Mahash Babu:సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా సూపర్ స్టార్ హీరోగా పేరు దక్కించుకున్నారు. అలాంటి ఈయన ఇప్పుడు ఏకంగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నారు. వారణాసి అనే టైటిల్ తో రాబోతున్నారు. ఆఫ్రికన్ అడవులలో అడ్వెంచర్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు రుద్రా అనే పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పవర్ ఫుల్ పాత్ర కోసం ఆయన కలరియపట్టు అనే ప్రాచీన భారత యుద్ధ కళను నేర్చుకుంటున్నారు. ఇకపోతే మహేష్ బాబుతో పాటు ఇప్పటికే చాలామంది ప్రముఖులు, సెలబ్రిటీలు కూడా ఎంతో ఇష్టంతో ఈ కలరియపట్టు నేర్చుకుంటున్నారు.
అయితే దీనిని నేర్చుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు ఒకసారి చూద్దాం.. నిజానికి ఈ మధ్యకాలంలో బాడీని ఫిట్గా ఉంచుకోవడానికి.. మానసిక రుగ్మతల నుండి బయటపడడానికి చాలామంది ఈ కలరియపట్టు నేర్చుకుంటున్నట్లు స్పష్టం చేశారు
అందులో భాగంగానే సైనా నెహ్వాల్ బయోగ్రఫీలో కథానాయికగా తన నటనతో మెప్పించి తెలుగు వారి అభిమానాన్ని సొంతం చేసుకున్న పరిణీతి చోప్రా కూడా ఈ కలరియపట్టు నేర్చుకున్నట్లు ఒక ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించింది. దీన్ని సాధన చేస్తే బాడీ ఎంతో ఆక్టివ్ గా ఉన్నట్లు ఉంటుందని కూడా ఆమె చెప్పుకొచ్చింది.
అయితే ఏంటా కలరియపట్టు అంటే.. దీనిని కలరియపట్టు లేదా కలరి అనేది కేరళ రాష్ట్రంలో ఆవిర్భవించిన ఒక ద్రవిడ యుద్ద క్రీడ. దీనిని ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన యుద్ధ క్రీడగా కూడా అభివర్ణిస్తారు. ముఖ్యంగా కేరళ, శ్రీలంక, తమిళనాడు, మలేషియాలో ఉండే మలయాళీలు ఈ కళను తప్పకుండా ప్రదర్శిస్తారట. ముఖ్యంగా ఈ కలరియపట్టు శిక్షణలో వేగవంతమైన కదలికలు , ప్రతి చర్యలు , కంటి – చేతి ఏకీకరణ వంటివి ప్రాథమిక మోటార్ నైపుణ్యాలను మెరుగుపరుస్తాయి. దీనివల్ల మనసు, మెదడు, శరీరం అప్రమత్తంగా చురుకుగా ఉంటాయట.
ఇక దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే.. కలరియపట్టు శిక్షణలో బలం , ఓర్పు ప్రాముఖ్యతను నేర్చుకోవచ్చు. ఇది శరీర దృఢత్వాన్ని పెంచుతుంది. హృదయనాళ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వేగవంతమైన ఎరోబిక్ కదలికలు, శక్తివంతమైన దాడులు, హృదయ స్పందన రేటును కూడా పెంచుతాయి. రక్తప్రసరణ మెరుగుపడుతుంది .ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగ్గా ఉంటుంది . నరాల సమస్యలతో బాధపడే వారికి కలరియపట్టును నిపుణుల సమక్షంలో నేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుందట. అంతేకాదు ఈ కలరియపట్టులో ఏకాగ్రత నైపుణ్యాన్ని కూడా పెంచుకోవచ్చు. ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్లు సమాచారం.
ALSO READ:Emmanuel: కాబోయే భార్యను పరిచయం చేసిన ఇమ్మానుయేల్.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?