Pan India: టాలీవుడ్ అంటే ఒకప్పుడు కేవలం లోకల్ ముచ్చట.కానీ రాజమౌళి తన బాహుబలి, RRR సినిమాలతో సీన్ మొత్తం మార్చేశారు. తెలుగు సినిమాను ఏకంగా ‘గ్లోబల్ బ్రాండ్’ చేసి ఒక పాన్-ఇండియా సామ్రాజ్యాన్ని సెట్ చేశారు. అయితే, ఇప్పుడు ఆ సామ్రాజ్యానికి ‘చెక్’ పెట్టే రేంజ్‌లో నలుగురు టెర్రిఫిక్ డైరెక్టర్లు దూసుకొస్తున్నారు. జక్కన్న సెట్ చేసిన బెంచ్‌మార్క్ రికార్డులని తిరగరాసేందుకు రెడీ అయిపోయారు.
నాగ్ అశ్విన్.. సైన్స్ ఫిక్షన్ + పురాణాల మేజిక్
ఈ రేసులో టాప్‌లో ఉన్న పేరు నాగ్ అశ్విన్. రాజమౌళి గ్రాండియర్‌కు ధీటుగా, పురాణాలను సైన్స్ ఫిక్షన్‌తో కలిపి ఒక ‘మెంటల్’ విజువల్ వండర్ క్రియేట్ చేయడంలో ఇతను తోపు. కల్కి 2898 AD సినిమా చూశాక హాలీవుడ్ కూడా షాక్ అయిందంటే అది నాగ్ అశ్విన్ విజన్. భారీ కథలను డీల్ చేసే విధానం చూస్తుంటే, రాజమౌళి రికార్డులు త్వరలోనే ‘డిలీట్’ అయ్యేలా ఉన్నాయి.
ప్రశాంత్ నీల్.. డార్క్ అండ్ రస్టిక్ వరల్డ్ బాస్
ఇక మాస్ ఆడియన్స్‌ను ఊగిపోయేలా చేయడంలో రాజమౌళి తర్వాత ఆ రేంజ్ ‘ఎలివేషన్లు’ ఇవ్వగల ఏకైక బాస్ ప్రశాంత్ నీల్. కేజీఎఫ్, సలార్ సినిమాలతో ఆయన సృష్టించిన ‘డార్క్ అండ్ రస్టిక్’ వరల్డ్ బాక్సాఫీస్ వద్ద పక్కా ‘సునామీ’. జక్కన్న విజువల్స్‌తో మ్యాజిక్ చేస్తే, నీల్ తన ‘యాక్షన్ గ్రాండియర్’తో థియేటర్లను షేక్ చేస్తున్నారు.
సుకుమార్.. ప్రాంతీయ కథకు గ్లోబల్ టచ్
మరోవైపు, క్యారెక్టర్లను డిజైన్ చేయడంలో సుకుమార్ ఒక అబ్సెషన్. పుష్ప సిరీస్‌తో ఒక లోకల్ ‘తగ్గేదేలే’ డైలాగ్‌ను గ్లోబల్ బ్రాండ్‌గా మార్చేసిన ఘనత సుక్కుది . రాజమౌళికి ఎమోషన్ బలం అయితే, సుకుమార్‌కు తన కథలోని హీరోల యాటిట్యూడ్ పవర్. ఇప్పటికే పుష్ప 2తో రూ 1800 కోట్లు కొల్లగొట్టి రికార్డుల రచ్చ చేసిన ఈ లెక్కల మాస్టర్ త్వరలో చరణ్ సినిమాతో రాజమౌళి రికార్డులను ‘టార్గెట్’ చేయడం ఖాయం.
సందీప్ రెడ్డి వంగా.. రా అండ్ బోల్డ్ బ్రాండ్
ఇక టాలీవుడ్ నుంచి వెళ్లి బాలీవుడ్‌ను గడగడలాడించిన ఏకైక ‘రా అండ్ బోల్డ్’ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. యానిమల్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తూ తనకంటూ ఒక సెపరేట్ ‘వంగా బ్రాండ్’ క్రియేట్ చేసుకున్నారు. రాజమౌళి క్లాసిక్ స్టైల్‌కు పూర్తి భిన్నంగా, అత్యంత వైల్డ్‌గా సినిమాలు తీయడం ఇతని స్పెషాలిటీ.మొత్తానికి, రాజమౌళి వేసిన బాటలో ఈ నలుగురు దర్శకులు ఇప్పుడు గ్లోబల్ మార్కెట్‌ను ఏలడానికి ‘రెడీ’ అయిపోయారు. కేవలం విజువల్స్ మీదనే కాకుండా బలమైన క్యారెక్టరైజేషన్లు, ఎమోషన్ల మీద పట్టు కలిగిన ఈ డైరెక్టర్లు భవిష్యత్తులో రూ. 3000 కోట్ల క్లబ్‌లో చేరే సినిమాలను అందించడం పక్కా. మరి వీరిలో రాజమౌళి రికార్డులను బ్రేక్ చేసే ఆ మొదటి ‘మొనగాడు’ ఎవరవుతారో కాలమే డిసైడ్ చేయాలి.
also read: తెలుగు ఇండస్ట్రీ షేక్.. ఎన్టీఆర్ వర్సెస్ కృష్ణ