస్తున్నారు. స్టేజ్ ఎక్కితే చాలు “నేను చిరంజీవి గారికి వీరాభిమానిని” అంటూ డబ్బా కొట్టుకుంటూ మైక్ విరిచేసే హరీష్‌కి ఇప్పుడు గట్టి షాక్ తగిలింది. ప్రస్తుత ట్రెండ్‌లో చిరంజీవి గారే ‘విశ్వంభర’ వంటి సరికొత్త ఫాంటసీ ప్రయోగాలు చేస్తుంటే, హరీష్ మాత్రం ఇంకా 90ల నాటి రొటీన్ గూండాగిరీ కథల దగ్గరే ఆగిపోయాడు. ‘ఉస్తాద్’ డిజాస్టర్ టాక్ చూశాక, మెగాస్టార్ లాంటి లెజెండ్ హరీష్ శంకర్‌ని నమ్మి విలువైన డేట్స్ ఇస్తారా అంటే ‘నో’ అనే సమాధానమే ఇండస్ట్రీ అంతటా వినిపిస్తోంది. అసలు హరీష్ కి పెద్ద హీరోలను హ్యాండిల్ చేసే విజన్ ఉందా అన్న అనుమానాలు మెగా క్యాంప్ లో వ్యక్తమవుతున్నాయట.

బాలయ్య బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేనా?

Advertisement

మరోవైపు నందమూరి బాలకృష్ణ చుట్టూ తిరుగుతూ, ఆయనతో ఎలాగైనా ఒక మాస్ బొమ్మ సెట్ చేయాలని హరీష్ తాపత్రయపడుతున్నాడు. ఒకవేళ ‘ఉస్తాద్’ కనీసం హిట్ టాక్ తెచ్చుకున్నా బాలయ్య సినిమాకు లైన్ క్లియర్ అయ్యేది. కానీ బాలయ్య ఇప్పుడు తన రూట్ మార్చి కొత్త డైరెక్టర్లతో లేదా క్రేజీ కంటెంట్ ఉన్న వారితో ప్రయోగాలు చేస్తున్నారు. ‘ఉస్తాద్’లో హరీష్ చూపించిన రొటీన్ మాస్ ఎలివేషన్లు చూశాక, బాలయ్య అభిమానులు కూడా “మా హీరోకి ఈయన వద్దు బాబోయ్.. మాకు బాబీ లేదా మలినేని చాలు” అని సోషల్ మీడియాలో దండం పెడుతున్నారు. హరీష్‌తో సినిమా అంటే అది బాలయ్య కెరీర్‌కు ఒక పెద్ద ‘స్పీడ్ బ్రేకర్’ అవుతుందని, కేవలం డైలాగులతో మాయ చేసే దర్శకుడికి బాలయ్య దూరంగా ఉండటమే మేలని హెచ్చరిస్తున్నారు నందమూరి ఫ్యాన్స్.

పెద్ద హీరోలు హ్యాండ్.. మిడ్ రేంజ్ హీరోలే దిక్కు!

 ఇక పెద్ద స్టార్లు అందరూ ఇప్పుడు రాజమౌళి, సుకుమార్, సందీప్ వంగ లాంటి వరల్డ్ క్లాస్ డైరెక్టర్ల కోసం క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో హరీష్ శంకర్‌కి పెద్ద హీరోలు దొరకడం గగనమే. ఇక ఆయనకు మిగిలింది కేవలం వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ లాంటి మిడ్ రేంజ్ హీరోలే. వారి దగ్గర కూడా ‘దాగుడు మూతలు’ వంటి ఏళ్ళ నాటి పాత స్క్రిప్ట్‌లను పట్టుకుని తిరగాల్సిన దీన స్థితి ఏర్పడింది. సితార లాంటి పెద్ద సంస్థలు అడ్వాన్స్ ఇచ్చినా, హీరోలు ఓకే చెప్పకపోతే ఆ ప్రాజెక్టులు అటకెక్కడం ఖాయం. “నాకు ఇలాంటి సినిమాలే వచ్చు.. నేను ఇలాగే తీస్తా” అని హరీష్ ఒప్పేసుకోవడం ఆయన మేకింగ్ స్టైల్ ‘అవుట్‌డేటెడ్’ అయిపోయిందని అంగీకరించడమే. ప్రేక్షకులు ఇప్పుడు గ్లోబల్ కంటెంట్ చూస్తున్నారు, ఇలాంటి సమయంలో ఇంకా రొటీన్ క్లైమాక్స్‌లు, అనవసరమైన బిల్డప్‌లతో కాలక్షేపం చేస్తానంటే కుదరదు. హరీష్ శంకర్ త్వరగా తన మేకింగ్ స్టైల్ మార్చుకోకపోతే, టాలీవుడ్‌లో ఆయన ఒక ‘మెమరీ’గా మిగిలిపోయే ప్రమాదం ఉంది.

also read: Shruti Haasan: అది మా నాన్న వల్లే… శ్రుతి హాసన్ బోల్డ్ స్టేట్‌మెంట్ వైరల్!

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×