E-Paper
Advertisement

Allu Arjun: అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో బన్నీ ధరించిన షర్టు, వాచ్ ఖరీదు తెలిస్తే షాక్!

Allu Arjun: అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో బన్నీ ధరించిన షర్టు, వాచ్ ఖరీదు తెలిస్తే షాక్!
Advertisement

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ‘గంగోత్రి’ సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈయన అంతకుముందు చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా తన మేనమామ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక హీరోగా ఒక్కో మెట్టు ఎదుగుతూ నేడు గ్లోబల్ స్టార్ గా పేరు దక్కించుకున్నారు అల్లు అర్జున్. అటు ఇండియాలోనే కాకుండా ఇటు జపాన్ లో కూడా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు.

అట్లీ సినిమాకి కాస్త బ్రేక్ ఇచ్చిన బన్నీ..

ప్రస్తుతం ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ(Atlee ) దర్శకత్వంలో AA22xA6 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నారు. అంతర్జాతీయ విఎఫ్ఎక్స్ కంపెనీలు ఈ చిత్రం కోసం పనిచేస్తున్నాయి .సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో దీపికా పదుకొనే(Deepika Padukone) హీరోయిన్గా నటిస్తూ ఉండగా.. ‘పుష్ప’ సినిమాలో ఈయనకు జోడిగా నటించిన రష్మిక మందన్న (Rashmika mandanna) ఇందులో విలన్ గా నటిస్తోంది. జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ లాంటి హీరోయిన్లు కూడా ఇందులో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

తమ్ముడి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో బన్నీ స్పెషల్ అట్రాక్షన్..

Advertisement

ఇదిలా ఉండగా ఇటీవల దుబాయ్ వెకేషన్ లో అల్లు అర్జున్ సందడి చేసిన విషయం తెలిసిందే . దీనికి కారణం ఆయన సోదరుడు, ప్రముఖ హీరో అల్లు శిరీష్ (Allu Sirish) ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో భాగంగా అల్లు అర్జున్ ఫ్యామిలీ మొత్తం అక్కడ సందడి చేసింది. ఇకపోతే గత రెండు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న అల్లు శిరీష్ ఎట్టకేలకు గత ఏడాది నయానికా రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఆమెతో ఏడడుగులు వేయడానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగానే దుబాయ్ వేదికగా ఒక షిప్ లో చాలా ఘనంగా ప్రీ వెడ్డింగ్ వేడుకలను జరుపుకున్నారు.

ఆకట్టుకుంటున్న ఫోటోలు..

అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అందులో బన్నీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ముఖ్యంగా ఆయన ధరించిన షర్టు, పెట్టుకున్న వాచ్ అన్నీ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. ఇకపోతే ఇవి అందర్నీ ఆకట్టుకోవడమే కాకుండా వీటి ధరలు తెలిసి అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో బన్నీ ధరించిన ఆ షర్ట్ పెట్టుకున్న వాచ్ ఖరీదు ఎంతో ఇప్పుడు చూద్దాం.

Advertisement

ALSO READ:Amrutham SS Kanchi: కల్ట్ క్లాసిక్ వెనుక కన్నీళ్లు.. ఆర్టిస్టులు దొరక్కపోతే.. రాజమౌళి సోదరుడు క్లారిటీ!

లగ్జరీ నెస్ చూపించిన బన్నీ..

అల్లు అర్జున్ ఎల్లో కలర్ ప్రింటెడ్ సిల్క్ ట్విల్ షర్ట్ ధరించారు. దీని విలువ అక్షరాల రూ.1,39,600.. ఇక ఆయన పెట్టుకున్న వాచ్ రోలెక్స్ డే డేట్ 40 ఎడిషన్ ఇది.. దీని విలువ అక్షరాల రూ.61,26, 661.. అలాగే ఆయన పెట్టుకున్న సన్ గ్లాసెస్ విషయానికి వస్తే అది లిమిటెడ్ పీస్ కేవలం 30 పీసులు మాత్రమే ఆ కంపెనీ వాటిని తయారు చేసిందట.( Helios Matte yellow gold).. దీని విలువ అక్షరాల 1,38,408. ఇక ధర సంగతి పక్కన పెడితే ఆయన అవుట్ ఫిట్ మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి మొత్తానికైతే అల్లు అర్జున్ తన రేంజ్ నిరూపించుకున్నారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Related News

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

Big Stories

Advertisement
×