Dhurandhar 2 controversy: ‘ధురంధర్ 2’….బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ సినిమా ఒకవైపు బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లు క్రాస్ చేసి దూసుకుపోతుంటే మరోవైపు ఈ సినిమా చుట్టూ రాజకీయ మంటలు చుట్టేస్తున్నాయ్.
ఇదో చెత్త సినిమా అంటున్న అసదుద్దీన్ ఒవైసీ
ముఖ్యంగా హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ ఇదో చెత్త సినిమా అంటూ ధురంధర్ 2’ను ఏకిపారేశారు.బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్ల సునామీ స్ప్రుష్టిస్తుంటే అసదుద్దీన్ మాత్రం అసలు అది ఒక సినిమానా? మూడు గంటల పాటు అందులో బూతులు, హింస తప్ప మరేముంది?”అంటూ తెగ ఫైర్ అయ్యారు. ఈ సినిమాలో ముస్లింలను చూపెట్టిన తీరుపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకి జనం బ్రహ్మరథం పడుతున్నారని గుర్తు చేయగా “ఐసే చీజాం కు హమ్ లైట్ లేతే” (ఇలాంటి విషయాలను నేను పట్టించుకోను) అంటూ హైదరాబాదీ యాసలో కొట్టిపారేశారు. అసలు ఇలాంటి పనికిరాని సినిమాలను చూసే సమయం తనకు లేదని ఆయన కుండబద్దలు కొట్టేయడం విశేషం.సినిమాలో ఒకపక్క రణ్‌వీర్ సింగ్ పర్ఫార్మెన్స్‌కు ఒక వర్గం జనాలు నీరాజనాలు పడుతుంటే, ఒవైసీ లాంటి వాళ్ళు పొలిటికల్ యాంగిల్ లో చేస్తున్న కామెంట్స్ సినిమాకు కాస్త మైనస్ అనే చెప్పాలి .
also read:Harish Shankar: పవర్ స్టార్‌ని ముంచేసి.. ఇప్పుడు మెగాస్టార్‌పై పడ్డ హరీష్
పూర్తిగా ప్రాపగాండా సినిమా అంటున్న రీత్ పడ్డా
ఇక ఒవైసీ స్టేట్ మెంట్ ఇలా ఉంటె ఇదే దురంధర్ 2పై తనదైన శైలిలో రెచ్చిపోయింది బాలీవుడ్ నటి సోదరి రీత్ పడ్డా.ఈ సినిమా పూర్తిగా ప్రభుత్వ ప్రచార చిత్రం (Propaganda Film) అంటూ బాలీవుడ్ నటి సోదరి రీత్ పడ్డా చేసిన స్టేట్ మెంట్స్ ఇప్పుడు నేషనల్ వైడ్ గా మంటలు పుట్టిస్తున్నాయ్.‘సైయారా’ ఫేమ్ అనీత్ పడ్డా సిస్టర్ రీత్ పడ్డా ఈ సినిమాపై సెన్సేషన్ కామెంట్స్ చేస్తూ, ఇది కేవలం సినిమా మాత్రమే కాదని , ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ తీసిన ప్రాపగాండా ఫిలిం అని తెగ ఫైర్ అయ్యింది. ముఖ్యంగా పెద్ద నోట్ల రద్దు వంటి వివాదాస్పద నిర్ణయాలను సపోర్ట్ చేయడానికి ఈ సినిమాలో పొలిటికల్ స్పీచులనివాడుకున్నారని ,గతంలో వచ్చిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’, ‘ది కేరళ స్టోరీ’ చిత్రాల లాగే దురంధర్ 2 సినిమా నిజాలకి మసిపూసి మారేడు చేస్తుందని మండిపడింది.ఇక ఒక చిన్న నిజాన్ని అడ్డం పెట్టుకుని ఒక వర్గంపై ద్వేషాన్ని పెంచడమే ఈ సినిమాల ముఖ్య ఉద్దేశమని ఆమె తీవ్రంగా విమర్శించింది.ముఖ్యంగా ‘పంజాబ్ 95’ వంటి నిజమైన పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలు రిలీజ్ కి ఇబ్బందులు పడుతుంటే.. ఇలాంటి ప్రోపగాండా సినిమాలకు మాత్రం రెడ్ కార్పెట్ వేస్తున్నారని తన అసహనం వ్యక్తం చేసుకొచ్చింది రీత్ పడ్డా.
ఏది ఏమైనా ‘ధురంధర్ 2’ కేవలం కమర్షియల్ గా కాసులు కొల్లగొడుతున్నా..విమర్శకుల దగ్గర మాత్రం పరాజయం పాలవుతున్నాడా? అన్నది ఇపుడు నెట్టింట్లో డిబెటబుల్ అయిపొయింది.
also read:Varun Tej Bari movie: వరుణ్ తేజ్ ‘బరి’లోకి దిగుతున్నాడా? లేక బలి అవుతున్నాడా?