E-Paper
Advertisement

Dhurandhar Controversy: రణ్‌వీర్ కోసం బారులు తీరిన టాలీవుడ్ స్టార్ హీరోలు… వెనుక ‘పొలిటికల్’ స్కెచ్ ఉందా?

Dhurandhar Controversy: రణ్‌వీర్ కోసం బారులు తీరిన టాలీవుడ్ స్టార్ హీరోలు… వెనుక ‘పొలిటికల్’ స్కెచ్ ఉందా?
Advertisement

Dhurandhar Controversy: ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్ 2’ (Dhurandhar: The Revenge) మోత మోగిపోతోంది! ఆదిత్య ధార్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ స్పై థ్రిల్లర్, మొదటి రోజునే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ‘హిస్టరీ’ క్రియేట్ చేసింది. అయితే, ఈ ‘బ్లాక్ బస్టర్’ సక్సెస్ వెనుక ఒక పెద్ద పొలిటికల్ వార్ నడుస్తోంది. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

టాలీవుడ్ స్టార్ల ప్రశంసలు.. ప్రకాశ్ రాజ్ ‘ఫైరీ’ కౌంటర్!

ఈ సినిమాను చూసి ఫిదా అయిపోయిన మన టాలీవుడ్ బిగ్ గన్స్ అల్లు అర్జున్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ ఎక్స్ (X) వేదికగా ‘ధురంధర్ 2’ను ఆకాశానికెత్తేశారు. ఇక్కడి వరకు అంతా పాజిటివ్ గానే ఉన్నా.. ఈ ప్రశంసల వెనుక అసలు కథ వేరే ఉందని విమర్శలు మొదలయ్యాయి.దీనిపై వెర్సటైల్ యాక్టర్ ప్రకాశ్ రాజ్ తనదైన శైలిలో స్పందిస్తూ బాంబు పేల్చారు. ఉత్తరాదిలో తరచుగా వినిపించే “ఒత్తిడి రాజకీయాలు” ఇప్పుడు టాలీవుడ్‌లోకి కూడా ఎంటర్ అయ్యాయని ఆయన ఆరోపించారు. అధికార పార్టీకి (బీజేపీని ఉద్దేశించి) అనుకూలంగా ఉండే సినిమాలను ప్రమోట్ చేయాల్సిన పరిస్థితి మన స్టార్ హీరోలకు వచ్చిందంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.

ప్రోపగాండా వర్సెస్ ప్యూర్ సినిమా.. అసలు మేటర్ ఏంటి?

Advertisement

ఇది కేవలం సినిమా మాత్రమే కాదు, ఒక ‘రాజకీయ ప్రచార చిత్రం’ (Propaganda Film) అనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. సినిమాలోని కొన్ని సీన్లు మరియు డైలాగులు ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ, అధికార పార్టీకి మైలేజ్ ఇచ్చేలా ఉన్నాయని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ప్రకాశ్ రాజ్ అన్నట్టుగా.. హీరోలు తమ ఇష్టంతో కాకుండా ‘ఒత్తిడి’ వల్లే ఈ సినిమాలను పొగుడుతున్నారా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విమర్శలు ఎలా ఉన్నా, సినిమా కంటెంట్ పరంగా పక్కాగా ఉందని ఆడియన్స్ అంటున్నారు. రణ్‌వీర్ సింగ్ పెర్ఫార్మెన్స్, ఆదిత్య ధార్ టేకింగ్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయి. “సినిమా బాగుంటే పొగడటంలో తప్పేంటి?” అని స్టార్ హీరోల ఫ్యాన్స్ తమ హీరోలను వెనకేసుకొస్తున్నారు. పొలిటికల్ కలర్ ఇవ్వడం వల్ల సినిమాకు వచ్చే క్రేజ్ తగ్గదని వారు వాదిస్తున్నారు.

స్టార్ హీరోల సైలెన్స్.. వైరల్ అవుతున్న ‘ధురంధర్’ వార్!

ప్రకాశ్ రాజ్ చేసిన ఘాటు విమర్శలపై మన టాలీవుడ్ హీరోలు ఇంకా స్పందించలేదు. కానీ, ఒక సినిమా చుట్టూ ఇంత పెద్ద ఎత్తున పొలిటికల్ డిబేట్ జరగడం రీసెంట్ టైమ్స్ లో ఇదే మొదటిసారి. మొత్తానికి ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసినా, ‘పొలిటికల్ ప్రచార చిత్రం’ అనే ముద్ర మాత్రం ఈ సినిమాను వదలడం లేదన్నది నిజం.

Advertisement

also read:Pan India: జక్కన్న కోటకు బీటలు?టాలీవుడ్‌ మొనగాళ్ళు ఇక వీరేనా..

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×