E-Paper
Advertisement

NPCIL Recruitment: ఐటీఐ, డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. నెలకు రూ.12,300 స్టైఫండ్, పూర్తి వివరాలివే

NPCIL Recruitment: ఐటీఐ, డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. నెలకు రూ.12,300 స్టైఫండ్, పూర్తి వివరాలివే
Advertisement

గుజరాత్‌లోని కాక్రపార్ అణు విద్యుత్ కేంద్రంలో భారీ స్థాయిలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) మొత్తం 337 పోస్టులను భర్తీ చేస్తోంది. నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వ సంస్థలో శిక్షణ పొందేందుకు ఇదొక గొప్ప అవకాశం. ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 6వ తేదీలోపు తమ దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది.

భారత ప్రభుత్వ రంగానికి చెందిన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) గుజరాత్ విభాగం 2026 సంవత్సరానికి గాను అప్రెంటిస్ శిక్షణ కోసం దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 337 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో ట్రేడ్ అప్రెంటిస్‌లు 237 ఉన్నాయి. టెక్నీషియన్ అప్రెంటిస్ విభాగంలో 33 పోస్టులు కేటాయించారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ విభాగంలో 67 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు తమ అర్హతలను బట్టి సంబంధిత విభాగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement

వెకెన్సీ విభాగాలు..

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెకానిక్, వెల్డర్ వంటి సాంకేతిక విభాగాల్లో శిక్షణ పొందుతారు. అలాగే కెమికల్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగాల్లోనూ అవకాశాలు ఉన్నాయి. సైన్స్ నేపథ్యం ఉన్నవారి కోసం బీఎస్సీ, కార్యాలయ నిర్వహణపై ఆసక్తి ఉన్నవారి కోసం హెచ్‌ఆర్, ఫైనాన్స్ విభాగాలు కేటాయించారు.

Advertisement

విద్యార్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన సంస్థ నుండి ఐటీఐ లేదా డిప్లొమా లేదా సంబంధిత డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: వయస్సు విషయంలో అధికారులు స్పష్టమైన నిబంధనలు విధించారు. 2026 ఏప్రిల్ 6వ తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల కంటే తక్కువ ఉండకూడదు. గరిష్ట వయస్సు 26 ఏళ్లు మించకూడదు. నిబంధనల ప్రకారం రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయో సడలింపు వర్తిస్తుంది.

స్టైఫండ్: ఎంపికైన వారికి నెలకు నిర్ణీత స్టైపెండ్ అందిస్తారు. ట్రేడ్ అప్రెంటిస్‌లకు రూ.10,560 నుండి రూ.11,040 వరకు చెల్లిస్తారు. టెక్నీషియన్లకు రూ.10,900 అలాగే గ్రాడ్యుయేట్లకు రూ.12,300 స్టైపెండ్ లభిస్తుంది.

సెలెక్షన్ ప్రాసెస్: అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా మెరిట్ ప్రాతిపదికన జరుగుతుంది. విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించి తుది జాబితా ప్రకటిస్తారు. ఈ ప్రక్రియలో ఎటువంటి రాత పరీక్ష ఉండదు.

దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ఆఫ్‌లైన్ విధానాన్ని అనుసరించాలి. పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్‌ను అవసరమైన సర్టిఫికేట్లతో కలిపి గుజరాత్‌లోని కాక్రపార్ సైట్ చిరునామాకు పంపాలి. ఏప్రిల్ 6వ తేదీ సాయంత్రం లోపు దరఖాస్తులు కార్యాలయానికి చేరుకోవాలి.

ALSO READ: Maruti Suzuki SUV: మారుతి నుంచి చౌకైన SUV.. జస్ట్ రూ.5.50 లక్షలకే కొత్త మోడల్!

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×