E-Paper
Advertisement

Dangerous Roads: ఖర్దుంగ్ లా To సేలా పాస్.. ఈ రోడ్ల మీద ప్రయాణం అంటే ప్రాణం మీద ఆశ వదిలేయాల్సిందే!

Dangerous Roads: ఖర్దుంగ్ లా To సేలా పాస్.. ఈ రోడ్ల మీద ప్రయాణం అంటే ప్రాణం మీద ఆశ వదిలేయాల్సిందే!
Advertisement

Dangerous Roads India: గత దశాబ్ద కాలంగా దేశంలో రహదారులు అత్యంత వేగంగా విస్తరిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో అద్భుతమైన రోడ్ల నిర్మాణం జరుగుతుంది. ఇండియాలో మంచి రోడ్లతో పాటు అత్యంత ప్రమాకరమైన రోడ్లు కూడా ఉన్నాయి. ఈ రోడ్ల మీద ప్రయాణం అంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిందే. హైవేలు, అధికారిక డేటా ప్రకారం దేశంలో ఉన్న టాప్ డేంజరస్ రోడ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ ఖర్దుంగ్ లా (Khardung La)       

ఇది లడఖ్ లో లేహ్-నుబ్రా మధ్యలో ఉంటుంది. సముద్ర మట్టానికి 5,359 కి.మీ ఎత్తులో ఉంటుంది. అత్యధిక ఎత్తు,   స్నో/ఐస్, ఆక్సిజన్ లాక్, షార్ప్ టర్న్స్ కారణంగా వరల్డ్ హయెస్ట్ మోటరబుల్ రోడ్‌లలో ఒకటిగా నిలిచింది. మంచు, ఆల్టిట్యూడ్ సిక్‌నెస్ వల్ల ప్రమాదాలు జరుగుతాయి. బైకర్స్ ఫేవరెట్. కానీ, ఎక్స్‌ పీరియెన్స్‌డ్ డ్రైవర్స్ మాత్రమే ఇక్కడ నడపడం మంచిది.

⦿ జోజి లా (Zoji La)       

Advertisement

ఇది జమ్మూకాశ్మీర్ లోని లడఖ్ లో  ఉంటుంది. సముద్ర మట్టానికి 3,528 ఎత్తులో ఉంటుంది. నారో, అన్‌ పేవ్డ్ రోడ్, ల్యాండ్‌స్లైడ్స్, షార్ప్ డ్రాప్స్ ఉంటాయి.        శ్రీనగర్-లేహ్ కనెక్ట్ గా ఉంటుంది. వింటర్‌ లో క్లోజ్ అవుతుంది. ఒక్క వెహికల్ మాత్రమే పాస్ అవుతుంది.

⦿ కిష్త్వార్-కిల్లార్ రోడ్ (Kishtwar-Killar)

జమ్మూ, కాశ్మీర్ లో ఉంటుంది. 3,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఓవర్‌ హ్యాంగింగ్ క్లిఫ్స్, నో గార్డ్‌ రైల్స్, నారో ట్రాక్ కారణంగా ప్రమాదాలు జరుగుతుంటాయి. స్కేరియెస్ట్ రోడ్ ఇన్ ఇండియా అని పిలుస్తారు. ఒక్క చిన్న మిస్టేక్‌తో వేల అడుగుల డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది.

⦿ NH-22 (హిందుస్తాన్-టిబెట్ రోడ్)      

Advertisement

హిమాచల్ ప్రదేశ్ లో ఉంటుంది. క్లిఫ్ కట్ రోడ్, రాక్‌ఫాల్స్, షార్ప్ టర్న్స్, నో బారియర్స్ కారణంగా ప్రమాదాలు జరుగుతాయి.  హైవే టు హెల్ అని పిలుస్తారు.

⦿ రోహ్తంగ్ పాస్ (Rohtang Pass)

హిమాచల్ (మనాలి-లేహ్)లో ఉంటుంది. సముద్ర మట్టానికి 3,979 మీటర్ల ఎత్తులో ఉంటుంది. స్నో, ల్యాండ్‌ స్లైడ్స్, నారో రోడ్, ట్రాఫిక్ జామ్స్ కారణంగా ప్రమాదాలు జరుగుతాయి. పైల్ ఆఫ్ కార్ప్సెస్ అని పిలుస్తారు. మంచు వల్ల చాలా ప్రమాదాలు జరుగుతాయి.

⦿ చాంగ్ లా (Chang La) 

లడఖ్ (లేహ్-పాంగాంగ్) లో ఉంటుంది. సముద్ర మట్టానికి 5,360 మీటర్ల ఎత్తులో ఉంటుంది. హై ఆల్టిట్యూడ్, స్నో, స్లిప్పరీ రోడ్ కారణంగా ప్రమాదాలు జరుగుతాయి. థర్డ్ హయెస్ట్ మోటరబుల్ పాస్ ఇది. ఆక్సిజన్ లాక్,  కోల్డ్ వల్ల రిస్క్ ఉంటుంది.

⦿ నాథు లా (Nathu La) 

ఇది సిక్కిం (ఇండియా-టిబెట్)లో ఉంటుంది. సముద్ర మట్టానికి 4,310 మీటర్ల ఎత్తులో ఉంటుంది. హై ఆల్టిట్యూడ్, స్నో, షార్ప్ బెండ్స్ కారణంగా ప్రమాదాలు జరుగుతాయి. సిల్క్ రూట్ భాగంగా ఉంటుంది. ఇక్కడి నుంచి వెళ్లాలంటే పర్మిట్ అవసరం. బోర్డర్ ఏరియా కావడం వల్ల స్ట్రిక్ట్ గా ఉంటుంది.

⦿ లేహ్-మనాలి హైవే (Leh-Manali Highway)     

హిమాచల్-లడఖ్ లో ఉంటుంది. మల్టిపుల్ పాస్‌లు, వాటర్ క్రాసింగ్స్, రఫ్ టెర్రైన్ కారణంగా ప్రమాదాలు జరుగుతుంటాయి. టాంగ్‌ లాంగ్ లా, బరలాచా లా వంటి పాస్‌లు ఉన్నాయి. ఎక్స్‌ ట్రీమ్ వెదర్ పరిస్థితులను కలిగి ఉంటుంది.

ఈ రోడ్లు అద్భుతమైన వ్యూస్ ఇస్తాయి. కానీ, ఎక్స్‌ పీరియెన్స్‌డ్ డ్రైవర్స్, 4WD వెహికల్స్, పర్మిట్స్ అవసరం. మంచు సీజన్‌లో అవాయిడ్ చేయడం మంచిది.

Read Also:లో మెయింటెనెన్స్.. ఫన్ టు డ్రైవ్- సోలో ట్రావెలర్స్ కు బెస్ట్ కార్లు ఇవే!

Related News

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

ప్రయాణికులకు అలర్ట్.. 36 రోజుల పాటు రైళ్లకు అంతరాయం!

రైలులో సిగరెట్ తాగిన వేస్ట్ ఫెలో.. ఒక్కసారే రైల్లో అలజడి, ఏమైందా అని చూస్తే..

రూ.50 వేల బడ్జెట్‌లో ఫారిన్ ట్రిప్.. భారతీయుల కోసం ఈ 7 దేశాలు బెస్ట్

200 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల.. రథంపై ఊరేగించి ఘన స్వాగతం!

అందంగా కనిపిస్తాయి.. కానీ, అడుగు పెడితే అంతే సంగతులు!

Big Stories

Advertisement
×