E-Paper
Advertisement

Dhurandhar 2: డిమానిటైజేషన్ వెనుక రూ. 60 వేల కోట్ల కుట్ర.. సినిమాలో షాకింగ్ ట్విస్ట్!

Dhurandhar 2: డిమానిటైజేషన్ వెనుక రూ. 60 వేల కోట్ల కుట్ర.. సినిమాలో షాకింగ్ ట్విస్ట్!
Advertisement

Dhurandhar 2: భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) డిమానిటైజేషన్ ప్రకటించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. సడెన్‌గా రూ. 500 నోట్లు, రూ. 1000 నోట్లు ఇకపై చెల్లవని ఆయన ప్రకటించిన తర్వాత, అసలు అలా ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? సడెన్‌గా ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? అని అంతా చర్చలు నడిపారు. టీవీలలో డిబెట్స్ నడిచాయి. జనాలు ఆ నోట్లను మార్చుకునేందుకు రోడ్లపైకి వచ్చారు. బ్యాంకులన్నీ కిక్కిరిపోయాయి. చాలా మంది మోదీని తిట్టుకున్నారు కూడా. ఏం పని లేక ఇలాంటివన్నీ పుట్టిస్తుంటారు? అంటూ మోదీ అండ్ ప్రభుత్వంపై కొంతమంది విరుచుకుపడ్డారు. కానీ, మోదీ ఈ ప్రకటన వెనుక చాలా పెద్ద కథ ఉందనే విషయం ‘ధురంధర్ 2’ (Dhurandhar 2) మూవీ చూస్తే తెలుస్తోంది. ఈ సినిమాలో మోదీ డిమానిటైజేషన్ (Demonetization) ప్రకటన సీన్‌ చూస్తే.. ఓయమ్మ.. ఇంత కథ ఉందా? అని అంతా ఆశ్చర్యపోతారు.

Also Read- Sanjay Dutt: చంద్రబాబుతో సంజయ్ దత్ భేటీ.. ఏపీ పైనా బాలీవుడ్ కన్నుపడిందా?

పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులు తలలు బాదుకునేలా..

Advertisement

‘ధురంధర్ 2’లో పాకిస్తాన్ వంటి దేశాల నుండి వస్తున్న నకిలీ భారత కరెన్సీని అరికట్టడం కోసం, అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయంగా ఇందులో చూపించారు. అప్పటికే పాకిస్తాన్ నుంచి 11 వేల కోట్ల నకిలీ కరెన్సీ భారత్‌కు చేరిందని, ఇంకా రూ. 60 వేల కోట్ల కరెన్సీని పంపించి, ఇక్కడ రాజకీయాల్లో చిచ్చు పెట్టాలని పాకిస్తాన్ వేసిన కుట్రను దెబ్బకొట్టే క్రమంలో సైన్యం హెచ్చరికతో మోదీ ఈ డిమానిటైజేషన్ ప్రకటన చేసినట్లుగా చూపించారు. మోదీ అలా ప్రకటించగానే పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులు ఎంతగా తలలు బాదుకున్నారనేది తెరపై చూపిస్తుంటే.. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని ప్రతి ఒక్క భారతీయుడికి అనిపిస్తుంది. అంతగా ఆ సన్నివేశాలను దర్శకుడు ఆదిత్య ధర్ రక్తి కట్టించాడు. ఇలాంటి విషయాలు ప్రజలకు తెలియడం మంచిదే కానీ, అదే సమయంలో శత్రు దేశం కూడా మన ప్లాన్స్‌ని గమనిస్తుందని.. ఇలాంటి సినిమాలు తీసేవాళ్లు జాగ్రత్తలు వహించాలి.

Also Read- Horror Thriller OTT : డబ్బుకోసం కన్నింగ్ ప్లాన్… అద్దెకు వచ్చి బురిడి కొట్టించే పాపలు… షాక్ ఇచ్చే సైకో డాక్టర్

ఎకనామిక్ వార్‌ఫేర్

Advertisement

డైరెక్టర్ ఆదిత్య ధర్ ఈ సినిమాలో డిమానిటైజేషన్ వెనుక ఉన్న ఎకనామిక్ వార్‌ఫేర్ కోణాన్ని చాలా పవర్‌ఫుల్‌గా ఆవిష్కరించారు. సాధారణంగా మనం నోట్ల రద్దు అంటే సామాన్యులు పడ్డ ఇబ్బందులనే చూశాం కానీ, దేశ భద్రత దృష్ట్యా తెర వెనుక జరిగిన హై-స్టేక్స్ డ్రామాను ఈ సినిమా కళ్లకు కట్టినట్లు చూపించింది. శత్రు దేశం మన ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చడానికి సిద్ధం చేసిన రూ. 60 వేల కోట్ల నకిలీ కరెన్సీ ప్లాన్‌ను, ఒకే ఒక్క ప్రకటనతో మోదీ ఎలా చెక్ పెట్టారో చూపించిన తీరు ప్రేక్షకుల్లో దేశభక్తిని ఉరకలెత్తిస్తుంది. ముఖ్యంగా పాకిస్తాన్ ఉగ్రవాద నెట్‌వర్క్ ఒక్కసారిగా నిర్వీర్యం అయిపోయి, వాళ్లు తలలు బాదుకునే సీన్స్ థియేటర్లలో ఈలలు వేయించేలా ఉన్నాయి. వాస్తవానికి అప్పట్లో నకిలీ నోట్ల నియంత్రణకు చాలా కారణాలు వినిపించాయి కానీ, ఇది అసలు కథ అని ‘ధురంధర్ 2’ ఒక స్పై థ్రిల్లర్ రేంజ్‌లో ప్రెజెంట్ చేయడం విశేషం.

Also Read- Venky Atluri: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సెట్లోకి చిరుతపులి.. షాకింగ్ విషయం చెప్పిన డైరెక్టర్

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×