Jaya Krishna:సూపర్ స్టార్ కృష్ణ (Krishna)మనవడు, దివంగత రమేష్ బాబు (Ramesh Babu) కుమారుడు జయకృష్ణ(Jaya Krishna) ఘట్టమనేని హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. అజయ్ భూపతి (Ajay Bhupathi) దర్శకత్వంలో, వైజయంతి మూవీస్ అశ్వినీ దత్(Ashwini Dutt) సమర్పణలో రూపుదిద్దుకున్న ఈ సినిమా జులై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా బిగ్ టీవీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న జయకృష్ణ.. మహేష్ బాబు (Mahesh Babu) తనయుడు గౌతమ్ ఘట్టమనేని (Gautham ghattamaneni) ఎంట్రీకి సంబంధించిన సీక్రెట్ బయటపెట్టడంతో అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.
ఇంటర్వ్యూలో జయకృష్ణ మాట్లాడుతూ.. “ఘట్టమనేని కుటుంబంతో నిర్మాత అశ్వినీ దత్‌కు ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మహేష్ బాబును ‘రాజకుమారుడు’తో హీరోగా లాంచ్ చేసిన అశ్వినీ దత్, ఇప్పుడు తనను కూడా సమర్పిస్తూ ‘శ్రీనివాస మంగాపురం’ మూవీతో లాంచ్ చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. దత్ గారితో ప్రయాణం చేయడం తనకు దక్కిన గొప్ప గౌరవమని ఆనందం వ్యక్తం చేశారు.
ఇదే ఇంటర్వ్యూలో యాంకర్ శ్రీపాల్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. “గౌతమ్ ఘట్టమనేని హీరో ఎంట్రీపై జయకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “దత్ గారు నన్ను చూసి ‘నేనే నిన్ను లాంచ్ చేస్తాను’ అని చెప్పారు. ఆయనకు నేను నచ్చానో లేదో తెలియదు, కానీ అది నా అదృష్టం. ఇక మహేష్ బాబు అబ్బాయి గౌతమ్‌ను కూడా భవిష్యత్తులో ఆయనే లాంచ్ చేసేలా ఉన్నారు.. చూడాలి మరి!” అంటూ జయకృష్ణ నవ్వుతూ ఒక సీక్రెట్‌ను బయటపెట్టారు.
also read:నరేష్ మాటలకు స్టేజ్ దిగి వెళ్లిపోయిన బ్రహ్మాజీ.. అంత మాట అనేశాడు ఏంటి?
ఈ వ్యాఖ్యలతో ఘట్టమనేని అభిమానుల్లో సరికొత్త ఉత్సాహం నిండింది. వైజయంతి మూవీస్ బ్యానర్‌కు స్టార్ కిడ్స్‌ను పరిచయం చేసే మంచి సెంటిమెంట్ ఉంది. ఇప్పటికే మహేష్ బాబును, రామ్ చరణ్‌ను, అల్లు అర్జున్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేసిన అశ్విని దత్ హ్యాండ్ పడితే గౌతమ్ ఎంట్రీ ఏ రేంజ్‌లో ఉంటుందోనని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చర్చించుకోవడం మొదలుపెట్టారు.
జయకృష్ణ మాటలతో గౌతమ్ హీరోగా వెండితెరకు పరిచయమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జులై 30న రాబోతున్న ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో జయకృష్ణ ఘట్టమనేని వారసత్వాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని, త్వరలోనే గౌతమ్ కూడా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి అలరించాలని అభిమానులు కోరుకుంటున్నారు.