Prabhas -Prashanth: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే దర్శకుడిగా తనకంటూ ఒక గుర్తింపు అందుకోవడమే కాకుండా ఏకంగా పాన్ ఇండియా డైరెక్టర్గా పేరు దక్కించుకున్న ప్రశాంత్ వర్మ(Prashanth Varma)గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ‘హనుమాన్’ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ డైరెక్టర్గా పేరు సొంతం చేసుకున్న ప్రశాంత్ వర్మ తో సినిమాలు చేయడానికి అటు స్టార్ హీరోలు కూడా వరుసగా క్యూ కట్టారు. అందులో భాగంగానే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ‘బ్రహ్మ రాక్షస’ అనే టైటిల్ ప్రకటించారు. ఇక ప్రభాస్ – ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో సినిమా అనగానే అభిమానులలో కూడా అంచనాలు పెరిగిపోయాయి.
అయితే సినిమా ప్రకటన అయితే చేశారు కానీ ఈ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్ రాలేదు. అయితే ఇప్పుడు ఏమైందో తెలియదు కానీ ఇప్పుడు బ్రహ్మ రాక్షస సినిమా ఆగిపోయిందనే వార్తలు ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక ప్రభాస్ – ప్రశాంత వర్మ కాంబినేషన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అభిమానులకు ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పడంలో సందేహం లేదు..ఇకపోతే హనుమాన్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రశాంత్ వర్మ ప్రకటించిన చిత్రాలలో ఆగిపోయిన మూడవ చిత్రం ఇది. మొదట బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ తో రాక్షస అనే ప్రాజెక్టును అనౌన్స్ చేశారు. క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల అది కాస్త ఆగిపోయింది. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ డెబ్యూ సినిమా విషయంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయి. ఇక దాని గురించి ప్రస్తావనే లేదు. ఇప్పుడు ప్రభాస్ సినిమా కూడా ప్రస్తుతానికి అటకెక్కినట్లే అనే వార్తలు వినిపిస్తున్నాయి.
నిజానికి షూటింగ్ కు ముందే జరిగిన టెస్ట్ షూట్ తర్వాత ప్రభాస్ కొన్ని మార్పులు కోరడం.. దానికి తోడు కాల్ షీట్లు ఇబ్బందుల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమా నుండి ప్రశాంత్ వర్మ తప్పుకున్నారా? తప్పించారా? అనే వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో ప్రభాస్ కి తగిన డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల ఈ సినిమా ఆగిపోయినట్లు తెలుస్తోంది. అయితే ప్రశాంత్ వర్మకి ఊరట నిచ్చే ఏకైక అంశం జై హనుమాన్.. రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో వస్తున్న ఈ సినిమా పనులు వేగంగా జరుగుతున్నాయి. అటు హంపిలో ఈ సినిమాకు సంబంధించిన గ్రాండ్ లాంచ్ ప్లాన్ చేశారు.
ALSO READ:Priyanka Chopra: ‘ది బ్లఫ్’లో స్టంట్స్‌కు నో చెప్పిన ప్రియాంక.. అసలు కారణం ?
అటు ప్రభాస్ విషయానికి వస్తే ఆయన వరుస లైనప్ తో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది రాజాసాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ ను చవిచూశారు. మరోవైపు అనురాగవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. అలాగే సందీప్ తో స్పిరిట్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలలో ఫౌజీ ఆగస్టు 14న విడుదలకు సిద్ధమవుతూ ఉండగా.. అటు స్పిరిట్ వచ్చే ఏడాది మార్చి 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.