E-Paper
Advertisement

Vijay -Rashmika: విజయ్ – రష్మిక మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

Vijay -Rashmika: విజయ్ – రష్మిక మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
Advertisement

Vijay -Rashmika:తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇన్ని రోజులు రూమర్డ్ జంటగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న(Rashmika mandanna) ఎట్టకేలకు ఫిబ్రవరి 26వ తేదీన ఉదయపూర్ లోని చారిత్రక ప్యాలెస్ వేదికగా ఒక్కటి కాబోతున్నారు.. అయితే ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా దీనిపై ఇంకా ఈ జంట స్పందించకపోవడం ఆశ్చర్యకరం. ఇదిలా ఉండగా 26వ తేదీన వీరి వివాహం జరగబోతోంది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్న సమయంలోనే ఈ ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ కూడా ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. మరి విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో ఇప్పుడు చూద్దాం.

ఆశ్చర్యపరుస్తున్న విజయ్ – రష్మిక మధ్య ఏజ్ గ్యాప్..

విజయ్ దేవరకొండ 1989 మే 9న జన్మించారు. ప్రస్తుతం ఆయన వయసు 36 సంవత్సరాలు కాగా.. రష్మిక మందన్న 1996 ఏప్రిల్ 5న జన్మించారు. ఇక ఇద్దరి డేట్ అఫ్ బర్త్ ప్రకారం ఇద్దరి మధ్య సుమారుగా ఏడు సంవత్సరాల వయసు గ్యాప్ ఉంది. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి వయసు తేడాలు చాలా సర్వసాధారణమైన విశ్లేషకులు కూడా చెబుతున్నారు. ముఖ్యంగా తెరపై కెమిస్ట్రీ.. వ్యక్తిగతంగా అర్థం చేసుకోవడం, కెరియర్ దృక్పథం ఇవే బంధాన్ని నిలబెట్టే అంశాలు. కాబట్టి ఏజ్ గ్యాప్ కేవలం ఒక సంఖ్య మాత్రమేనని అటు అభిమానులు కూడా అభిప్రాయపడుతున్నారు.

రూమర్స్ నుంచి పెళ్లి వరకు..

Advertisement

2018లో వచ్చిన గీత గోవిందం సినిమాతో వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత 2019లో డియర్ కామ్రేడ్ సినిమా సమయంలో వీరి ప్రేమ మరింత బలపడిందనే వార్తలు వినిపించాయి. దీనికి తోడు ఇద్దరు చట్టపట్టలేసుకొని తిరిగారు. కలిసి వెకేషన్ లకి కూడా వెళ్లారు. అక్కడినుంచి కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు . అయితే ఈ ఫోటోలు జంటగా పంచుకోకపోయినా విడివిడిగా పంచుకున్నా సరే.. ఫోటోలలోని బ్యాక్ గ్రౌండ్ వీరిద్దరూ ఒకే ప్లేస్ లో ఉన్నారనే విషయాన్ని స్పష్టం చేసింది. అప్పటినుంచి వీరిద్దరూ ఎన్నో రకాలుగా మీడియా కంట పడ్డారు. కానీ తమ బంధాన్ని బయట పెట్టలేదు. దీనికి తోడు రహస్యంగా గతేడాది నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని అయినా బయటపెడతారు అనుకుంటే అది కూడా జరగలేదు. ఇక ఎట్టకేలకు ఫిబ్రవరి 26వ తేదీన వివాహం చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని కూడా రహస్యంగా దాచి పెట్టడంతో అభిమానుల సైతం ఈ జంటపై కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు.

ALSO READ:Prabhas -Prashanth: ప్రభాస్ లైనప్ నుండి ప్రశాంత్ ఔట్.. తప్పించారా? తప్పుకున్నారా?

మొదలైన పెళ్లి పనులు..

Advertisement

ఇకపోతే ఫిబ్రవరి 26 తేదీన ఘనంగా వివాహం జరగబోతున్న నేపథ్యంలో అప్పుడే రష్మిక – విజయ్ దేవరకొండ ఇంట పెళ్లి పనులు మొదలయ్యాయి. విజయ్ దేవరకొండ నుంచి వైరల్ అయిన విజువల్స్ ఈ విషయాన్ని తేల్చేసాయి. ముఖ్యంగా మిరమిట్లు గొలిపే లైట్స్ తో ఆ ఇంటిని చాలా అందంగా ముస్తాబు చేశారు. ఇక పెళ్లి పనులు ప్రారంభమైన వేళ అటు వెడ్డింగ్ కార్డ్స్ కూడా పంచుతూ.. తమ పెళ్లికి బంధుమిత్రులను ఆహ్వానిస్తున్నారు ఈ జంట. ఇదిలా ఉండగా మార్చి 4వ తేదీన హైదరాబాదులో సినీ, రాజకీయ ప్రముఖుల కోసం రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు.

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×