IndiGo Summer Getaway Sale 2026: సమ్మర్ ప్రయాణాల నేపథ్యంలో ఇండిగో సమ్మర్ గెట్ అవే సేల్ ను ప్రారంభించింది. ప్రయాణికులకు తక్కువ ధరకే విమాన ప్రయాణం చేసే అవకాశాన్ని అందిస్తోంది. ఈ ఆఫర్ ద్వారా దేశీయ, అంతర్జాతీయ విమాన టిక్కెట్లపై గరిష్టంగా 10% వరకు తగ్గింపు లభిస్తుంది. ప్రయాణంలో ఉపయోగపడే కొన్ని అదనపు సర్వీసులపై కూడా భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. తక్కువ ధరలో ప్రయాణం చేయాలనుకునే వారికి ఈ పరిమిత కాల ఆఫర్ ఎంతో బాగా ఉపయోగపడనుంది.
ఈ సేల్ ఇవాళ్టి(14 ఏప్రిల్) నుంచి 17 ఏప్రిల్ 2026 వరకు అందుబాటులో ఉంటుంది. ప్రయాణ తేదీలు మాత్రం 1 జూలై నుంచి 9 అక్టోబర్ 2026 మధ్య ఎంచుకునే అవకాశం కల్పిస్తోంది. ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకునే వారికి మాత్రమే ఈ తగ్గింపులు వర్తిస్తాయి. ఇండిగో అధికారిక వెబ్ సైట్, మొబైల్ యాప్ ద్వారా టిక్కెట్లు బుక్ చేయాలి. బుకింగ్ సమయంలో SUMR10 అనే ప్రోమో కోడ్ ఉపయోగిస్తే డిస్కౌంట్ లభిస్తుంది.
ఈ ఆఫర్‌లో కేవలం టిక్కెట్ ధర మాత్రమే కాదు, ఇతర సేవలపై కూడా తగ్గింపులు ఉన్నాయి. ఫాస్ట్ ఫార్వర్డ్ సర్వీసుపై భారీ తగ్గింపు అందిస్తుంది. అదనపు లగేజీ తీసుకెళ్లే ప్రయాణికులకు 15 కిలోలు, 20 కిలోలు, 30 కిలోల వరకు ముందుగానే చెల్లించే బ్యాగేజ్ ఛార్జీలపై కూడా తగ్గింపు లభిస్తుంది. సీటు ఎంపికపై కూడా డిస్కౌంట్ ఉంది. ముఖ్యంగా ఎక్కువ లెగ్ రూమ్ ఉన్న ఎమర్జెన్సీ XL సీట్లు తక్కువ ధరలో పొందే అవకాశం ఉంది. ఈ సేల్ కుటుంబాలతో ప్రయాణించే వారికి, ఉద్యోగ ప్రయాణికులకు, టూరిస్టులకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే టిక్కెట్‌తో పాటు అవసరమైన సౌకర్యాలను కూడా తక్కువ ధరలో పొందవచ్చు. ముందుగా ప్లాన్ చేసుకుంటే ఇంకా ఎక్కువగా ఆదా చేయవచ్చు.
ఈ సేల్ కు సంబంధించి కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి. ఈ ఆఫర్ అన్ని ఫ్లైట్లకు వర్తించదు. ఎంపిక చేసిన ఇండిగో నాన్ స్టాప్ ఫ్లైట్లకు మాత్రమే వర్తిస్తుంది. అలాగే గ్రూప్ బుకింగ్స్, కోడ్ షేర్ ఫ్లైట్లకు ఈ డిస్కౌంట్ వర్తించదు. సీట్ల లభ్యత ఆధారంగా మాత్రమే ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
భారత విమానయాన రంగంలో ప్రస్తుతం పోటీ ఎక్కువగా ఉంది. అందుకే ప్రత్యేక సేల్స్ ద్వారా ప్రయాణికులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి ఎయిర్‌లైన్స్. ప్రభుత్వ నియంత్రణ సంస్థ DGCA కూడా ప్రయాణికులకు లాభం కలిగేలా కొత్త నిబంధనలు తీసుకొస్తోంది. టిక్కెట్ ధరలు పారదర్శకంగా ఉండేలా, ప్రయాణికులకు ఎక్కువ ఎంపికలు లభించేలా చర్యలు తీసుకుంటోంది. మొత్తంగా ఇండిగో సమ్మర్ గెట్ అవే సేల్ 2026 ప్రయాణాన్ని తక్కువ ఖర్చుతో ప్లాన్ చేసుకోవాలనుకునే వారికి మంచి అవకాశం. ముందుగా బుక్ చేసుకుంటే టిక్కెట్ తో పాటు అదనపు సర్వీసులలో కూడా మంచి తగ్గింపు పొందే అవకాశం ఉంది.
Read Also: రూ. 49 లక్షలు పెట్టి టిక్కెట్లు కొన్నా, విమానం ఎక్కనివ్వని సిబ్బంది..అసలేం జరిగిందంటే?