E-Paper
Advertisement

Fantasy Thriller : వింతలోకంలో మరో వింత… కారణం లేకుండా కత్తులు పట్టే మనుషులు… గాల్లోనే గల్లంతయ్యే ప్రాణాలు

Fantasy Thriller : వింతలోకంలో మరో వింత… కారణం లేకుండా కత్తులు పట్టే మనుషులు… గాల్లోనే గల్లంతయ్యే ప్రాణాలు
Advertisement

Fantasy Thriller : సాధారణంగా జాంబీ సినిమాలలో హింస బీభత్సంగా ఉంటుంది. అయితే ఇది ఒకరి నుంచి ఒకరికి రక్తం ద్వారా వైరస్ అంటుకుంటుంది. అయితే ఇందుకు భిన్నంగా ఒక హాలీవుడ్ మూవీ రూపొందింది. ఇందులో మనుషులు జాంబీలుగా మారరు, కానీ కేవలం చూపు కలవగానే హింసాత్మకంగా ప్రవర్తిస్తారు. ఈ విభిన్నమైన కాన్సెప్ట్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో మంచి గుర్తింపు పొందింది.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

స్టెఫాన్ కాస్టాంగ్ దర్శకత్వంలో వచ్చిన ఈ ఫ్రెంచ్ బ్లాక్ కామెడీ ఫాంటసీ థ్రిల్లర్ సినిమాపేరు ‘విన్సెంట్ మస్ట్ డై’ (Vincent Must Die). ఇది స్టెఫాన్ కాస్టాంగ్ కు మొదటి ఫీచర్ ఫిలిం.ఇందులో కరీం లెక్లో (విన్సెంట్), విమలా పోన్స్ (మార్గాక్స్) లీడ్ రోల్స్ లో నటించారు. 2023 కాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ సినిమా ప్రీమియర్ ప్రదర్శించింది ఈ మూవీ. 1 గంట 48 నిమిషాల పాటు సాగే ఈ సినిమా అంతర్జాతీయ వేదికలపై మంచి ప్రశంసలు అందుకుంది. అలాగే ఎన్నో అవార్డులను కూడా గెలుచుకుంది. ఈ సినిమా ప్రస్తుతం ప్రైమ్ వీడియో, ఆపిల్ టివిలలో అద్దెకు మాత్రమే అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

విన్సెంట్ అనే ఒక సాదాసీదా ఉద్యోగి, ఒకరోజు ఆఫీసులో కూర్చుని ఉంటాడు. అయితే అసలు ఏ తప్పూ చేయకపోయినా పక్కనే ఉన్న ఇంటర్న్ అబ్బాయి సడన్‌గా లేచి కంప్యూటర్ కీబోర్డ్‌తో విన్సెంట్ ముఖం మీద గట్టిగా కొడతాడు. అందరూ అది ఏదో చిన్న గొడవ అనుకుంటారు. కానీ ఆ తర్వాత వరుసగా దారిలో వెళ్లేవాళ్లు, అపరిచితులు, ఆఖరికి చిన్న పిల్లలు కూడా విన్సెంట్‌ని చూడగానే పిచ్చెక్కినట్టు చంపడానికి వస్తుంటారు. వాడు ఎవరినైనా కళ్ళలోకి చూస్తే చాలు, ఎదుటివాడికి పూనకం వచ్చినట్టు అయిపోయి విన్సెంట్‌ని ఏవైనా ఆయుధాలతో దాడి చేయడం మొదలుపెడతారు. ఈ వింత హింస అతని ఆఫీసు నుండి మొదలై, ప్రతిచోటా వ్యాపిస్తుంది. విన్సెంట్ తన ప్రాణాలను కాపాడుకోవడానికి పారిపోవాల్సి వస్తుంది. దారిలో వెళ్తున్నప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకుని, ఎవరికీ కనబడకుండా తిరుగుతుంటాడు.

ఈ క్రమంలోనే వాడికి మార్గాక్స్ అనే ఒక వెయిట్రెస్ పరిచయం అవుతుంది. వింత ఏంటంటే, మిగతా అందరిలా ఆమెకి విన్సెంట్‌ని చూడగానే చంపాలనే కోపం రాదు. చివరికి తెలిసేది ఏంటంటే, ఇది కేవలం విన్సెంట్‌కి మాత్రమే జరుగుతున్న సమస్య కాదు. లోకమంతా మెల్లమెల్లగా ఇలాంటి వింత వ్యాధితో నిండిపోతుంది. మనుషులు ఒకరినొకరు చూసుకోగానే చంపుకోవాలని చూస్తుంటారు. లోకం మొత్తం పిచ్చెక్కిపోయి రోడ్ల మీద కొట్టుకు చస్తుంటారు. విన్సెంట్, మార్గాక్స్ ఒకరినొకరు కళ్ళలోకి చూసుకోకుండా ఉండటానికి కళ్లకు గంతలు కట్టుకుని, పడవ మీద ఎక్కడికైనా సురక్షితమైన చోటుకి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటారు. చివరికి వీళ్ళు ఎక్కడికి వెళతారు ? ఈ వింత నుంచి ఎలా బయట పడతారు ? అసలు ఎందుకు మనుషులు కళ్ళలోకి చూస్తే కొట్టుకు చస్తున్నారు ? అనే విషయాలను, ఈ బ్లాక్ కామెడీ ఫాంటసీ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : జర్నలిస్ట్ కు చుక్కలు చూపించే సీరియల్ కిల్లర్‌… ఊహించని మలుపులతో టాప్ లేపుతున్న సైకలాజికల్ థ్రిల్లర్

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×