E-Paper
Advertisement

Home Exercise: జిమ్ అవసరం లేకుండానే.. ఎక్కువ క్యాలరీలు తగ్గించే హోమ్ వర్కవుట్స్

Home Exercise: జిమ్ అవసరం లేకుండానే.. ఎక్కువ క్యాలరీలు తగ్గించే హోమ్ వర్కవుట్స్
Advertisement

Home Exercise: నేటి బిజీ లైఫ్ స్టైల్‌లో ఫిట్‌నెస్‌ కోసం ప్రత్యేకంగా జిమ్‌కు వెళ్లడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అయితే.. ఆరోగ్యంగా ఉండటానికి,పెరిగిన బరువును తగ్గించుకోవడానికి జిమ్ అవసరం లేదు. మన ఇంట్లోనే ఉండే చిన్న స్థలంలో, ఎలాంటి పరికరాలు లేకుండా చేసే కొన్ని వ్యాయామాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. సరైన పద్ధతిలో వ్యాయామం చేయడం వల్ల కేవలం కొవ్వు కరగడమే కాకుండా.. గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. అంతే కాకుండా రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. క్యాలరీలను వేగంగా బర్న్ చేసే 8 ఉత్తమ వ్యాయామాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

క్యాలరీలను బర్న్ చేసే 8 హోమ్ రెమెడీస్:

Advertisement

బరువు తగ్గడం అనేది మనం తీసుకునే ఆహారం, చేసే శారీరక శ్రమపై ఆధారపడి ఉంటుంది. ఈ కింది వ్యాయామాలు మీ శరీరంలోని మెటబాలిజం రేటును పెంచి, తక్కువ సమయంలో ఎక్కువ శక్తిని ఖర్చు చేసేలా చేస్తాయి.

1. బర్పీస్ :
బర్పీస్ అనేవి పూర్తి శరీర వ్యాయామం. ఇది మీ గుండె వేగాన్ని పెంచి, ఛాతి, చేతులు, కాళ్లకు బలాన్ని ఇస్తుంది. ఒక నిమిషం పాటు బర్పీస్ చేయడం వల్ల దాదాపు 10 నుంచి 15 క్యాలరీలు ఖర్చవుతాయి. ఇది కార్డియో , స్ట్రెంత్ ట్రైనింగ్ కలయిక.

Advertisement

2. మౌంటైన్ క్లైంబర్స్ :
పుష్-అప్ పొజిషన్‌లో ఉండి, కాళ్లను వేగంగా కదుపుతూ చేసే ఈ వ్యాయామం పొట్ట దగ్గర కొవ్వును కరిగించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇది కోర్ కండరాలను బలోపేతం చేస్తుంది. అంతే కాకుండా గంటకు సుమారు 400-500 క్యాలరీలను బర్న్ చేయగలదు.

3. జంపింగ్ జాక్స్:
ఇది అత్యంత సులభమైన, ప్రభావవంతమైన కార్డియో వ్యాయామం. నిలబడి గాలిలోకి ఎగురుతూ కాళ్లు, చేతులు వెడల్పుగా చేయడం ద్వారా రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇది కేవలం బరువు తగ్గడానికే కాకుండా శరీరానికి మంచి ఫ్లెక్సిబిలిటీని ఇస్తుంది.

4. హై నీస్ :
ఒకే చోట నిలబడి, పరిగెత్తుతున్నట్లుగా మోకాళ్లను ఛాతి వరకు వేగంగా పైకి ఎత్తాలి. ఇది తక్కువ సమయంలో ఎక్కువ క్యాలరీలను ఖర్చు చేస్తుంది. 10 నిమిషాల హై నీస్ చేయడం వల్ల మీరు రన్నింగ్ చేసినంత ఫలితం పొందుతారు.

5. స్క్వాట్స్ :
స్క్వాట్స్ ప్రధానంగా తొడలు , పిరుదుల కండరాలపై ప్రభావం చూపుతాయి. ఇవి కండరాల నిర్మాణానికి సహాయ పడతాయి. శరీరంలో కండరాలు ఎంత ఎక్కువగా ఉంటే, విశ్రాంతి సమయంలో కూడా క్యాలరీలు అంత ఎక్కువగా బర్న్ అవుతాయి.

6. ప్లాంక్ :
ప్లాంక్ చేయడం వల్ల క్యాలరీలు నేరుగా బర్న్ అవ్వకపోయినా.. ఇది మీ కోర్ కండరాలను చాలా బలంగా మారుస్తుంది. బలమైన కోర్ ఉంటే ఇతర వ్యాయామాలను ఎక్కువ సమయం చేయగలుగుతారు. ఇది శరీర ఆకృతిని మెరుగు పరుస్తుంది.

Also Read: చక్కెర మానేయాలా ? తీపి కోరికను తీర్చే.. 5 ఆరోగ్యకరమైన మార్గాలు

7. పుష్-అప్స్:

మీ చేతులు, భుజాలు , ఛాతి బలాన్ని పెంచడానికి పుష్-అప్స్ మించిన వ్యాయామం లేదు. ఇవి మెటబాలిజం రేటును పెంచి శరీర పైభాగంలో ఉన్న కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి.

8. లెంజెస్ :
కాళ్లను ముందుకు వేస్తూ మోకాళ్లపై వంగే ఈ వ్యాయామం లోయర్ బాడీని టోన్ చేయడానికి ఉపయోగ పడుతుంది. ఇది బ్యాలెన్స్ పెంచుతుంది. అంతే కాకుండా నడుము కింది భాగాన్ని దృఢంగా మారుస్తుంది.

పైన పేర్కొన్న వ్యాయామాలను క్రమం తప్పకుండా రోజుకు 30 నుంచి 45 నిమిషాల పాటు చేస్తే ఆశించిన ఫలితాలు వస్తాయి. వ్యాయామంతో పాటు తగినంత నీరు తాగడం , పౌష్టికాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రారంభంలో నెమ్మదిగా మొదలుపెట్టి.. క్రమంగా వ్యాయామం చేసే సమయాన్ని పెంచండి.

Related News

ఒక్క పన్ను పీకడానికి రూ.2.25 లక్షలా.. అదే ఇండియాలో అయితే?

డెస్క్ జాబ్ చేస్తున్నారా? ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

తగ్గేదెలే.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆత్మగౌరవం విషయంలో అసలు రాజీపడరు

స్కూల్‌కు వెళ్లే సమయం అయినా పిల్లలు నిద్రలేవడం లేదా? ఈ 5 టిప్స్‌తో మార్నింగ్ రొటీన్ మార్చండి

గుండెపోటు ముప్పును 30 శాతం తగ్గించగల పిల్.. తాజా అధ్యయనంలో అద్భుత ఫలితాలు

వర్షాకాలంలో తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఈ పుడ్స్

రక్తంలో చక్కెర పెరగకుండా ఉండాలంటే ఆపిల్ తినాలా? పియర్ తినాలా?

ఉదయం ఫ్రెష్‌గా లేవాలంటే రాత్రి ఎప్పుడు పడుకోవాలి? నిపుణులు ఏం చెబుతున్నారు?

Big Stories

Advertisement
×