E-Paper
Advertisement

Comedy Movie OTT : చావురోజే పెళ్లి… బ్లాక్ బస్టర్ జీవా మూవీ ఓటీటీలో… ఎప్పుడు ఎక్కడ చూడచ్చు అంటే ?

Comedy Movie OTT : చావురోజే పెళ్లి… బ్లాక్ బస్టర్ జీవా మూవీ ఓటీటీలో… ఎప్పుడు ఎక్కడ చూడచ్చు అంటే ?
Advertisement

Comedy Movie OTT : తమిళ నటుడు జీవా ప్రధాన పాత్రలో నటించిన ‘తలైవర్ తంబి తలైమైయిల్’. ఇటీవల థియేటర్లలోకి విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. పొంగల్ సీజన్‌కు ఊహించని విజయం అందుకుంది. గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో మంచి కామెడీ టైమింగ్ కూడా ఉంది. ఒక వైపు పెళ్లి, మరో వైపు చావు మధ్య వచ్చే సీన్స్ కడుపుబ్బ నవ్విస్తాయి. ఇక ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కి సిద్ధమవుతోంది. దీన్ని ఎప్పుడు, ఎక్కడ చూడవచ్చు అనేది తెలుసుకుందాం.

ఎక్కడ, ఏ ఓటీటీలో చూడవచ్చు అంటే

‘తలైవర్ తంబి తలైమైయిల్’ (Thalaivar Thambi Thalaimaiyil) స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీ సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 12 నుంచి ఈ తమిళ కామెడీ మూవీ  స్ట్రీమింగ్ కానుంది. పొంగల్ కు థియేటర్లలోకి వచ్చిన ‘తలైవర్ తంబి తలైమైయిల్’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నితీష్ సహదేవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జీవా ప్రధాన పాత్రలో తంబి రామయ్య, ఇళవరసు, ప్రార్థన నాథన్‌ ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ చిత్రం 2026 జనవరి 15న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ ఊహించని విజయం అందుకుంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఊర్లో అందరికీ తలవొంచి పనిచేసే జీవరత్నం (జీవా) ఒక పంచాయతీ ప్రెసిడెంట్. అతను ఒక వివాహా వేడుకను నిర్వహించే బాధ్యత తీసుకుంటాడు. అయితే పెళ్లి సన్నాహాలు జరుగుతుండగా, పక్క ఇంట్లో ఒక మరణం సంభవిస్తుంది. వివాహం జరిగిన రోజునే అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబం పట్టుబడుతుంది. ఒక పక్క శుభకార్యం, మరోపక్క చావు మధ్య పెళ్లి జరిపించడానికి జీవరత్నం నలిగిపోతాడు. ఆ చావు వల్ల పెళ్లి ఆగిపోకూడదని, అసలు విషయం బయటపడకుండా జీవా పడే పాట్లు, చేసే కామెడీ ప్లాన్లు కడుపుబ్బ నవ్విస్తాయి.

అయితే కేవలం నవ్వులే కాకుండా ఈ కథలో ఒక చిన్న సమస్యను ఊరి జనం ఎలా చూస్తారు, రాజకీయ నాయకులు దాన్ని తమ స్వార్థానికి ఎలా వాడుకుంటారు అనేది దర్శకుడు చాలా సహజంగా చూపించాడు. చివరికి ఆ గందరగోళం నుంచి జీవా తన తెలివితేటలతో ఆ పెళ్లిని ఎలా జరిపించాడు ? ఊరిలో తన పరువును ఎలా కాపాడుకున్నాడు అనేదే ఈ సినిమా క్లైమాక్స్.

Advertisement

Read Also : శరీరాలను మార్చే ఆత్మలు… గందరగోళంలో పడే ఫ్యామిలీ… మనసుకు హత్తుకునే క్లైమాక్స్

Tags

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×