Redmi Watch Move: ప్రస్తుతం చాలా మంది యువత స్మార్ట్‌వాచ్‌లు వాడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. మార్కెట్ లో అనేక రకాల స్మార్ట్ వాచ్ లు అందుబాటులో ఉన్నాయి. అయితే..తక్కువ ధరలో స్టైలిష్‌లుక్‌తో పాటు మంచి ఫీచర్లు ఉన్న వాచ్ కావాలనుకునే వారికి Redmi Watch Move బెస్ట్ ఆప్షన్‌గా మారింది. హెల్త్ ట్రాకింగ్ నుంచి బ్లూటూత్ కాలింగ్ వరకు అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇదిలా ఉంటే ఈ స్మార్ట్ వాచ్ ధర, డిజైన్, ఫీచర్లతో పాటు మరిన్ని వివరాలకు సంబంధించి పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.
ధర:
Redmi Watch Move ధర మార్కెట్లో సుమారు రూ. 1,999 వరకు ఉంటుంది. ఈ ధరలో ఇంత మంచి ఫీచర్లు రావడం చాలా మందికి ఆకర్షణగా మారింది. కొన్ని ఆఫర్ల సమయంలో ఇది ఇంకా తక్కువ ధరలో కూడా దొరకొచ్చు. బడ్జెట్‌లో మంచి స్మార్ట్‌వాచ్ కొనాలనుకునే వారికి ఇది సరైన ఆప్షన్‌గా చెప్పొచ్చు.
డిజైన్ & డిస్‌ప్లే:
ఈ వాచ్ చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంటుంది. పెద్ద 1.85 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉండటం వల్ల స్క్రీన్ క్లియర్‌గా కనిపిస్తుంది. బయట వెలుతురులో కూడా ఇబ్బంది లేకుండా చూడొచ్చు. కర్వ్డ్ స్క్రీన్, స్మూత్ టచ్, ,సైడ్‌లో ఉండే క్రౌన్ వల్ల వాడటం చాలా ఈజీగా ఉంటుంది. మొత్తంగా ఈ ధరలో వాచ్ ప్రీమియం ఫీలింగ్ ఇస్తుంది.
బ్యాటరీ:
బ్యాటరీ విషయంలో ఈ వాచ్ చాలా బాగా పని చేస్తుంది. ఒక సారి పూర్తిగా ఛార్జ్ చేస్తే దాదాపు 14 రోజులు వరకు ఉపయోగించుకోవచ్చు. రోజూ ఛార్జ్ చేయాల్సిన అవసరం లేకపోవడం వల్ల చాలా కన్వీనియెంట్‌గా ఉంటుంది. ట్రావెల్ చేసే వారికి ఇది మరింత ఉపయోగకరం.
హెల్త్ ఫీచర్లు:
ఈ వాచ్‌లో ఆరోగ్యానికి సంబంధించిన ఫీచర్లు చాలా ఉన్నాయి. హార్ట్ రేట్, ఆక్సిజన్ లెవెల్ (SpO2), స్లీప్ ట్రాకింగ్, స్ట్రెస్ మానిటరింగ్ వంటి ఫీచర్లు రోజు వారీ ఆరోగ్యాన్ని గమనించడానికి సహాయ పడతాయి. ఇవి ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టే వారికి ఉపయోగ పడతాయి.
ఫిట్‌నెస్ మోడ్‌లు:
వర్కౌట్స్ చేసే వారికి ఈ వాచ్ చాలా ఉపయోగకరం. ఇందులో 100కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి. వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్ లాంటి కార్యకలాపాలను సులభంగా ట్రాక్ చేయొచ్చు. మీ ఫిట్‌నెస్ ప్రోగ్రెస్‌ను సింపుల్ గా తెలుసుకోవచ్చు.
స్మార్ట్ ఫీచర్లు:
ఈ వాచ్‌లో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఉండటం వల్ల నేరుగా వాచ్ నుంచే కాల్స్ చేయొచ్చు, అంతే కాకుండా రిసీవ్ చేయవచ్చు. అలాగే మెసేజ్‌లు,వాట్స్ అప్ నోటిఫికేషన్స్ కూడా వెంటనే కనిపిస్తాయి. మ్యూజిక్ కంట్రోల్, కెమెరా కంట్రోల్ వంటి ఫీచర్లు చాలా సహాయ పడతాయి.
Also Read: కరెంట్ బిల్లుకు చెక్.. 2026లో బెస్ట్ సోలార్ ఏసీలు ఇవే ! ధర, ఫీచర్ల వివరాలు
ఇతర ఫీచర్లు:
ఈ వాచ్ IP68 వాటర్ రెసిస్టెంట్ కావడంతో నీటి చినుకులు లేదా డస్ట్ వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదు. 200కి పైగా వాచ్ ఫేస్‌లు ఉండటం వల్ల మీ స్టైల్‌కు తగ్గట్టు మార్చుకోవచ్చు. స్ట్రాప్ కూడా స్కిన్‌కు ఫ్రెండ్లీగా ఉంటుంది. ఈ వాచ్ వాడటం చాలా సింపుల్. అంతే కాకుండా టచ్ రిస్పాన్స్ కూడా చాలా బాగుంటుంది. అన్ని ఫీచర్లు స్మూత్‌గా పని చేస్తాయి. రోజు వారీ పనుల్లో కాల్స్, నోటిఫికేషన్స్, ఫిట్‌నెస్ ట్రాకింగ్ ఆల్ ఇన్ వన్ డివైస్‌గా ఇది ఉపయోగపడుతుంది.
మొత్తానికి రెడ్మీ వాచ్ మూవ్ ఒక మంచి బడ్జెట్ స్మార్ట్‌వాచ్. తక్కువ ధరలో మంచి డిజైన్, మంచి ఫీచర్లు అందించడం దీని ప్రధాన బలం. మొదటి సారి స్మార్ట్‌వాచ్ కొనే వారికి లేదా బడ్జెట్‌లో మంచి ఆప్షన్ వెతుకుతున్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్.