Trivikram: తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో రైటర్ మరియు దర్శకుల ప్రస్తావన వస్తే ప్రస్తుత కాలంలో మొదటి వినిపించే పేరు త్రివిక్రమ్ శ్రీనివాస్. రచయితగా కెరియర్ మొదలు పెట్టిన త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదటి సినిమాతోనే మంచి పేరు సాధించుకున్నారు. తర్వాత తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ రైటర్ గా మారిపోయాడు. ఇప్పటికీ కొన్ని సినిమాల ప్రస్తావని వస్తే దర్శకుడు త్రివిక్రమ్ పేరు గుర్తొస్తుంది.
నువ్వు నాకు నచ్చావ్, నువ్వే కావాలి, స్వయంవరం, చిరునవ్వుతో, మల్లీశ్వరి, మన్మధుడు ఈ సినిమా పేర్లు చెబితే మొదట అందరూ మాట్లాడేది త్రివిక్రమ్ గురించి. అయితే రచయితగా కెరియర్ మొదలు పెట్టిన త్రివిక్రమ్ నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడుగా మారిపోయాడు. తరుణ్ శ్రియా నటించిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించుకుంది. ఆ తర్వాత మహేష్ బాబు హీరోగా చేసిన అతడు సినిమాతో దర్శకుడుగా త్రివిక్రమ్ కు మంచి పేరు వచ్చింది.
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో తమన్ ఒకరు. తమన్ గురించి ప్రస్తావని వస్తే అరవింద సమేత వీర రాఘవ సినిమాకి ముందు తర్వాత అని చెప్పొచ్చు. అరవింద సమేత వీర రాఘవ సినిమాకి ముందు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన సినిమా అజ్ఞాతవాసి. సినిమాకు ఊహించిన స్థాయిలో సక్సెస్ రాలేదు. వెంటనే అరవింద సమేత వీర రాఘవ సినిమాతో సక్సెస్ అందుకున్నాడు త్రివిక్రమ్. ఆ సినిమాకి తమన్ ఇచ్చిన మ్యూజిక్ కూడా మంచి ప్లస్ అయింది.
అక్కడి నుంచి త్రివిక్రం చేసిన ప్రతి సినిమాకు తమన్ మాత్రమే సంగీతం అందించారు. ఆ తర్వాత అలవైకుంఠపురంలో సాంగ్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయాయి. గుంటూరు కారం సినిమా ఆల్బమ్ కూడా బాగానే వర్కౌట్ అయింది. అయితే ప్రస్తుతం ఇప్పుడు త్రివిక్రమ్ వెంకటేష్ తో చేస్తున్న సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ ను సంగీత దర్శకుడుగా పెట్టుకున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాకు అనిరుద్ సంగీతం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
అయితే త్రివిక్రమ్ ఇలా సంగీత దర్శకులను దూరం పెట్టడానికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉంటాయి. కాకపోతే అవి ఎవరికీ అంత చిక్కవు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన జల్సా, జులాయి, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఆ తర్వాత కాలంలో దేవి శ్రీ తో మళ్లీ పని చేయలేదు త్రివిక్రమ్.
ఇప్పుడు దేవిశ్రీ ని పక్కన పెట్టినట్లు ఇప్పుడు మూడు సినిమాలు వరుసగా అయిపోయిన తర్వాత తమన్ ను త్రివిక్రమ్ శ్రీనివాస్ పక్కన పెట్టేసాడు అని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే త్రివిక్రమ్ తమన్ ను పక్కన పెట్టడానికి కారణాలు ఏంటి అనేది ఇప్పటికీ ఎవరికీ అంతుచిక్కడం లేదు. దీని గురించి ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.
Also Read: OG 2 : బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా 40 కోట్లు నష్టం, ఓజీ సీక్వెల్ ఇక లేనట్లేనా?