E-Paper
Advertisement

Allu Arjun Movie : పుష్ప తర్వాత ఇన్ని కథలు విన్నావా… అవార్డు ఇవ్వాలి బ్రో నీకు

Allu Arjun Movie : పుష్ప తర్వాత ఇన్ని కథలు విన్నావా… అవార్డు ఇవ్వాలి బ్రో నీకు
Advertisement

Allu Arjun Movie: టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అల్లు వారసుడిగా అడుగుపెట్టి తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకొని తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా మంచి సక్సెస్ అందుకున్నారు నటుడు అల్లు అర్జున్(Allu Arjun). ఇలా సౌత్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో నటించిన పుష్ప(Pushpa) సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ సినిమాకు సీక్వల్ గా పుష్ప 2 ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద 1800 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది.

అల్లు అర్జున్ కోసం ఇంత మంది వచ్చారా?

ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో అల్లు అర్జున్ క్రేజ్ పాన్ ఇండియా స్థాయిలో మారుమోగి పోవడంతో అల్లు అర్జున్ తో సినిమా చేయడం కోసం ఎంతోమంది దర్శకులు ఆసక్తి చూపించారు. ఈ క్రమంలోనే పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ కు స్క్రిప్ట్ చెప్పిన దర్శకుల జాబితా చూస్తే మాత్రం ఆశ్చర్యం వ్యక్తం చేయక మానరు. మరి ఈ జాబితాలో ఏ ఏ డైరెక్టర్లు ఉన్నారనే విషయానికి వస్తే… పుష్ప సినిమా తర్వాత ఇతర భాష దర్శకులు కూడా అల్లు అర్జున్ ని కలిసి కథ చెప్పటం విశేషం.

ఇతర భాష దర్శకులు..

Advertisement

ఈ జాబితాలో.. బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీల భన్సాలీ, కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ప్రశాంత్ నీల్, తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్, ఇక టాలీవుడ్ డైరెక్టర్ల విషయానికి వస్తే సందీప్ రెడ్డివంగా, త్రివిక్రమ్ శ్రీనివాస్, సురేందర్ రెడ్డి, బోయపాటి శ్రీను వంటి దర్శకులు ఈ జాబితాలో ఉన్నారు. ఈ జాబితాలో కొంతమంది దర్శకుల పేర్లు మాత్రమే బయటకు వచ్చాయి కానీ అనధికారికంగా చాలామంది డైరెక్టర్లు అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతూ ఆయనకు కథలు కూడా వినిపించారని తెలుస్తోంది.

అట్లీ సినిమా పనులలో బిజీగా బన్నీ..

Advertisement

ఇక ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పుష్ప సినిమా తర్వాత బన్నీ ఇన్ని కథలు విన్నారా? వామ్మో ఇలా ఇంతమంది డైరెక్టర్లతో ఇన్ని కథలు విన్నందుకు మీ ఓపికకు అవార్డు ఇవ్వాల్సిందే అంటూ కామెంట్ లు చేస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ కెరీర్ విషయానికి వస్తే ఈయన కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే 50 శాతం షూటింగ్ పనులు పూర్తి అయ్యాయని తెలుస్తోంది. ఇంకా ఈ సినిమాని 2027 లో విడుదల చేయబోతున్నట్లు సమాచారం అయితే మరొక డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో కూడా అల్లు అర్జున్ సినిమా దాదాపు ఖరారు అయింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Also Read: Singer Mangli: అక్క నన్ను క్షమించు.. మంగ్లీపై మరో వీడియో పెట్టిన మేడిపల్లి స్టార్

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×