E-Paper
Advertisement

Harish Shankar: పవర్ స్టార్‌ని ముంచేసి.. ఇప్పుడు మెగాస్టార్‌పై పడ్డ హరీష్

Harish Shankar: పవర్ స్టార్‌ని ముంచేసి.. ఇప్పుడు మెగాస్టార్‌పై పడ్డ హరీష్
Advertisement

Harish Shankar: సినిమా ఇండస్ట్రీలో ఒక మాట ఉంది..
అన్నీ ఉన్నవాడు తక్కువ మాట్లాడతాడు ఏమీ లేని వాడే ఎగిరెగిరి పడతాడు అని ..ఈ సామెత ఇపుడు హరీష్ శంకర్ కి బాగా సూటయ్యేలా కనిపిస్తుంది.అవును ..ఒకపక్క ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ మూట గట్టుకుంటే ఈయనగారు మాత్రం తనని తాను స్టీవెన్ స్పిల్ బర్గ్ రేంజ్ లో ఊహించుకుంటూ ఇస్తున్న స్టేట్‌మెంట్లు చూసి ముక్కున నెటిజన్లు వేలేసుకుంటున్నారు మరి.

యస్..ఒకవైపు సినిమా అడ్డంగా పోయిందని ఊరంతా మొత్తుకుంటున్నా హరీష్ శంకర్ మాత్రం కేకులు కట్ చేస్తూ సక్సెస్ మీట్లు పెట్టడం చూస్తుంటే కామెడీగా ఉంది.ఇక ‘ఉస్తాద్’లో పవన్ రెండుసార్లు జీపులో నుంచి దూకిన లాజిక్ లేని సీన్ గురించి అడిగితే.. “నాకు రెండు షాట్లు నచ్చాయి, అందుకే పెట్టా” అని ఆయన గారు ఇచ్చిన ఆన్సర్ చూసి, ఆడియన్స్ కి పిచ్చి పీక్స్ కి వెళ్ళిపోయింది.

Advertisement

అఖిరా డెబ్యూ గురించి అడిగితే…

ఇక ఇదిలా ఉంటె లేటెస్ట్ గా హరీష్ చేసిన కామెంట్స్ అయితే ట్రోలర్స్‌కి పెద్ద స్టఫ్ నే తెచ్చిపెట్టాయ్.అఖిరా డెబ్యూ గురించి అడిగితే.. “ఆయనకి ఇంకా టైమ్ ఉంది, నాకు ఇప్పుడు అర్జెంటుగా మెగాస్టార్ తో సినిమా చేయాలని ఉంది” ఏకంగా చిరు కే గురి పెట్టాడు.పోనీ అంతగా ఉత్సాహం చూపిస్తున్నాడు. ఏదైనా గొప్ప కథ ఉందా అంటే మళ్ళీ అదే పాత గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు లాంటి రోల్స్ చూపిస్తాడట. ఆల్రెడీ చిరంజీవిని అలాంటి రోల్స్ లో చూసి జనం తెగ బోర్ గా ఫీల్ అవుతుంటే, ఈయన గారు మాత్రం మళ్ళీ అదే ‘రీమేక్’ రోతని రుద్దాలని ప్లాన్ చేస్తున్నాడంటే ఉస్తాద్ నుంచి లెస్సన్స్ ఏం నేర్చుకోలేనట్టే కనిపిస్తుంది. గబ్బర్ సింగ్ ఇచ్చాడుగా అన్న ఒకే కారణంతో పవన్ కళ్యాణ్ లాంటి హీరో డేట్స్ ఇస్తే మళ్ళీ పాత రీమేక్ కథతో ముంచేసిన హరీష్, ఇప్పుడు అలాంటి రొట్ట కథతో చిరంజీవిని కూడా టార్గెట్ చేయడమే మెగా ఫ్యాన్స్‌ లో టెన్షన్ పుట్టిస్తుంది.

Advertisement

also read:Mega158 Launch: పవన్ కళ్యాణ్ క్లాప్‌తో మెగా158 లాంచ్… సంక్రాంతి 2027 టార్గెట్

ఎక్కువ మాటలు – ఇచ్చే అవుట్ పుట్ సున్నా

బాహుబలి, RRR లాంటి సినిమాలు చేసిన రాజమౌళి అంతటి వాడే తక్కువ మాట్లాడుతుంటే,ఈయన మాత్రం మాటలు ఎక్కువ మాటలు మాట్లాడి ఇచ్చే అవుట్ పుట్ సున్నాఅన్న కామెంట్స్ వినిపిస్తున్నాయ్.ఇక ‘ధురందర్’ లాంటి క్వాలిటీ సినిమాలు బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుంటే.. “అది నేను అనుకున్న సబ్జెక్టే, కానీ వాళ్ళు డీప్ గా వెళ్లారు” అంటూ కవరింగ్ ఇవ్వడం చూసిన నెటిజన్లు మరి మీరే అనుకుంటే ముందే ఎందుకు తీయలేదు శంకర్ గారు? ఓ రేంజ్ లో కడిగిపారేస్తున్నారు.

మొత్తానికి, పవన్ తో మూడో సినిమా, చిరంజీవితో అర్జెంట్ సినిమా అంటూ హరీష్ ఇస్తున్న బిల్డప్పులు చూస్తుంటే ఈయన తనని తాను ఒక ‘గ్లోబల్ డైరెక్టర్’ లా ఫీల్ అవుతున్నట్టున్నారా  ఏంటి అన్న గుసగుసలు కూడా మొదలయ్యాయ్.ఏది ఏమైనా మిస్టర్ బచ్చన్, ఉస్తాద్ సినిమాలు వరుసగా బోల్తా కొట్టడంతో హరీష్ ఒక ‘ట్రోలింగ్ మెటీరియల్’ గా మారిపోయారన్నది నిజం. మరి మెగాస్టార్ ఈ ‘రీమేక్ స్పెషలిస్ట్’ కి ఛాన్స్ ఇచ్చి తన కెరీర్‌తో రిస్క్ చేస్తారా? లేక హరీష్ మాటలకే పరిమితం అవుతారా? అన్నది కాలమే డిసైడ్ చేయాలి !

also read:Varun Tej Bari movie: వరుణ్ తేజ్ ‘బరి’లోకి దిగుతున్నాడా? లేక బలి అవుతున్నాడా?

Related News

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

ప్రమాదానికి గురైన అలీ..కాలికి పెద్ద కట్టుతో అలా..ఏమైందంటే?

యశ్ ‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్కడైనా సక్సెస్ అయ్యేనా?

అరుదైన ఘనత సాధించిన రష్మిక మందన్న!

అన్నపూర్ణ స్టూడియోస్ పై అల్లరి నరేష్ షాకింగ్ కామెంట్స్!

రామాయణంలోకి అమీర్ ఖాన్ కూతురు.. ఆ 5 నిమిషాలే కీలకమట!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. ఆ రూమర్స్ కు చెక్..

Big Stories

Advertisement
×