E-Paper
Advertisement

OG 2 : బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా 40 కోట్లు నష్టం, ఓజీ సీక్వెల్ ఇక లేనట్లేనా?

OG 2 : బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా 40 కోట్లు నష్టం, ఓజీ సీక్వెల్ ఇక లేనట్లేనా?
Advertisement

OG 2 : 2014 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ జనసేన అనే పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సినిమాలు మీద ఆసక్తి పూర్తిస్థాయిలో పవన్ కళ్యాణ్ కు తగ్గిపోయింది. అయితే పవన్ పూర్తిస్థాయి రాజకీయాల మీద దృష్టి సారించాలి అనే ఉద్దేశంతో సినిమాలుకు దూరం అవుతున్నట్లు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. మొత్తానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా తర్వాత మళ్లీ సినిమాలు చేయను అని పవన్ కళ్యాణ్ అనౌన్స్మెంట్ కూడా చేసేశారు.

బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని డిజాస్టర్ అందుకుంది అజ్ఞాతవాసి సినిమా. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మళ్లీ వకీల్ సాబ్ అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. కేవలం త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ ను కన్విన్స్ చేయడం వలనే ఈ ప్రాజెక్టు జరిగింది అని దిల్ రాజు పలు సందర్భాల్లో చెప్పారు. రీ ఎంట్రీ తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన ఏ సినిమాలు కూడా ఊహించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయాయి. రీసెంట్ గా వచ్చిన ఓ జి సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులంతా కూడా ఆ సినిమాతో ఫుల్ హ్యాపీ.

ఓజి 2 ఇక లేనట్లేనా?

Advertisement

బాక్స్ ఆఫీస్ వద్ద ఓజీ సినిమాకు మంచి సక్సెస్ వచ్చింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే ఆ సినిమాకి భారీ స్థాయిలో కలెక్షన్ లో వచ్చినా కూడా కొంతమంది బయ్యర్లకు భారీగా నష్టం వచ్చిందట. ఈ ప్రాజెక్టుకు సంబంధించి దాదాపు 40 కోట్ల వరకు కూడా నష్టం వచ్చినట్లు తెలుస్తుంది.

ఇప్పుడు ఓజి 2 సినిమా వస్తే కొనడానికి కూడా ఎవరూ సిద్ధంగా లేరు అనేది వినికిడి. అయితే దీనివల్లనే నిర్మాత డి వి దానయ్య కంప్లీట్ గా ఓ జి ప్రాజెక్ట్ ఆపేద్దాం అని ఫిక్స్ అయ్యారట. మరోవైపు సుజిత్ నాని సినిమాతో బిజీగా మారిపోయాడు. అయితే సుజిత్ కు మరియు నిర్మాత డివివి దానయ్యకు కూడా ఓజీ విషయంలో కొన్ని మనస్పర్ధలు వచ్చినట్లు కథనాలు వినిపించాయి.

Advertisement

వీటి పైన సుజిత్ కూడా ప్రెస్ నోట్ విడుదల చేసి క్లారిటీ ఇచ్చాడు. అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం దాదాపు సొంతంగా ఆరు కోట్ల వరకు ఓ.జి సినిమాకు సుజిత్ ఖర్చుపెట్టినట్లు సోషల్ మీడియాలో వినికిడి

బ్లాక్ బస్టర్ ఏ కానీ నో బ్రేక్ ఈవెన్ 

ఈ సినిమాకి వస్తున్న పాజిటివ్ టాక్ చూసి పవన్ కళ్యాణ్ అభిమానులంతా కూడా ఫుల్ ఖుషి అయిపోయారు. పవన్ కళ్యాణ్ స్టామినా అంటే ఏంటో సినిమా చూపించింది అంటూ భారీ ఎలివేషన్ వేశారు. అలానే ఈ సినిమాకి కలెక్షన్లు దాదాపు 300 కోట్లకు పైగా దాటి వచ్చాయి. ఇన్ని కలెక్షన్స్ వచ్చినా కూడా ఇంకా కొంతమంది బయ్యర్లకు బ్రేక్ ఈవెన్ కాలేదు. అది కొంచెం బాధాకరమైన విషయమే.

మొత్తానికి ఈ సినిమాకి సంబంధించి సీక్వెల్ ఉండదు అని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ అయితే నడుస్తుంది. ఈ తరుణంలో ఏదైనా క్లారిటీ ఇచ్చి పవన్ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపుతారేమో చూడాలి. మరోవైపు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వస్తే చూడడానికి ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు పవన్ ఫ్యాన్స్.

Also Read: Shruti Hassan : ఇది నా శరీరం, నాకు నచ్చిన సర్జరీలు చేసుకుంటాను , ట్రోలర్స్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన శృతి

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×