E-Paper
Advertisement

Film industry: ప్రముఖ నటికి చేదు అనుభవం. తన. నడిరోడ్డుపై ఆకతాయిలు అసభ్యకరంగా ప్రవర్తిస్తూ

Film industry: ప్రముఖ నటికి చేదు అనుభవం. తన. నడిరోడ్డుపై ఆకతాయిలు అసభ్యకరంగా ప్రవర్తిస్తూ
Advertisement

Film industry:సినిమా సెలబ్రెటీలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అటు సినిమా ఇండస్ట్రీలోనే కాదు ఇటు పబ్లిక్ ప్రదేశాలలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ సతమతమవుతున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది తమకు ఎదురైనా చేదు అనుభవాలను బహిరంగంగా చెప్పుకుంటే.. మరికొంతమంది వాటిని మనసులోనే దాచుకొని ఎమోషనల్ అవుతూ ఉంటారు ..అయితే ఇప్పుడు తాజాగా ఒక నటికి చేదు అనుభవం ఎదురయింది. ఈ విషయాన్ని ఆమె తన ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. అందుకు సంబంధించిన పోస్ట్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది.

నటికి చేదు అనుభవం..

తాజాగా ఆమె తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని పంచుకుంటూ..” తెల్లవారుజామున 4:30 సమయంలో నేను ముంబైలో క్యాబ్లో వెళ్తుండగా బైక్ పై వచ్చిన కొందరు గుర్తు తెలియని ఆకతాయిలు.. మా కారును అడ్డుకొని డ్రైవర్ ను, నన్ను వేధించారు. మద్యం మత్తులో ఉన్నవారు అసభ్య పదజాలంతో దూషిస్తూ.. కారు డోర్లు తీయాలని భయపెట్టారు. ఆ క్షణం ఏం చేయాలో అర్థం కాలేదు. నిజంగా నరకం అనుభవించాను. భయంతో వణికిపోయాను ” అంటూ ఈ ఘటనకు సంబంధించిన వీడియోని కూడా తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశానని చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది నిమిషా నాయర్.

గతంలో కూడా తప్పని చేదు అనుభవం..

Advertisement

ఇకపోతే నిమిషా నాయర్ కి గతంలో కూడా ఇలాంటి అనుభవమే ఎదురయిందని ఆమె తెలిపింది. ముంబైలోని కొలాబాకు ప్రయాణిస్తున్న సమయంలో కూడా ఇలాంటి ఘటనని ఎదుర్కొన్నానని ఆమె వెల్లడించారు. ఈ విషయంపై ఎఫ్ ఐ ఆర్ కూడా దాఖలు చేశారు .త్వరలో తాను చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నట్లు పేర్కొంటూ తన పోస్టుని ముగించింది నిమిషా నాయర్.

also read:Amazon prime video: అమెజాన్ ప్రైమ్ లో సినిమాల జాతర .. 55కు పైగా చిత్రాలు, సిరీస్ లతో ఫుల్ ఎంటర్టైన్మెంట్!

ఎవరీ నిమిషా నాయర్

Advertisement

నిమిషా నాయర్ విషయానికి వస్తే ఎఫ్ టి ఐ ఐ పూణే పూర్వ విద్యార్థిని అయిన ఈమె అమర్ కాలనీ, ట్రయల్ బై ఫైర్ , 8:00 a.m మెట్రో వంటి చిత్రాలలో నటించి విమర్శకుల ప్రశంసలు కూడా సొంతం చేసుకుంది. ఒకవైపు నటిగా సినిమాలు చేస్తూ మరొకవైపు వెబ్ సిరీస్ లకు దూసుకుపోతున్న నిమిషా నాయర్ పబ్లిక్ లో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. నిమిషా నాయర్ నటిగా కాకుండా వ్యాపారవేత్తగా కూడా మంచి పేరు దక్కించుకుంది. ఢిల్లీలో జన్మించిన ఈమె నటనలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమా పూర్తి చేసింది. మీస్నర్ టెక్నిక్, స్ట్రాస్ బర్గ్ పద్ధతిలో శిక్షణ కూడా అందుకుంది.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×