E-Paper
Advertisement

Emmanuel: కాబోయే భార్యను పరిచయం చేసిన ఇమ్మానుయేల్.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?

Emmanuel: కాబోయే భార్యను పరిచయం చేసిన ఇమ్మానుయేల్.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?
Advertisement

Emmanuel: స్టాండ్ అప్ కమెడియన్ గా కెరియర్ మొదలుపెట్టి.. జబర్దస్త్ లోకి కమెడియన్ గా అడుగుపెట్టి.. తన అద్భుతమైన డైలాగ్ లతో కామెడీ పంచ్ లతో విపరీతమైన పాపులారిటీ సొంతం చేసుకున్నారు ఇమ్మానుయేల్ (Emmanuel). టీంలో మెంబెర్ గా జాయిన్ అయిన తర్వాత అటు జడ్జిలను ఇటు ఆడియన్స్ ని మెప్పించి.. టీం లీడర్ గా కూడా ఎదిగారు. అంతేకాదు పలు చిత్రాలలో కూడా కమెడియన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించిన ఇమ్మానుయేల్ ఇటీవల బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. టైటిల్ విజేత అవుతారని అందరూ అనుకున్నారు. కానీ టాప్ ఫైవ్ తో సరి పెట్టుకున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే తాను ఒక అమ్మాయిని ప్రేమించానని.. హౌస్ నుండి బయటకు వెళ్లిన తర్వాత ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పిన విషయం తెలిసిందే.

కాబోయే భార్యను పరిచయం చేసిన ఇమ్మానుయేల్..

అయితే ఇప్పుడు ఎట్టకేలకు ఆ అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నట్లు తన ఇన్స్టా స్టేటస్ ద్వారా ప్రకటించారు ఇమ్మానుయేల్. తన చేతితో ఆమె చేయిని పట్టుకొని ఒక అందమైన ఫోటోని షేర్ చేస్తూ.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నానని ప్రకటించారు. మొత్తానికైతే ఇమ్మానుయేల్ కొత్త ఏడాది శుభవార్త చెప్పబోతున్నారని తెలుస్తోంది. అంతేకాదు తాను పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని అభిమానులతో పంచుకోవడంతో అభిమానులు అటు సెలబ్రిటీలు కూడా ఇమ్మానుయేల్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఆ అమ్మాయి ఎవరు? బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అనే విషయాలను మాత్రం ఇమ్మానుయేల్ వెల్లడించలేదు.

లవ్ స్టోరీ రివీల్ చేసిన ఇమ్మానుయేల్..

Advertisement

కానీ ఆమె పేరు రుచి అని మాత్రం తెలుస్తోంది.అటు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు తన లవ్ స్టోరీ గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు ఇమ్మానుయేల్. హౌస్ లో ఉన్నప్పుడు ఇమ్మానుయేల్ మాట్లాడుతూ..”ఒక స్టాండప్ కమెడియన్ గా నేను ఎన్నో షోలు చేశాను. అయితే ఎవరు గుర్తుపట్టలేదు. కానీ ఇన్స్టా లో ఒక రోజు నాకు ఒక పెద్ద మెసేజ్ వచ్చింది. మీ స్టాండప్ కామెడీ నాకు బాగా నచ్చింది. ఒక వ్యక్తి ఇంత మందిని నవ్వించగలడా అనిపించింది. అంటూ ఒక అమ్మాయి మెసేజ్ చేసింది. నేను థాంక్స్ చెబితే.. మీకు ఓకే అయితే నంబర్ ఇస్తారా? అని కూడా అడిగింది. వెంటనే ఫోన్ నెంబర్ ఇచ్చాను. తర్వాత ఇద్దరం మాట్లాడుకోవడం మొదలుపెట్టాము.

ఇమ్మానుయేల్ కాబోయే భార్య బ్యాక్ గ్రౌండ్..

కొన్నాళ్ల తర్వాత ఆమె డాక్టర్ కోర్స్ చేస్తున్నానని చెప్పింది. అప్పుడే అనిపించింది.. ఏంటి నేను డాక్టర్ని కూడా నవ్వించగలిగానా? అని.. నా ఫేస్ చూసి ఇష్టపడిందనుకోవడానికి నేను అంత అందగాడిని కాదు.. నా సంపాదన చూసి ఇష్టపడిందనుకోవడానికి అప్పటికి నా దగ్గర గుర్తింపు లేదు.. డబ్బు లేదు.. నేను ఎలా ఉంటానో నాకు తెలుసు. అయితే ఆమెతో మాట్లాడిన తర్వాత ఆ అమ్మాయిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని అప్పుడే అనిపించింది. నేను అమ్మాయి ఫోటో కూడా చూడలేదు. కానీ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని.. వెంటనే నీకు ఇష్టమైతే చెప్పు మా అమ్మ వాళ్లకి చెప్పి పెళ్లి చేసుకుంటాను అన్నాను.

Advertisement

ALSO READ:Drugs Case: డ్రగ్స్ కేసులో హీరోయిన్ సోదరుడు పరారీ.. గాలిస్తున్న పోలీసులు

అప్పుడే ఫిక్స్ అయ్యా..

దీంతో ఆమె కాస్త టైం అడిగింది. ఆ తర్వాత మా ఇంట్లో వాళ్లకు పరిచయం చేశాను. కలుద్దామని అడిగితే.. వద్దు ఊరు వెళ్తున్నాను.. కారు ఉంటే తీసుకురా కలిసి వెళ్దామని చెప్పింది. అప్పటికి నా దగ్గర కారు లేదు. ఫ్రెండ్ ని అడిగి కారు తీసుకుని.. పెట్రోల్ కి డబ్బులు సెట్ చేసుకొని ఆమెతో నాలుగు గంటలు ప్రయాణం చేశాను. అప్పుడే ఆమెను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. ఆమెను చాలా ఇబ్బంది పెట్టాను. ఆమె కోసం ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. ఇక్కడికి వచ్చాకే ఆమె విలువ తెలిసింది ” అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు అదే అమ్మాయిని ఇమ్మానుయేల్ పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.. మొత్తానికైతే ఇమ్మానుయేల్ చేసుకోబోయే అమ్మాయి రుచి అని, ఆమె ఒక డాక్టర్ అని మాత్రమే తెలుస్తుంది. కానీ ఆమె ఎలా ఉంటుంది అనే విషయాలను ఆయన షేర్ చేయలేదు.

Related News

Intinti Ramayanam : పల్లవి అవుట్.. ఫ్యాన్స్ కు మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..

Gundeninda GudiGantalu Today episode: బాలుకు ఘోర అవమానం.. ప్రభాకు మైండ్ బ్లాక్ .. మీనా దెబ్బకు సంజు షాక్..

Podarillu Today Episode : మాధవ్ కు ఏమైంది..? చక్రీ ప్లాన్ సక్సెస్.. మాధవ్ పెళ్లి చూపులు ఫిక్స్..?

Ninnu kori Serial Today Episode September 3rd ‘నిన్ను కోరి’ సీరియల్‌: కామాక్షి, శృతి ల ప్లాన్ సక్సెస్ – చంద్ర ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్     

Karthika Deepam 2 Serial Today Episode September 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పార్కులో  జ్యోత్స్నను కలిసిన సూరజ్            

Illu Illalu Pillalu Today Episodes: లేచిపోయిన తిరుపతి.. ధీరజ్ ప్లాన్ వర్కౌట్.. నర్మద ప్లాన్ సూపర్..

Intinti Ramayanam Today Episode: పల్లవి దెబ్బకు పార్వతి షాక్.. కమల్ కు అనుమానం.. రాజేంద్రకు నిజం తెలుస్తుందా..?

Thursday Movies in Tv : గురువారం టీవీ సినిమాలు.. పవన్ ఫ్యాన్స్ కు పునకాలే..

Big Stories

Advertisement
×