Anil Ravipudi: టాలీవుడ్ ఇండస్ట్రీలో అపజయం ఎరుగని డైరెక్టర్లలో రాజమౌళి తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న వారిలో అనిల్ రావిపూడి(Anil Ravipudi) ఒకరు. ఇప్పటివరకు అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన సినిమాలు ఏవి కూడా ప్రేక్షకులను నిరాశపరచలేదు.ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం అంటూ సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ అందుకున్న అనిల్ రావిపూడి వచ్చే సంక్రాంతి పండుగ సందర్భంగా మన శంకర వరప్రసాద్ గారు(MSVPG) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా అనిల్ రావిపుడి ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా ఈయన బెజవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం అక్కడ ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా అనిల్ రావిపూడి మన శంకర వరప్రసాద్ గారి సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు .అయితే మీడియా వారి నుంచి ఇటీవల ది రాజా సాబ్(The Raja Saab) సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా ప్రభాస్(Prabhas) సంక్రాంతి సినిమాల గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి .ఈ సంక్రాంతికి చాలా సినిమాలు వస్తున్నాయి. ఈ సంక్రాంతి సినిమాలన్నీ కూడా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకున్నారు.
సంక్రాంతికి ఎన్ని సినిమాలు వచ్చిన సీనియర్లు సీనియర్లే అంటూ ఈయన సీనియర్ హీరోల గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు. ఇలా సంక్రాంతి సినిమాలన్నింటితో పాటు మా సినిమా కూడా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నానని మాట్లాడారు. ఈ విషయంపై ప్రశ్న ఎదురు కావడంతో అనిల్ రావిపూడి మాట్లాడుతూ ఈ విషయం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను.. ప్రభాస్ లాంటి ఒక పాన్ ఇండియా స్టార్ హీరో సీనియర్ హీరోల సినిమాల గురించి మాట్లాడాల్సిన పనిలేదు. కానీ ప్రభాస్ మాట్లాడటం నిజంగా గ్రేట్ అని తెలిపారు.
అందుకే డార్లింగ్ అయ్యారు..
ఇలా సీనియర్లు సీనియర్లే అంటూ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కు నిజంగా హ్యాట్సాఫ్. ప్రభాస్ అసలు వ్యక్తిత్వం ఇదేనని, అలా చెప్పడం నిజంగా గ్రేట్ అంటూ ప్రభాస్ మంచితనం పై ప్రశంసలు కురిపించడమే కాకుండా అందుకే ఆయన డార్లింగ్ అయ్యారు అంటూ అనిల్ రావిపూడి తెలియజేశారు. అందుకే మేము కూడా ది రాజా సాబ్ ప్రీమియర్ల రోజు అందరూ థియేటర్ కి వెళ్లి పెద్ద ఎత్తున సెలెబ్రేట్ చేయబోతున్నామని అనిల్ రావిపూడి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Also Read: Jana Nayagan Record: జన నాయగనన్ విడుదల వేళ.. కొత్త రికార్డు సృష్టించిన విజయ్!