E-Paper
Advertisement

రూ.కోటి విలువ చేసే టికెట్లు ఫ్రీగా పంచిపెట్టిన హీరో.. అసలు నిజం తెలిస్తే షాక్!

రూ.కోటి విలువ చేసే టికెట్లు ఫ్రీగా పంచిపెట్టిన హీరో.. అసలు నిజం తెలిస్తే షాక్!
Advertisement

Tollywood: టాలీవుడ్‌లో ఇటీవల రిలీజైన ఓ సినిమా చుట్టూ జరుగుతున్న ప్రచారం, వెనుక ఉన్న అసలు సీన్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి నిలదొక్కుకున్న ఓ యంగ్ హీరో, తన లేటెస్ట్ సినిమా కోసం ఏకంగా తన పారితోషికంలో రూ.కోటి వదులుకుని ఫ్రీ టికెట్లు పంచాడనే వార్త వైరల్ అవుతోంది. సినిమాకి ఎలాగైనా జనాలు రావాలని, ఈ ప్లాన్ అమలు చేసినట్లు చెబుతున్నా, దాని వెనుక ఉన్న అసలు బాక్సాఫీస్ రియాలిటీ వేరేలా ఉంది.

కోటి రూపాయలతో ఫ్రీ టికెట్ల ప్లాన్:

ఈ సినిమా కోసం హీరో రూ.3 కోట్ల పారితోషికం ఒప్పుకోగా, ప్రస్తుత పరిస్థితులలో రూ.2 కోట్లు మాత్రమే తీసుకుని, మిగతా రూ.కోటిని వదులుకున్నాడట. ఆ కోటి రూపాయలతో నేరుగా టికెట్లు కొని ప్రేక్షకులకు ఉచితంగా పంచాలని డిసైడ్ అయ్యాడట. ఇలా ఉచిత టికెట్లతో థియేటర్లను హౌస్‌ఫుల్ చేసి, జనాలు వస్తే ఆటోమేటిక్గా పాజిటివ్ టాక్ వస్తుందనే ప్లాన్‌తో ఈ పబ్లిసిటీ గిమిక్ చేసినట్లు ఫిలింనగర్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

ఫేక్ కలెక్షన్లు.. ప్రొడక్షన్ హౌస్ హడావుడి:

Advertisement

అయితే రియాలిటీలో చూస్తే మాత్రం సీన్ పూర్తిగా భిన్నంcc ఉందంటున్నారు. థియేటర్ల వద్ద కలెక్షన్లు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, సినిమా సాలిడ్ వసూళ్లు సాధించిందంటూ ఏకంగా రూ.10 కోట్ల వరకు ఫేక్ కలెక్షన్ పోస్టర్లు వదులుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అసలు వసూళ్లకు, ప్రొడక్షన్ హౌస్ వేస్తున్న లెక్కలకు పొంతనే లేకుండా పోయిందని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.

also read:గౌతమ్ హీరోగా ఇండస్ట్రీ ఎంట్రీ అప్పుడే.. జయకృష్ణ క్లారిటీ!

పెయిడ్ ప్రమోషన్లతో ఆర్టిఫిషియల్ క్రేజ్:

Advertisement

కేవలం కలెక్షన్ల పోస్టర్లే కాకుండా.. బుక్ మై షో (BMS), ప్రముఖ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా పేజీలకు భారీగా డబ్బులిచ్చి సినిమాకు విపరీతమైన క్రేజ్ ఉందంటూ బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారని టాక్. ఆర్టిఫిషియల్ బజ్ కోసం అన్ని ప్లాట్‌ఫామ్‌లలో డబ్బులు ఖర్చు చేస్తున్నా, థియేటర్లలో మాత్రం అంతగా జనాలు కనిపించడం లేదని ఆడియన్స్ అంటున్నారు.

బయట నటన.. లోపల వేరే ప్లానింగ్:

సదరు హీరో బయట మీడియా ముందుకు వచ్చినప్పుడు ఎంతో అమాయకంగా, పద్ధతిగా నటిస్తూ ఇమేజ్ బిల్డప్ చేసుకుంటాడని.. కానీ లోపల మాత్రం కలెక్షన్ల కోసమే ఇలాంటి పబ్లిసిటీ స్టంట్లు, ఫేక్ కలెక్షన్ల గేమ్స్ ఆడిస్తున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక సినిమాను గట్టెక్కించడానికి ఆడుతున్న ఈ ‘ఫ్రీ టికెట్’ డ్రామాలు చివరకు ఎంతవరకు వర్కవుట్ అవుతాయో చూడాలి.

కంటెంట్ ఉంటేనే ప్రేక్షకులు వస్తారు:

ఉచితంగా టికెట్లు ఇచ్చి థియేటర్లు నింపడం లేదా సోషల్ మీడియాలో డబ్బులిచ్చి క్రేజ్ పెంచడం వల్ల తాత్కాలికంగా హడావుడి చేయవచ్చేమో కానీ, కంటెంట్‌లో దమ్ము లేకపోతే ప్రేక్షకులు ఆదరించరనేది అక్షర సత్యం. కేవలం నటనతో కాకుండా ఇలాంటి పబ్లిసిటీ స్టంట్లతో సినిమాలు ఆడించాలనుకోవడం బాక్సాఫీస్ దగ్గర ఎప్పుడూ రిస్కే.

Related News

నాగ చైతన్య ‘వృషకర్మ’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫౌజీ వాయిదా పడినట్టేనా?

మిర్జాపూర్ ఊచకోత.. రూ.200 కోట్లు ఇక లాంఛనమేనా ?

హనుమాన్ అంష్ 2లో విరాట్–అనుష్క.. నిజమేనా?

ఏంటీ ట్రెండ్ మామా.. టాలీవుడ్ హీరోలంతా 80ల్లోనే!

‘జనవరి 12 విడుదల’ పక్కా బ్లాక్ బస్టర్.. ఫస్ట్ రివ్యూ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్!

పిల్లలు ఉన్నా.. లేకపోయినా ఒకే అనుకున్నాం..కానీ: సమంత

ఫౌజీ అసలు వస్తుందా? ప్రభాస్ సినిమా చుట్టూ పెరుగుతున్న సస్పెన్స్!

ఫ్యాన్స్ అంటే సెలబ్రేషన్స్ మాత్రమే కాదు..మనసులు గెలిచిన అల్లు అర్జున్ ఫ్యాన్స్!

Big Stories

Advertisement
×