E-Paper
Advertisement

Amrutham SS Kanchi: కల్ట్ క్లాసిక్ వెనుక కన్నీళ్లు.. ఆర్టిస్టులు దొరక్కపోతే.. రాజమౌళి సోదరుడు క్లారిటీ!

Amrutham SS Kanchi: కల్ట్ క్లాసిక్ వెనుక కన్నీళ్లు.. ఆర్టిస్టులు దొరక్కపోతే.. రాజమౌళి సోదరుడు క్లారిటీ!
Advertisement

Amrutham SS Kanchi:తెలుగు బుల్లితెర చరిత్రలో ‘అమృతం’ సీరియల్ ఒక అద్భుతం. ఎన్ని ఏళ్లు గడిచినా, ఎన్ని కొత్త షోలు వచ్చినా ఆ మ్యాజిక్ మాత్రం తగ్గలేదు. అయితే, మనల్ని కడుపుబ్బ నవ్వించిన ఆ ఎపిసోడ్ల వెనుక ఎన్నో ఆర్థిక కష్టాలు, సవాళ్లు ఉన్నాయని మీకు తెలుసా? ఆర్టిస్టుల కొరత నుంచి బడ్జెట్ పరిమితుల వరకు ఆ రోజుల్లో దర్శకుడు ఎస్.ఎస్. కాంచి ఎదుర్కొన్న వింత పరిస్థితులను ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ఆ విశేషాలు చూద్దాం..

వెయ్యి రూపాయల బడ్జెట్:

సీరియల్ ప్రారంభ రోజుల్లో టీవీ రంగంలో బడ్జెట్ చాలా తక్కువగా ఉండేదని ఎస్.ఎస్. కాంచి గుర్తు చేసుకున్నారు. ఒక్కో నటుడికి రోజుకు రూ. 1000 ఇవ్వడం కూడా అప్పట్లో ఒక పెద్ద సాహసంగా ఉండేదట. ఎవరైనా కాస్త అందంగా కనిపించే నటీమణులను లేదా ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్టులను పిలిస్తే, వారు రూ. 2000 నుండి 3000 వరకు డిమాండ్ చేసేవారట. ఆ స్థాయి బడ్జెట్ కేటాయించడం కుదరక, కాంచి ఒక వినూత్నమైన ఆలోచన చేశారు. బయటి నుండి నటులను తీసుకురావడం కంటే, అందుబాటులో ఉన్న వారితోనే పని కానిచ్చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయమే మనకు ఎంతోమంది సహజ నటులను పరిచయం చేసింది.

అసిస్టెంట్ డైరెక్టర్లే నటులుగా మారిన వేళ:

Advertisement

ఆర్టిస్టుల కొరతను అధిగమించడానికి కాంచి తన అసిస్టెంట్ డైరెక్టర్లను, సెట్ బాయ్స్‌ను కూడా నటులుగా మార్చేశారు. ఈ క్రమంలోనే మనందరికీ ఇష్టమైన ‘సర్వం’ (వాసు) పాత్ర పుట్టింది. వాసు నిజానికి ఒక అసిస్టెంట్ డైరెక్టర్. మొదట ఆఫీస్ క్లర్క్‌గా కనిపించిన ఆయన, ఆ తర్వాత కాలంలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్‌గా మారి ‘సర్వం’గా గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం వాసు మాత్రమే కాదు, షూటింగ్ చూడటానికి రోడ్డు మీద ఆగిపోయిన వారిని, తెలిసిన బంధువులను, చివరకు తన సొంత పిల్లలను కూడా కాంచి చిన్న చిన్న పాత్రల్లో సెట్స్ మీదకు ఎక్కించేవారు. అలా దొరికిన వారిని దొరికినట్లుగా మేకప్ వేసి కెమెరా ముందు నిలబెట్టేవారు.

ALSO READ:Hero Arjun: 46 ఏళ్ల కెరియర్లో చుట్టూ ఉన్నవాళ్లే నమ్మించి మోసం చేశారు.. హీరో అర్జున్ ఆవేదన

క్రియేటివిటీతో జయించిన కష్టాలు:

Advertisement

డబ్బులు లేకపోయినా, నటులు దొరక్కపోయినా కథలోని బలం, మేకింగ్‌లో చూపిన చాకచక్యం ‘అమృతం’ను ఒక క్లాసిక్ సినిమా రేంజ్‌లో నిలబెట్టాయి. బడ్జెట్ ఇబ్బందుల వల్ల అసిస్టెంట్లను నటులుగా వాడటం అనేది ఒకరకంగా సీరియల్‌కు ప్లస్ అయ్యింది. వారు చాలా సహజంగా నటించడంతో ప్రేక్షకులు త్వరగా కనెక్ట్ అయ్యారు. ఇక హను రాఘవపూడి వంటి వారు కూడా అప్పట్లో ముగ్గుల పోటీ ఎపిసోడ్ కోసం కాలనీ మహిళలను తీసుకువచ్చి షూటింగ్ పూర్తి చేసిన వైనం అప్పట్లో పెద్ద సెన్సేషన్. ఇలా కష్టాలను అవకాశాలుగా మలుచుకోవడం వల్లే అమృతం ఒక ఎవర్ గ్రీన్ సీరియల్ కాగలిగింది.

ఏదైనా గొప్ప పని వెనుక అంతులేని శ్రమ ఉంటుందని అమృతం సీరియల్ నిరూపించింది. బడ్జెట్ పరిమితులు ఉన్నప్పటికీ, సృజనాత్మకత ఉంటే అద్భుతాలు సృష్టించవచ్చని ఎస్.ఎస్. కాంచి చాటి చెప్పారు. ఆ శ్రమే నేటికీ మనల్ని నవ్విస్తూనే ఉంది.

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×