E-Paper
Advertisement

Ranveer Singh: భార్యను ఫాలో అవుతున్న బాలీవుడ్ హీరో.. అసలు మ్యాటర్ ఏంటంటే..?

Ranveer Singh: భార్యను ఫాలో  అవుతున్న బాలీవుడ్ హీరో.. అసలు మ్యాటర్ ఏంటంటే..?
Advertisement

Ranveer Singh: బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఈమధ్య దురంధర్ మూవీతో బాక్సాఫీస్ ని షేక్ చేశాడు. భారీ యాక్షన్ చిత్రంగా థియేటర్ లోకి వచ్చిన ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్టుగా నిలవడంతో అతని క్రేజీ ఒక్కసారిగా పెరిగింది.. 2025 డిసెంబర్‌ 5న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.. ఒకవైపు సినిమాని బ్యాన్ చేయాలంటూ విమర్శలు కూడా వినిపించాయి. ఆదిత్య ధర్‌ దర్శకత్వం వహించిన ఈ బ్లాక్‌బస్టర్‌ చిత్రానికి మూడు నెలల్లోనే సీక్వెల్‌ కూడా వచ్చేస్తోంది. దురంధర్ ది రివేంజ్ పేరుతో ఆ మూవీ మార్చిలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో హీరో రణవీర్ సింగ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం ఇది బాలీవుడ్ మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.. అసలేంటంటే..

కేరావ్యాన్స్ కోసం హీరో గొడవ నిజమేనా..?

దురంధర్ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. అయితే ఈ మూవీ రెండు పార్టీలు రాబోతున్న విషయం తెలిసిందే. మొదటి పాఠం విడుదల చేసిన కొన్ని రోజులకి ఈ సినిమా విడుదల కావడం విశేషం.. దురంధర్ ది రివేంజ్ పేరుతో మార్చి నెలలో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.. ధురంధర్‌ సినిమా సెట్‌లో రణ్‌వీర్‌ సింగ్‌ ఏకంగా మూడు కేరవాన్స్‌ అడిగాడని గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో రకరకాల పూకార్లు షికారు చేస్తున్నాయి.. తనకొక కేరవాన్‌, తన సిబ్బందికి మరో రెండు వానిటీ వ్యాన్స్‌ అడిగాడన్నది అక్కడ న్యూస్.. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో బాలీవుడ్ సినీ అభిమానులు భార్యను ఫాలో అవుతున్నావా అంటూ రణవీర్ ని ట్యాగ్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.. ఇందులో ఎటువంటి నిజంలేదని తెలుస్తుంది..

Advertisement

Also Read : మీనాక్షి చౌదరికి గోల్డెన్ ఆఫర్.. 100 కోట్ల సినిమాలో ఛాన్స్..!

అసలు జరిగిందేంటంటే..?

ఇటీవల ఓ ప్రెస్ మీట్ కు దురంధర్ సినిమా నిర్మాత యూనిట్ సభ్యులలోని ఓ వ్యక్తి ఇంటర్వ్యూ ఇచ్చారు.. బ్యాంకాక్‌లో షూట్‌ చేసినప్పుడు అక్కడ రెండు కార్లు ఉపయోగించాం. ఒక వానిటీ వ్యాన్‌ హీరోకు కాగా మిగతా కార్లు సిబ్బందికి, సామాన్లకు కార్లను ఎక్కువగా వాడాము.. అక్కడ లొకేషన్స్ మార్చిన సరే ఎక్కువగా కార్లనే వాడేమో అని ఆయన అన్నారు. అంతే తప్ప హీరో మూడు వానిటీ వ్యాన్స్‌ డిమాండ్‌ చేశాడన్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు అని ఆయన అన్నారు.. అంతేకాదు రణవీర్ సింగ్ గొప్ప నటుడు. ఈ సినిమా సీక్వెల్ కోసం దాదాపు 12 నుంచి 15 గంటలు పని చేశాడు. సినిమా కోసం 15 కేజీల వరకు బరువు కూడా తగ్గారు అని ఆయన అన్నారు. ప్రస్తుతం ఇది బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక రణవీర్ సింగ్ ఈ మూవీ తర్వాత మరో భారీ ప్రాజెక్టుకు సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×