Spirit : ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో సందీప్ రెడ్డి వంగ ఒకరు. తీసినవి కేవలం రెండు సినిమాలు అయినా కూడా తనకున్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. వాస్తవానికి తీసినవు మూడు సినిమాలు. ఒక సినిమా రీమేక్ కాబట్టి దాన్ని పెద్దగా సందీప్ రెడ్డి వంగ కూడా లెక్క పెట్టడు. మొదటి సినిమాతోనే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అసలు సిసలైన దర్శకుడు వచ్చాడు అనిపించుకున్నాడు.
అదే సినిమాను బాలీవుడ్ లో తీస్తే వైలెంట్ ఫిలిం అని కామెంట్ చేశారు. వాళ్లందరికీ కూడా అసలైన వైలెంట్ ఫిలిం అంటే ఎలా ఉంటుందో యానిమల్ సినిమా తీసి రుచి చూపించాడు. ఆ సినిమా ఒక సెన్సేషన్. బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 1,000 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది యానిమల్. ఒక ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ ప్రభాస్తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
సందీప్ రెడ్డి వంగ మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని. సందీప్ గురించి మినిమం ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్లకు కూడా ఇది తెలుస్తుంది. సందీప్ రెడ్డి వంగ ఆఫీసులో మెగాస్టార్ చిరంజీవి ఫోటో కూడా ఉంటుంది. అయితే నేడు ప్రభాస్ స్పిరిట్ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు జరిగాయి.
మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా ఆ పూజా కార్యక్రమానికి హాజరయ్యారు. దీనికి సంబంధించి ఫోటోలు కూడా విడుదలయ్యాయి. అయితే మెగాస్టార్ చిరంజీవితో సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ టీం అంతా కలిసి ఫోటో దిగారు. ఆ ఫోటోలో రవితేజ తనయుడు మహదన్, అలానే త్రివిక్రమ్ శ్రీనివాస్ తనయుడు రిషి కూడా ఉన్నారు.
సందీప్ రెడ్డి వంగా దగ్గర ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు గిరీషయ్యా. అర్జున్ రెడ్డి సినిమాను తమిళ్ లో ఆదిత్య వర్మ పేరుతో ఇతనే దర్శకత్వం వహించాడు. అయితే ఆ సినిమా అక్కడ కూడా ఒక డీసెంట్ సక్సెస్ అందుకుంది. ధ్రువ విక్రమ్ ఈ సినిమాతోనే హీరోగా పరిచయమయ్యాడు.
ఆ దర్శకుడు మళ్ళీ తెలుగులో వైష్ణవ తేజ్ హీరోగా రంగ రంగ వైభవంగా అనే సినిమాను చేశాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది. అయితే అదే దర్శకుడు ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ డిపార్ట్మెంట్తో పాటు కనిపిస్తున్నారు. అంటే మళ్లీ దర్శకుడుగా కాకుండా అసిస్టెంట్ గా సందీప్ రెడ్డి వంగా దగ్గర జాయిన్ అయిపోయాడా అనేది చాలామందికి వస్తున్న సందేహం.
Also Read: Spirit : ప్రభాస్ ముహూర్తంలో కనిపించలేదు, కానీ సందీప్ హై ఇచ్చాడు