E-Paper
Advertisement

Singer Mangli: అక్క నన్ను క్షమించు.. మంగ్లీపై మరో వీడియో పెట్టిన మేడిపల్లి స్టార్

Singer Mangli: అక్క నన్ను క్షమించు.. మంగ్లీపై మరో వీడియో పెట్టిన మేడిపల్లి స్టార్
Advertisement

Singer Mangli: ఫోక్ సింగర్ గా మంచి సక్సెస్ అందుకున్న మంగ్లీ (Mangli)ఇటీవల బాయిలోనే బల్లి పలికే అనే పాట ద్వారా మరోసారి ట్రెండింగ్ లో ఉన్నారు. ఇక ఈ పాట పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే పాట వినపడుతోంది.ఇప్పటికే ఎంతోమంది ఈ పాటకు రీల్స్ చేస్తూ వీడియోలను షేర్ చేస్తున్నారు ఇలా ఈ పాటకు ఎంత ఆదరణ లభించిందో అలాగే ఈ పాటపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. బాయిలోనా బల్లి పలికే పాట విషయంలో “మేడిపల్లి స్టార్” తన ఇంస్టాగ్రామ్ లో ఈ పాట గురించి, మంగ్లీ గురించి, ఈ పాటలోని పదాల గురించి చాలా అసభ్యకరంగా మాట్లాడుతూ ఒక వీడియో చేశారు.

పోలీసుల అదుపులో మేడిపల్లి స్టార్..

ఈ వీడియో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా ఇది కాస్త మంగ్లీ దృష్టికి వెళ్లడంతో ఆమె మేడిపల్లి స్టార్ వీడియో పట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై సీరియస్ అయిన మంగ్లీ ఎస్ ఆర్ నగర్ పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇలా ఈమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కూడా సైబర్ టీమ్ ఆధారంగా నిందితుడి వివరాలను సేకరించి వెంటనే అదుపులోకి తీసుకున్నారు. తాజాగా మేడిపల్లి స్టార్ కి సంబంధించిన మరొక వీడియో వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియోలో భాగంగా ఆయన మంగ్లీకి క్షమాపణలు చెబుతున్నట్టు తెలియజేశారు.

మంగ్లీకి క్షమాపణలు..

Advertisement

ఈ పాట ట్రెండింగ్ లో ఉన్న నేపథ్యంలోనే అలా మాట్లాడానని ఇకపై ఇలాంటి తప్పు చేయను నన్ను క్షమించు అక్క అంటూ క్షమాపణలు కోరుతూ వీడియో చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంగ్లీ గురించి పచ్చి బూతులు మాట్లాడిన నేపథ్యంలోనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఈ నిందితులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఫాలోవర్లను సొంతం చేసుకోవడం కోసమే ఇలాంటి వివాదాస్పదమైన వీడియోలను పోస్ట్ చేస్తుంటారని పోలీసులు వెల్లడించారు. ఫాలోయింగ్ పెంచుకోవడం కోసం వినోదం పేరుతో హద్దులు మీరి మహిళలను కించపరిచే విధంగా మేడిపల్లి స్టార్ వ్యవహార శైలి ఉందని, ఈ విషయంపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

Advertisement

మంగ్లీ ఫిర్యాదు చేసిన కేవలం 24 గంటల వ్యవధిలోని నిందితుడిని అరెస్టు చేయడంతో మంగ్లీ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక మంగ్లీ విషయానికి వస్తే ఈమె ఫోక్ సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక తరచూ ఇలాంటి ఆల్బమ్స్ చేస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. అలాగే ప్లే బ్యాక్ సింగర్ గా కూడా మంగ్లీ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈమె తెలుగు పాటలతో పాటు ఇతర భాషలలో కూడా పాటలను పాడుతూ, మరోవైపు ఆల్బమ్స్ అంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

Also Read: Paanch Minaar OTT: థియేటర్లోకి వచ్చిన వారానికే ఓటీటీలోకి పాంచ్ మినార్!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×