E-Paper
Advertisement

Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో 2వేల అపార్ట్ మెంట్స్, ఇప్పటికే నలుగురు మృతి

Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో 2వేల అపార్ట్ మెంట్స్, ఇప్పటికే నలుగురు మృతి
Advertisement

Fire Accident: హాంకాంగ్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. హాంకాంగ్‌లోని అతి పెద్ద రెసిడెన్షియల్ ఎస్టేట్ అయిన వాంగ్ ఫక్ కోర్ట్లో ఈ ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో మొత్తం నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా విషాదఛాయలు నింపింది. ఈ అగ్ని ప్రమాదంలో ఏడుగురు గాయపడ్డారు. వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడినవారిలో నలుగురు చనిపోగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకొకరు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. అధికారులు మృతుల వివరాలు ఇంకా పూర్తిగా వెల్లడించలేదు.

తాయ్ పోలోని వాంగ్ ఫక్ కోర్ట్ హౌసింగ్ ఎస్టేట్లో దాదాపు 2 వేల అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. హాంకాంగ్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటల 51 నిమిషాలకు ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. అకస్మాత్తుగా భారీగా మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. ఎత్తైన భవంతి నుంచి మంటలు, పొగ వ్యాపించడం చూసి స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు.

Advertisement

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు ఆర్పివేసి, సహాయక చర్యలు చేపట్టారు. భవంతిలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చేందుకు కృషి చేశారు. మంటలు ఆకాశాన్ని తాకేలా ఎగసిపడ్డాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అగ్ని ప్రమాదం సంభవించిన కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. భవనంలో భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా అనే కోణంలో పరిశీలిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ALSO READ: Shruti Hassan : ఇది నా శరీరం, నాకు నచ్చిన సర్జరీలు చేసుకుంటాను , ట్రోలర్స్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన శృతి

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×