E-Paper
Advertisement

‘ధురంధర్’ ధాటికి బాహుబలి, పుష్ప రికార్డులు క్లీన్ స్వీప్.. ఫస్ట్ టైమ్ 3 వేల కోట్లు!

‘ధురంధర్’ ధాటికి బాహుబలి, పుష్ప రికార్డులు క్లీన్ స్వీప్.. ఫస్ట్ టైమ్ 3 వేల కోట్లు!
Advertisement

Dhurandhar Franchise: సరైన సినిమా తీస్తే ఆడియన్స్ ఎంతలా వెర్రెత్తిపోతారో మరోసారి ప్రూవ్ చేశాడు ఆదిత్య ధర్. యస్ ..రణ్‌వీర్ సింగ్  హీరోగా తన దర్శకత్వంలో వచ్చిన ‘ధురంధర్’ ఫ్రాంచైజీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. అదెంతలా అంటే ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నింటిని క్లీన్ స్వీప్ చేసేంతగా. లేటెస్ట్ గా ఈ ఎలివేషన్ ఎందుకంటారా .. ‘ధురంధర్’ ఫ్రాంచైజీ ఏకంగా ౩౦౦౦ కోట్లు కొల్లగొట్టి బాక్సాఫీస్ కా బాప్ అని ప్రూవ్ చేసుకుంది మరి.

ఇండియన్ సినీ హిస్టరీలోనే మొదటిసారి
మ్యాటర్ లోకి ఎంట్రీ ఇస్తే .. ఇండియన్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎన్నో భారీ బడ్జెట్ ఫిలిమ్స్, సెన్సేషన్ హిట్స్, ఇండస్ట్రీ రికార్డ్స్ ఇలా ఎన్నో చూశాం కానీ ఒకే ఒక ఫ్రాంచైజీ కేవలం రెండు భాగాలతో 3000 కోట్ల రూపాయల మైలురాయిని అందుకోవడం అంటే ఇండియన్ సినీ హిస్టరీలోనే మొదటిసారి. గతేడాది డిసెంబర్ 5న రిలీజ్ అయిన ఫస్ట్ పార్ట్ ‘ధురంధర్’ వరల్డ్ వైడ్ గా 1,307 కోట్లు కొల్లగొట్టి షాక్ ఇచ్చిన సంగతి తెల్సిందే. అయితే ఈసారి అంతకు మించి అంటూ ఈ ఏడాది మార్చి 19న రిలీజ్ అయిన సీక్వెల్ ‘ధురంధర్: ది రివెంజ్’ ఏకంగా థియేటర్లలోకి వచ్చిన కేవలం 26 రోజుల్లోనే 1,712 కోట్లు కొల్లగొట్టి ఇంకా బాక్సాఫీస్ ని షేక్ చేస్తూనే ఉంది.

Advertisement

మొట్టమొదటి ఇండియన్ ఫ్రాంచైజీగా రికార్డు

ఈ క్రమంలో ఈ రెండు సినిమాల వసూళ్లు కలిపితే 3,019 కోట్ల వసూళ్లని దాటి ఇప్పటిదాకా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులని సెట్ చేసిన బాహుబలి’, ‘పుష్ప’ సిరీస్ సినిమాలకి ముచ్చెమటలు పట్టిస్తుంది. యస్ .. బాహుబలి మొదటి భాగం 650 కోట్లు, రెండో భాగం 1,788 కోట్లు వసూలు చేయగా, ఆ ఫ్రాంచైజీ మొత్తం వసూళ్లు 2,438 కోట్ల రూపాయల వద్ద ఆగిపోయాయ్. ఇక అల్లు అర్జున్ ‘పుష్ప’ ఫ్రాంచైజీ విషయానికొస్తే, పార్ట్-1 సుమారు 350 కోట్లు, ‘పుష్ప-2 ది రూల్’ 1,742 కోట్లు వసూలు చేయగా టోటల్ గా 2,092 కోట్ల మార్కును టచ్ చేశాయ్.. కానీ, ‘ధురంధర్’ ఫ్రాంచైజీ మాత్రం కేవలం మూడు నెలల గ్యాప్ లోనే ఈ రెండు భారీ సిరీస్ సినిమాల రికార్డులని బద్దలు కొట్టి 3000 కోట్ల క్లబ్‌లో చేరిన మొట్టమొదటి ఇండియన్ ఫ్రాంచైజీగా రికార్డు క్రియేట్ చేసింది. అంతే కాదండోయ్ ఈ సిరీస్‌లోని రెండు సినిమాలు కూడా వెయ్యి కోట్ల మార్కును దాటడం ఇక్కడ మరో విశేషం.

Advertisement

మహేష్ , బన్నీలు దీనిపై గురి పెడతారా ?
ఇక ఈ సినిమా సక్సెస్ వెనుక మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే చైనా, గల్ఫ్ వంటి దేశాలలో ఈ సినిమా రిలీజ్ కాకుండానే ఈ స్థాయి వసూళ్లని రాబట్టడం గమనార్హం. హయ్యెస్ట్ కలెక్షన్స్ వచ్చిన సినిమాలకి అక్కడి మార్కెట్లు ఎంతలా సపోర్ట్ చేశాయో మనకి తెలిసిందే. మొత్తానికి ఆదిత్య ధర్ క్రేజీ మేకింగ్, రణ్‌వీర్ సింగ్ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌ను మరో లెవల్ కి తీసికెళ్లాయనే చెప్పాలి. ఇక ఈ సినిమా సెట్ చేసిన ఈ బెంచ్ మార్క్ ఇప్పట్లో మరే సినిమా బ్రేక్ చేసే చాన్స్ లేనట్టే కనిపిస్తుంది. చూడాలి మహేష్ , బన్నీలు దీనిపై ఏమైనా గురి పెడతారేమో!

Related News

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

Big Stories

Advertisement
×